పాకిస్తాన్ లో హిందువుల శాతం 23% నుండి 3.70% కు తగ్గిపోయింది అంటూ ఏ విశ్వసనీయమైన సమాచారం, ఆధారాలు లేకుండానే పార్లమెంటులో అమిత్ షా చదివిన కొన్ని లెక్కలు, బీజేపీ ఇదే విషయం పదే పదే చెప్పటం, అవే తప్పుడు లెక్కలు వాట్స్ యాప్, సోషల్ మీడియాలో షేర్ అవ్వటం వెరసి ఇప్పుడు కొత్తగా కాషాయ భక్తులు విపరీతంగా ప్రచారం చేస్తూ గగ్గోలు పెడుతున్న విషయం పాకిస్తాన్ లో హిందువులపై ముస్లిముల దౌర్జన్యాల కారణంగానే హిందువుల సంఖ్య తగ్గిపోయింది అన్నది!
వాస్తవం ఏమిటంటే ఇండియా టుడే పాకిస్తాన్ సెన్సస్ (Census) డేటాను ఆధారాలతో సహా విశ్లేషించినప్పుడు పార్లమెంటులో అమిత్ షా చదివిన లెక్కలు పూర్తిగా తప్పని తేలాయి. విశ్వసనీయమైన ఆధారాలతో సహా ఇండియాటుడే పరిశీలించి మన ముందుంచిన వాస్తవాలు ఒక్కొక్కటిగా గమనిద్దాం.
1. 1947 లో పాకిస్తాన్ భారతదేశం నుండి విడిపోయిన తరువాత అక్కడ 23% హిందువులు లేనేలేరు! పైగా పాకిస్తాన్ “సెన్సస్ డేటా” (Census data) అంటే జనాభా గణన మొట్టమొదట 1947 లో అసలు జరగానేలేదు కానీ1951 లో జరిగింది.
2. 1951 నాటికి తూర్పు పాకిస్తాన్, పశ్చిమ పాకిస్తాన్ రెండు భాగాల్లో కలిపి జనాభా గణన జరిగింది. అప్పటికి ఈ రెండు తూర్పు, పశ్చిమ పాకిస్తాన్ రెండు భూభాగాల్లో మొత్తం ముస్లిముల శాతం 85.80 ఉండగా ముస్లిమేతరుల సంఖ్య 14.20 శాతం అని తేలింది.
3.ఇక్కడ ముఖ్యంగా దృష్టిలో ఉంచుకోవలసిన విషయం తూర్పు పాకిస్తాన్ (East Pakistan) అని ఏదైతే ప్రస్తావించటం జరిగిందో అదే 1971 సం.లో పాకిస్తాన్ నుండి వెరైపోయి బంగ్లాదేశ్ గా రూపుదిద్దుకుంది అన్నది.
4. తూర్పు పాకిస్తాన్ భాగం (అంటే ప్రస్తుత బంగ్లాదేశ్) లో 1951 వ సం. లో మొత్తం జనాభాలో ముస్లిమేతరుల సంఖ్య 23.20% ఉండగా, పశ్చిమ పాకిస్తాన్ (ఆంటే ప్రస్తుతం ఉన్న పాకిస్తాన్)లో ముస్లిమేతరుల సంఖ్య 3.44% మాత్రమే ఉండినది. తప్పితే పాకిస్తాన్లో ముస్లిమేతరుల సంఖ్య 23% ఉండేది అన్నది పూర్తి తప్పుడు లెక్క! మొత్తం తూర్పు, పశ్చిమ పాకిస్తాన్ భూభాగాల్లో కలిపినా 1951 నాటికి ముస్లిమేతరుల సంఖ్య 14.20% మాత్రమే నమోదైంది. అసలు పాకిస్తాన్ చరిత్రలో ఎప్పుడూ 23% ముస్లిమేతరులు లేనే లేరు!!
5. ఆ తరువాత పాకిస్తాన్ లో జనాభా లెక్కలు (Census) తిరిగి 1961 లో జరిగింది. అప్పుడు పశ్చిమ పాకిస్తాన్ (ఆంటే ప్రస్తుతం ఉన్న పాకిస్తాన్)లో ముస్లిమేతరుల సంఖ్య 2.83 శాతం సమోదైతే 1972 లో జరిగిన జనాభా గణనలో ముస్లిమేతరుల శాతం 3.25 కి పెరిగింది. తిరిగి 1981 లో జనాభా గణన జరిగినప్పుడు అదే ముస్లిమేతరుల శాతం 3.30 కి పెరిగింది. ఆ తరువాత 1998 పాకిస్తాన్ జనాభా లెక్కల (Census Data) ప్రకారం ముస్లిమేతరుల సంఖ్య గణనీయంగా 3.70 కి పెరిగింది. తప్పితే తగ్గలేదు!
6.సంక్షిప్తంగా చెప్పాలంటే 1951 సం. లో పాకిస్తాన్ లో 3.44% ఉన్న ముస్లిమేతరులు 1998 నాటికి 3.70% కి పెరిగారు తప్ప బీజేపీ చెబుతున్నట్టు 23% నుండి 3.70% కి తగ్గిపోలేదు!
7. ఇక తూర్పు పాకిస్తాన్ (నేటి బంగ్లాదేశ్) పరిస్థితి గమనిస్తే అది 1971 లో పాకిస్తాన్ నుండి వేరై బంగ్లాదేశ్ గా రూపుదిద్దుకుంది. 1951 నాటికి అక్కడ ముస్లిమేతరులు 23.20% ఉండగా 1974 నాటికి ముస్లిమేతరుల సంఖ్య 14.60% కి తగ్గింది. దానికి కారణం బంగ్లాదేశ్ పాకిస్తాన్ నుండి విడిపోయినప్పుడు అప్పటికి బంగ్లాదేశ్ లో ముస్లిముల, హిందువుల మధ్య మతపరమైన సంఘర్షణలతో బంగ్లాదేశ్ నుండి ముస్లిమేతరులు అధిక సంఖ్యలో వలసలు వెళ్ళిపోయారు. ఆ విధంగా వలసలు వెళ్లిపోగా ప్రస్తుతం 2011 బంగ్లాదేశ్ జనాభా లెక్కల ప్రకారం అక్కడ ముస్లిమేతరుల సంఖ్య 9.6% గా తేలింది. బంగ్లాదేశ్‌లో ముస్లిమేతరుల శాతం వాటా గణనీయంగా తగ్గిందని బీజేపీ చెప్పడం సరైనదే అయినప్పటికీ 22 శాతం నుండి 7.8 శాతానికి క్షీణించిందని చెప్పడం మటుకు శుద్ధ తప్పు.
పై సమాచారం అంతా విశ్వసనీయమైన ఆధారాలను బట్టి ఇండియా టుడే చేసిన విశ్లేషణ. దానికి సంబంధించిన లింక్ ను ఈ క్రింది ఇవ్వటం జరిగింది.
https://www.indiatoday.in/…/pakistan-bangladesh-non…
***************************
మత పరమైన హింసలే హింసలుగా పరిగణించబడతాయా?
1947 సం.లో పాకిస్తాన్లో ముస్లిం-ముస్లిమేతరులకు మధ్య మతపరమైన ఘర్షణలు జరిగాయన్నది వాస్తవమే (భారతదేశంలో ముస్లిమేతరుల ద్వారా ముస్లిములు హింసించబడినట్లు) అలాగే బంగ్లాదేశ్ లో ముస్లిం-ముస్లిమేతరులకు మధ్య సైతం మతపరమైన ఘర్షణలు సైతం ఎన్నో జరిగాయి. దాన్ని కాస్త ప్రక్కన పెడితే హిందువులు కేవలం పాకిస్తాన్, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్ దేశాల్లోనే హింసించబడుతున్నారా? అన్నదే ఇక్కడ ఆలోచించాల్సిన ప్రశ్న. నిజానికి ఎంతో దారుణంగా శ్రీ లంకలో దాశాబ్దాలుగా హిందువులు హింసించబడి, హత్య చెయ్యబడుతున్నారు కదా? మరి దాని మాటేమిటి? అన్న ప్రశ్నకు ప్రభుత్వం అక్కడ హిందువులపై జరుగుతున్నది మతపరమైన దాడి కాదు కాబట్టి! అని సింపుల్గా చెప్పి తప్పించుకుంది. ఇక్కగా గమనించాల్సిన కొన్ని అంశాలు.
1. అసలు హిందువులు పాకిస్తాన్, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్ దేశాల సంగతి ప్రక్కనపెడితే నిజానికి శ్రీ లంకలో ఉన్న బౌద్ధుల చేతిలో అత్యధికంగా అణచివేతకు గురై, చంపబడుతున్నారు.
2. కాశ్మీరీ పండిట్లకు ఎప్పుడో ఏదో జరిగిపోయిందని గగ్గోలు పెట్టె బిజెపీకీ 1983 నుండి 2009 వరకు కేవలం 26 సంవత్సరాలలో శ్రీలంకలో అక్షరాలా 1.6 లక్షల నుండి 1.9 లక్షల మంది హిందువులు హత్యగావింపబడి చనిపోయారు అన్నది కనపడలేదా? పాకిస్తాన్, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్ లలో ఉండే హిందువులే బీజేపీ కళ్లకు కనపడుతున్నారా? మత పరమైన హింస మాత్రమే హింస అవుతుందా? మత పరంగా కాకపోతే వేరే ఏ రకంగా దౌర్జన్యాలకు గురై ఎన్ని లక్షల హిందువులు చంపబడినా పరవాలేదా?
3. చిత్రం ఏమిటంటే పౌరసత్వ సవరణ చట్టం (CAA) లో హిందువులను మినహాయించి వారిని హింసించి చంపుతున్న బౌద్ధులకు పౌరసత్వం కల్పించటం. ఇది ఎంతో హాస్యాస్పదం!
4. 1971 నాటికే శ్రీలంక లో హిందువుల సంఖ్య 2.55 మిలియన్లు ఉన్నారు. వారంతా అప్పటి నుండే అక్కడి మెజారిటీ ప్రజాలైన సింహళీయుల ద్వారా అనేక హింసలకు గురౌతూనే ఉన్నారు. కానీ, బీజేపీ కళ్లకు పాకిస్తాన్, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్ లో ఉండే హిందువులు మాత్రమే కనపడుతుంటారు. కారణం శ్రీలంక ఇస్లామిక్ దేశం కాకపోవటం. పై సమాచారానికి సంబంధించిన లింకును ను ఈ క్రింది ఇవ్వటం జరిగింది.
https://www.outlookindia.com/…/opinion-the…/344208
ఈ విధంగా హిందువులను కాపాడటం అన్నది సైతం బీజేపీ మత ప్రాతిపదిక మీద రాజకీయాలు చేస్తుంది తప్పితే నిజంగా హిందువులపై ప్రేమే ఉంటే ఇన్ని సంవత్సరాలు బాబ్రీ మసీదు, రామ్ మందిర్ల వెంట పడి మత రాజకీయాలు నడిపే బదులు తీవ్రంగా చంపబడుతున్న శ్రీలంక హిందువులను ఇక్కడి పౌరసత్వం ఎప్పుడో కల్పించే పనిలో పడేది. పాకిస్తాన్, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్ దేశాల్లో హిందువులందరికీ ఎప్పుడో పౌరసత్వం వెసులుబాటు కల్పించి ఉండేది. వాస్తవాని టిబెట్, చైనా, మయన్మార్, నేపాల్ దేశాల నుండి కూడా ఎంతో మంది ముస్లిమేతరులు ఈ దేశానికి అక్రమ చొరబాటు దార్లుగా వచ్చేస్తుంటారు. కానీ, బీజేపీ ప్రత్యేకంగా పాకిస్తాన్, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్ మూడు దేశాల ప్రస్తావన మాత్రమే చేయటానికి కారణం మరియు శ్రీలంక లేక మిగతా పై దేశాల ప్రస్తావన చెయ్యకపోవటానికి కారణం అవేమీ ఇస్లామిక్ దేశాలు కాకపోవటమే! ఈ విధంగా ఇస్లామిక్ దేశాల్లో ముస్లిముల చేతిలో హిందువులు హింసించబడుతున్నారు, హిందువులు అంటే ముస్లిములకు ధ్వేషం అన్న అనైక్యత వాతావరణాన్ని సృష్టించి, ఇస్లాంను ఒక బూచి గా చూబెట్టి 99 శాతం హిందు-ముస్లిములు కలిసి మెలిసి మనుగడ సాగిస్తున్న సమాజంలో వారి మధ్య వేర్పాటువాదం తీసుకొచ్చి, హిందువులను తమ రాజకీయ మనుగడకు పావులుగా వాడుకునే కుట్రే ప్రస్తుతం బీజేపీ చేస్తుంది.
Md Nooruddin
