యూదుల ప్రాణాలు రక్షించిన ముస్లిములు – అన్ టోల్డ్ స్టోరీ

నేడు వేల కొద్దీ పాలస్తీనా ముస్లిములను యూదులు నిర్దాక్షనీయంగా చంపుతున్న నేపథ్యంలో ఆ యూదుల్నే ఒకనాడు పారిస్ మహానగరంలో ముస్లిములు తమ ప్రాణాలను సైతం లెక్క చెయ్యక నాజీ హలోకాస్ట్ జరుగుతున్న సమయంలో యూదుల ప్రాణాలు కాపాడటం కోసం వారికి ముస్లిం ఫేక్ ఐడెంటిటీలు కల్పించి “గ్రాండ్ మాస్క్ ఆఫ్ పారిస్” మసీదులో వారికి ఆశ్రయం కల్పించి వారి ప్రాణాలు రక్షించిన చరిత్ర మీలో ఎవరికైనా తెలుసా?

అది రెండవ ప్రపంచ యుద్ధం జరుగుతున్న సమయం. అప్పుడు ఫ్రాన్స్ ను ఆక్రమించిన జర్మన్లు అక్కడ నివశిస్తున్న యూదులను జనహననం చేసి చంపుతున్న నేపథ్యంలో వేల కొద్దీ యూదుల ప్రాణాలు రక్షించటానికి “ద గ్రాండ్ మాస్క్ ఆఫ్ పారిస్” వేదికగా మారింది.

ఫ్రాన్స్ ను నాజీలు ఆక్రమించుకుని స్థానిక యూదులపై హింసాకాండ సాగిస్తున్న నేపథ్యం అది. సరిగ్గా అదే సమయంలో యూదుల కోసం పారిస్ లోని గ్రాండ్ మసీదు ఆశాకిరణంగా మారింది. నాజీల దౌర్జన్యం నుండి ప్రాణాలు కాపాడుకోటానికి యూదులు “గ్రాండ్ మాస్క్ ఆఫ్ పారిస్” మసీదులో తల దాచుకున్నారు.

నాజీల కంట పడకుండా తమ ప్రాణాలకు తెగించి యూదుల ప్రాణాలు కాపాడటానికి మసీదు అధికార బృందం నడుం బిగించింది. “ఒక మనిషి ప్రాణాలు కాపాడితే సమస్త మానవాళి ప్రాణాలు రక్షించినట్టే” అన్న ఖురాన్ వాక్యాన్ని ఆధారం చేసుకుని నాజీలు సాగిస్తున్న హాలోకాస్ట్ నుండి యూదుల ప్రాణాలు ఏదోలా రక్షించటం కోసం వారంతా ముస్లిములంటూ ‘నకిలీ గుర్తింపు ధృవీకరణ పత్రాలు’ జారీ చేశారు.

ఈ ఆపరేషన్ కు నాయకత్వం వహించిన ముస్లిం లీడర్ “సి కద్దూర్ బెంఘబ్రిట్”. యూదుల ప్రాణాలను రక్షించటంలో ఆయన చూపిన సాహసాన్ని గుర్తిస్తూ 1946 లో ఫ్రాన్స్ ప్రభుత్వం ‘లెజియన్ ఆఫ్ ఆనర్’ అనే అత్యున్నత పురస్కారంతో సత్కరించింది.

“ద గ్రాండ్ మాస్క్ ఆఫ్ పారిస్”లో ఆనాడు జర్మన్ల నుండి తప్పించుకుని మసీదులో తలదాచుకున్న యూదుల్లో ఆల్బర్ట్ అస్సౌలిన్ ఒకడు. అతను ఆనాడు మసీదులో దాక్కుని ప్రాణాలు కాపాడుకున్న యూదులు మొత్తం 1732 కంటే తక్కువకాదని తరువాతి కాలాల్లో తన అనుభవాన్ని పేర్కొన్నాడు.

ఫ్రాన్స్ లో ఒకప్పుడు జరిగిన ఈ గొప్ప సంఘటన చరిత్రలో మరుగున పడిపోయింది. కానీ ఈ అరుదైన సంఘటనను వెలుగులోకి తెస్తూ “ది గ్రాండ్ మాస్క్ ఆఫ్ పారిస్: ఎ స్టోరీ ఆఫ్ హౌ ముస్లిమ్స్ రెస్క్యూడ్ జ్యూస్ డ్యూరింగ్ ద హాలోకాస్ట్” పేరుతో ‘కరేన్ గ్రే ర్యుఎల్’ అనే ఓ ప్రముఖ రచయిత్రి ఒక పుస్తకాన్ని రచించటం జరిగింది.

పారిస్ గ్రాండ్ మసీదు ముస్లిములు హాలోకాస్ట్ నుండి యూదుల ప్రాణాలను ఎలా చాకచక్యంగా రక్షించారో బొమ్మలతో సహా వివరిస్తూ ఈ పుస్తకాన్ని ఎంతో చక్కగా రచించటం జరిగింది. ఆశక్తి ఉన్నవారు అమెజాన్ లో ఈ పుస్తకాన్ని కొని చదువుకోవచ్చు.

అంతేకాదు చరిత్రలో మరుగున పడిపోయిన ఆనాటి సంఘటనను వెలుగులోకి తెస్తూ 2011 లో “ఫ్రీ మెన్” అనే పేరుతో ఫ్రెంచ్ సినిమా కూడా నిర్మించటం జరిగింది. ఆశక్తి ఉన్నవారు నెట్ ఫ్లిక్స్ లో చూడవచ్చు.

ఆ విధంగా ఫ్రాన్స్ లో ముస్లిముల సహాయంతో ప్రాణాలు కాపాడుకున్న యూదులు 1948 తరువాత పాలస్తీనాకు చేరుకున్నాక అక్కడి ముస్లిములు వారికి ఆశ్రయం కల్పించారు. ఇంకా అనేక దేశాల నుండి యూదులు అక్కడకు రావటం ప్రారంభించారు.

క్రమంగా ఆ భూభాగం వేల సంవత్సరాల క్రితం తమ తాత ముత్తాతలదని చెప్పి దాన్ని ఆక్రమించుకుని, ఒకప్పుడు యూదుల ప్రాణాలు కాపాడి, వారికి ఉండటానికి స్థలం ఇచ్చి ఆదుకున్న ముస్లిములనే చంపి, వారి రక్తాన్ని చిందించిన స్థలంలోనే యూదులు ఒక దేశాన్ని నిర్మించుకున్నారు దానిపేరే “ఇశ్రాయీల్”

Md Nooruddin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *