ఇస్లాం నేర్పుతున్న నైతిక విలువలు ఎంతటి ఉన్నతమైనవంటే “అన్యాయంగా ఏ ప్రాణాన్నీ హతమార్చకూడదు (17:33)” అని ఆజ్ఞాపించటమే కాదు, స్వయంగా “మిమ్మల్ని మీరు కూడా చంపుకోకండి (4:29)” అని ఆదేశించటం జరుగుతుంది.
“మిమ్మల్ని మీరు కూడా చంపుకోకండి” అంటే మీలో మీరు చంపుకోకండి, ఆత్మహత్య చేసుకోకండి అంటూ ఇందులో రెండు అర్థాలు ఉన్నాయి. ఇలా ఆదేశించటానికి కారణం సృష్టికర్త అయిన దేవుడు భూమి మీదున్న అనేక లక్షల జీవరాశుల్లో ఒక్క మనుషికి మాత్రమే వివేకాన్ని ఇవ్వటం జరిగింది. ఎందుకంటే అతని జీవితంలో ఎదురయ్యే అనేక సమస్యలను అతను ఆలోచించి నిర్ణయం తీసుకుని పరిష్కరించటానికి తప్పితే ఆ సమస్యలకు భయపడి తనను తాను క్షణికావేశంలో చంపుకోటానికి కాదు.
పరిష్కారం ఉన్న దానినే సమస్య అంటారు. ఏ సమస్యకైనా పరిష్కారం ఎలా అన్నది లోతుగా ఆలోచించటం, స్నేహితులతో అనుభవం ఉన్నవారితో పంచుకోవటంలోనే సమస్యకు పరిష్కారం అన్నది దొరుకుతుంది. కాకపోతే కొన్నిసార్లు పరిష్కారం లభించటానికి కాస్త ఆలస్యమవ్వొచ్చు. అంతమాత్రనా ఆత్మహత్య సమస్యకు పరిష్కారం ఎంతమాత్రం కాదు. జీవితంలో ఎదురయ్యే సమస్యలను ఆత్మస్థైర్యంతో నిలబడగలిగి సమస్యలను ఎలా ఎదుర్కోవాలో తెలియని బేలతనంతో విపరీతమైన బెంగతో మానసిక ఒత్తిడికి గురై సున్నితత్వంతో క్షణికావేశంలో ఆత్మహత్య చేసుకోవటం వల్ల సమస్య సమస్యగానే మిగిలిపోతుంది. కాబట్టి “జీవించటమే”.. ఆత్మహత్యకు అంతిమ పరిష్కారం.
కనుక ఆత్మహత్య చేసుకునేంత ఒత్తిడిని నియంత్రించుకునే మార్గం మనిషి నిజ సృష్టికర్తను గుర్తించి ఆయన ఆదేశాల ప్రకారం నడుచుకోవటమే. మనిషి తన నిజ సృష్టికర్తను గుర్తించి ఎంత బలమైన ఆత్మస్థైర్యంతో నిలబడగలుగుతాడో సమస్య అతని ముందు అంత చిన్నదైపోతుంది, మనస్సుకు ప్రశాంతత లభిస్తుంది. దానికి బదులు అతను సమస్య పట్ల ఎంత పిరికితనం ప్రదర్శిస్తాడో సమస్య అతని ముందు అంత పెద్దదైపోతుంది. అప్పుడే అతను తనను తాను చంపుకుంటాడు.

Masha Allah great work nooruddin Bhai…may Allah subhanavatala accept your good deeds and Make this efforts as savab e zariya
Masha Allah great work nooruddin Bhai…may Allah subhanavatala accept your good deeds and Make this efforts as savab e zariya