జంతుబలులు, మాంసాహారం మహాపాపం, గోవధను నిషేధించాలంటూ కొందరు లేవనెత్తే నినాదాలు కేవలం కొందరి మతత్వ రాజకీయ నినాదాలు మాత్రమే అనటం అతిశయోక్తి కాదు.
జంతుబలులు, మాంసాహారం, గోవధ మహాపాపం అంటూనే తిరిగి.. “మిగతా సమయాల్లో హలాహ్ చెయ్యబడిన మాంసాహారం హిందువులకు నిషిద్ధం, ఝట్కా చెయ్యబడిన మాంసాన్నే మీరు తినండి” అని చెప్పటమే లాజిక్ లో మ్యాజిక్. అందుకే దాశరధి రంగాచార్య గారు చెబుతున్నదేమిటంటే- ‘నేటి గోవధ నిషేధం రాజకీయ నినాదమే తప్ప వేద నినాదం కాదు”.
ఈ నేపథ్యంలో మరీ ముఖ్యంగా గమనించాల్సింది- స్వామీ వివేకానంద గోమాంసాన్ని తినటం గురించి చెబుతున్నదేమిటో ఒకసారి గమనించగలరు.
“ప్రాచీన హిందూ ఆచారాల ప్రకారం, ఆవు మాంసం తినని మనిషి మంచి హిందువు కాదని తెలుసుకుంటే మీరు ఆశ్చర్యపోతారు. కొన్ని సందర్భాల్లో, అతను ఒక ఎద్దును బలి ఇచ్చి తినాలి” – (ది కంప్లీట్ వర్క్స్ ఆఫ్ స్వామి వివేకానంద, వాల్యూమ్ 3, p. 536)
……………
ముఖ్యంగా జంతుబలులు పాపమని, వాటిని నిషేధించాలని నినాదాలు చేసే కొందరు హైందవ సోదరులకు అవగాహన లేని విషయం హిందూ శాస్త్రాల్లోనే జంతుబలులు, మాంసాహారం తాలూకు అనేక అనుమతులు ఇవ్వటం జరిగిందన్నది.
యజుర్వేదం, కాండం 2, 1 వ ప్రాపతకంలో – “ప్రత్యేక జంతు బలులు” అన్న పేరుతో అధ్యాయమే ఉందన్నది. అందులో వాయుకు తెల్ల మేక, సరస్వతికి దూడ, సావిత్రికి మచ్చల ఎద్దు, ఇంద్రునికి, వరుణునికి ఎద్దులు బలులుగా ఇవ్వాలని, ఇంకా దానిలో అనేక జంతు బలులను గురించి చర్చించబడినట్టు గమనించగలం. ముందుగా మనుస్మృతి ఏమి చెబుతుందో గమనిద్ధాం.
“తినదగిన జంతువుల మాంసాన్ని తినడం పాపం కాదు, ఎందుకంటే బ్రహ్మ తినేవాళ్ళు మరియు తినదగినవి రెండింటినీ సృష్టించాడు” – మనుస్మృతి 5:30
“త్యాగాలకు మాంసం వినియోగం (తగినది), ‘ఇది దేవతలు చేసిన నియమం అని ప్రకటించబడింది” – మనుస్మృతి 5:31
“స్వయంభు (స్వయం ఉనికిలో ఉన్నవాడు) త్యాగాల కోసమే జంతువులను సృష్టించాడు; ఈ మొత్తం (ప్రపంచం) యొక్క మంచి కోసం త్యాగాలు (స్థాపించబడ్డాయి)” – మనుస్మృతి 5:39
“ఒక కర్మలో సక్రమంగా నిమగ్నమైన వ్యక్తి మాంసం తిననప్పుడు, మరణించిన తరువాత ఇరవై ఒక్క పునర్జన్మ సమయంలో అతను బలి జంతువు అవుతాడు” – మనుస్మృతి 5:35
మనుస్మృతిలో పై వాక్యాలు గమనిస్తే.. 1. తినదగిన జంతు మాంసాన్ని తినటం పాపం కాదు 2. త్యాగాలకు మాంసం వినియోగం తప్పనిసరి అన్న విషయం అర్థమవుతుంది. అంటే బీదసాదలకు, అగత్యపరులకు దానమిచ్చే ఉద్దేశంతో జంతువులను బలిగా ఇచ్చి వాటి మాంసాన్ని త్యాగం చెయ్యటం పుణ్యకార్యమని తెలుస్తుంది.
ఇంకా వేదోపనిషత్తుల్లో గమనిస్తే.. మాంసాహారానికి సంబంధించి ఆజ్ఞలను కోకొల్లలుగా గమనించగలం.
“తనకు గుణవంతుడైన కుమారుడు పుట్టాలని కోరుకునేవాడు, జీవితంలో వేదాలను అధ్యాయనం చెయ్యాలి బలమైన ఎద్దు మాంసంతో వండిన ఆహారం తినాలి” – బృహదారణ్యకోపనిషద్ 6:4:18
“ఆడపిల్లల వివాహం సందర్భంగా ఎద్దులు, ఆవులను వధించబడతాయి” – ఋగ్వేదం 10:85:13
……………
రాముడు మాంసాహారి!
హిందూ సమాజానికి ఎంతో ప్రామాణికమైన వాల్మీకి రామాయణం చదివితే ఎన్నో వాక్యాల్లో రాముడు మాంసాన్ని తిన్నట్టు, తన భార్య అయిన సీతా దేవికి తినిపించినట్టు స్పష్టంగా చదవగలం.
“ఆ తరువాత ఇద్దరు సోదరులైన రామలక్ష్మణులు పవిత్రమైన జింకలను వధించి యమునా నది-అడవిలో తిన్నారు” – అయోధ్యకాండ 2-55-32/33
“రాముడు, మాంసపు ముక్కతో సీత ఆకలిని తీర్చడానికి కొండ వైపు నిలబడ్డాడు. ధర్మానికి అంకితభావంతో ఉన్న రాముడు, సీతతో ఇలా అన్నాడు- “ఈ మాంసం తాజాది, ఇది రుచికరమైనది మరియు అగ్నిలో కాల్చినది” – అయోధ్యకాండ 2-96-1/2
స్వయంగా రాముడు జంతు బలులు ఇవ్వటం జరిగింది!
“ఓహ్, లక్ష్మణ! జింకను వధించి మాంసాన్ని తీసుకురండి. ఇంట్లోకి ప్రవేశించేటప్పుడు మనము శుద్ధికరణ కార్యక్రమం చెయ్యాల్సిఉంది.. “ఓహ్, లక్ష్మణ! త్వరగా జింకను చంపి, ఇక్కడికి తీసుకురండి” – అయోధ్యకాండ 2-56-22
అప్పుడు లక్ష్మణుడు పవిత్రమైన జింకను వధించి మండుతున్న అగ్నిలో కాల్చి తెచ్చెను” – అయోధ్యకాండ 2-56-25
……………
మరి జీవహింస చెయ్యవద్దని అవే హిందూ శాస్త్రాలు చెబుతున్నాయి కదా?
ఇప్పటివరకూ మాంసాహారం, జంతుబలులకు అనుమతిస్తూ హిందూ శాస్త్రాల్లో ఉన్న శ్లోకాలు, చూపినప్పుడు కొందరు హిందూ పండితులు అవే హిందూ శాస్త్రాల్లో జంతు హత్యలను, జీవహింసను నిషేధిస్తున్న కొన్ని శ్లోకాలు చూపి జీవులను హింసించటం తప్పని వాదిస్తుంటారు. నిజమే, అకారణంగా జీవులను హింసించటం, చంపటం వేరు. జంతువులనే కాదు అకారణంగా మొక్కలను నరికేయటం కూడా పాపమే! కానీ, మనిషి ఆరోగ్యానికి మేలు చేసే మొక్కలనైనా, జంతువులనైనా పరిశుద్ధమైన పద్ధతిలో కోసుకుని తినటం వేరు. ఉదాహరణకు: ఒకానొక సందర్భంలో ప్రవక్త ముహమ్మద్ (స) – “ప్రతీ జీవి పట్ల దయ కలిగి ఉండేవారికి పరలోకంలో గొప్ప బహుమానం ఉంది” అని చెప్పారు.
కాబట్టి ధార్మిక గ్రంథాల్లో జీవహింసను ఖండించిన వాక్యాల సందర్భం వేరు. అవే గ్రంథాల్లో మనిషి ఆరోగ్యానికి మేలు చేసే మాంసాహారాన్ని తినటానికి అనుమతి ఇచ్చిన వాక్యాల సందర్భం వేరు.
రామకృష్ణ మిషన్ వారి పరిశోధనాత్మక రచనా అయిన “ది కల్చరల్ హెరిటేజ్ ఆఫ్ ఇండియా, వాల్యూమ్. 1 (కలకత్తా: ది రామకృష్ణ మిషన్, 1993), పే. 217 లో గమనిస్తే..
“వేద కాలంలో బ్రాహ్మణులతో సహా వేద ఆర్యులు చేపలు, మాంసం మరియు ఆవు మాంసం కూడా తిన్నారు. విశిష్ట అతిథిని భోజనంలో ఆవు మాంసంతో సత్కరించేవారు. వేద ఆర్యులు ఆవు మాంసం తిన్నప్పటికీ, పాలిచ్చే ఆవులను చంపేవారు కాదు. ఎద్దులు, బంజరు ఆవులు మరియు దూడలను తినేవారు” అని పేర్కొనబడింది.
అప్పట్లో పాలిచ్చే ఆవులను చంపకపోవటంలో కారణం అవి అప్పటి సామాజిక ఆర్ధిక వనరుగా ఉండటమే. తప్పితే జీవహింస చెయ్యకూడదనో, గోరక్షణ కొరకో కాదు. అప్పటి సామాజిక అవసరాన్ని బట్టి వేదకాలంలో వేద పండితులు పాలిచ్చే ఆవులు కోసేవారు కాదు. కానీ, పాలివ్వని ఆవులను, ఎద్దులను, చేపలు వగైరా వాటి మాంసాన్ని చక్కగా తినేవారు. తప్పితే అనవసర సెంటిమెంటు ఆపాదించి ఆవును గోమాతగా ఫీలై మొత్తానికి ఆవు మాంసం తినటాన్ని, మాంసాహారాన్ని నిషేధించుకోలేదు.
……………
అసలు “జీవహింస” అంటే..
ఉదాహరణకు నేపాల్లో ఉన్న భావానీ మాత, కాళీ మాత తదితర ఆలయాల్లో దేవతల్ని తృప్తి పరచటానికి బలుల పేరిట వేలకొద్దీ గేదెల్నీ, మేకల్నీ బలుల పేరిట నరికి చంపేయటం.. అదే నేపాల్లో ‘గాదిమైని’ దేవతకు అక్కడి హిందువులు ప్రతీ సంవత్సరం దాదాపు రెండు లక్షల ఆవులను, ఎద్దులను నరికి చంపేయటం.. కర్ణాటకలోని ‘బాల్కమ్ పేట యల్లమ్మ’ ఆలయంలో రేణుకా దేవతకు ప్రతీ సంవత్సరం బోనాల పండుగ నాడు హాజరయ్యే వేలకొద్దీ హిందూ భక్తులు జంతువులను నరికి చంపేయటం.. బీహార్ లోని నవాడ గ్రామంలో దుర్గా పూజ సందర్భంగా హాజరయ్యే వెలకొద్దీ హిందూ భక్తులు మేకల్ని నరికి చంపేయటం.. ఇదీ నిజానికి జీవహింస అంటే!.
కానీ, ఈ విధంగా గ్రామ దేవతల్ని సంతృప్తి పరచటానికి బలులు పేరట అనవసరంగా జంతువులను చంపే క్రూరమైన ఆచారం ఇస్లాంలో లేదు. బక్రీద్ పండుగ నాడు బలులిమ్మన్న ఆదేశం వెనుక ఉన్న లక్ష్యం కేవలం త్యాగనిరతిని పెంపొందించటం మాత్రమే! బలిచ్చే జంతువు మాంసాన్ని మూడు భాగాలుగా చేసి ఒక భాగం బీదసాదలకూ, మరొక భాగం పొరుగువారికీ, బంధువులకు ఇచ్చి మిగిలిన భాగాన్ని ఇంటివారు తినాలని ఆదేశించటం జరిగింది. ఈ విధంగా బీదసాదల్ని, అగత్యపరుల్ని, ఇరుగుపొరుగు వారిని సైతం తమ సంతోషంలో భాగస్వాములుగా చేసుకుని, రుచికరమైన ఆహారంతో కడుపు నిండా తిని జరుపుకునే పండుగే బక్రీద్ అంటే!
కేవలం ముస్లిములు మాత్రమే మాంసాహారులు, గోమాంస భక్షకులన్న చందంగా అభివర్ణిస్తూ స్వార్థ రాజకీయాలు నడిపేవారికి అస్సలు తెలియని మరికొన్ని విషయాలు- ప్రపంచంలో గోమాంస ఎగుమతిలో భారతదేశం బీజేపీ అధికారంలోకి వచ్చాక మొట్టమొదటి స్థానం కైవసం చేసుకున్నదన్నది. భారతదేశంలో 95% బీఫ్ ఎక్స్ పోర్ట్ కంపెనీ యజమానులు హిందువులే!
పైగా భారత దేశంలో ప్రపంచ ప్రఖ్యాత గో మాంస ఎగుమతి కంపెనీలు 6 ఉంటే.. వాటిలో 4 బీఫ్ ఎక్స్ పోర్ట్ కంపెనీలు పైకి ముస్లిం పేర్లు పెట్టుకుని నడపటం అవి హిందు బ్రాహ్మణులకు చెందినవే కావటం కొసమెరుపు.
హిందూ శాస్త్రాల్లో మాంసాహారం, జంతు బలుల అనుమతి లేదా?
