ప్రవక్త ముహమ్మద్‌(స) విషయంలోనేటి క్రైస్తవులు చేస్తున్న అతి పెద్ద పొరపాటు?

చరిత్రలో ఎంతో మంది గొప్ప నాయకులు ఎన్నో ఉధ్యమాలను నడిపి గతించిపోయారు. వారి ఉధ్యమాలు కూడా వారితో పాటే చరిత్రగా మిగిలి పోయాయి. కానీ ఒక ఉధ్యమాన్ని నడిపి, తన వ్యక్తిత్వం తాలూకు ప్రభావాన్ని తన సమకాలీకులపై వెయ్యటమే కాక, అనేక శాతాబ్దాలుగా పరంపరగా మానవాళిని ప్రభావితం (Influence) చేస్తూ రావటం అన్నది ఏ మాత్రం సామాన్య విషయం కాదు! అందుకే ‘మెకాయిల్‌ హెచ్‌.హార్డ్‌’ అనే ఓ స్పేస్‌ సైంటిస్ట్‌ చరిత్రలో మానవాళిని అత్యంత ప్రభావితం చేసిన 100 మంది మహావ్యక్తుల జాబితాను సేకరించి ‘The 100 A Ranking of the Most Influential Persons in History’ అనే గ్రంథాన్ని రచించాడు. అంతేకాదు చరిత్రలో మానవాళిని అత్యంత ప్రభావితం (Influence) చేసిన 100 మంది మహావ్యక్తులలో 1 వ స్థానాన్ని ప్రవక్త ముహమ్మద్‌(స) కు ఇచ్చి, ఆయనకు 1 వ స్థానాన్ని ఇవ్వటానికి గల కారణమేమిటో ఈ క్రింది విధంగా చెబుతున్నాడు.

”చరిత్రలో మానవాళిని ప్రభావితం చేసిన వందమంది జాబితాలో మొట్ట మొదటి స్థానం ప్రవక్త ముహమ్మద్‌కు ఇవ్వటం అన్న నా ఎంపిక చాలా మందికి ఆశ్చర్యానికి గురిచెయ్యవచ్చు కానీ ఆయన మాత్రమే చరిత్రలో ఆధ్యాత్మికంగానూ, భౌతికంగానూ గొప్ప విజయం సాధించిన ఏకైక వ్యక్తి” – మిఖాయిల్‌ హెచ్‌.హార్డ్

యేసు సైతం ఎంతో బలమైన ప్రభావాన్ని తన అనుచరులపై వేసినప్పటికీ ప్రపంచజనాభాలో ఆయనను అనుసరించేవారు సైతం మూడొంతుల్లో ఒక వంతు జనాభా ఉన్నప్పటికీ ఆయన తాలూకు ప్రభావం కేవలం ఆధ్యాత్మిక రంగం వరకే పరిమితం అయిపోయింది. కానీ ప్రవక్త ముహమ్మద్‌(స) అటు ఆధ్యాత్మిక రంగమే కాక, ఇటు భౌతిక రంగంలో సైతం విజయం సాధించటం జరిగింది. దీనికి గొప్ప తార్కాణం- 1935 సం.లో ‘యునైటెడ్‌ స్టేట్స్‌’ సుప్రీం కోర్టు, చరిత్రలో ప్రపంచానికి గొప్ప ధర్మ శాస్రాలు అందించిన 18 మంది మహావ్యక్తులలో ఒకనిగా ప్రవక్త ముహమ్మద్‌(స) ను గుర్తించటమే!

ప్రపంచ మానవాళిలో ఒక పెద్ద సమూహాన్ని తన ఉద్యమం వైపు ఆకర్షించ గలగటం, వారిపై తన వ్యక్తిత్వం తాలూకు బలమైన ప్రభావాన్ని తరతరాలుగా వేస్తూ రావటం అన్నది ఎంతో ఉన్నత వ్యక్తిత్వం, తన ఉద్యమం పట్ల నిబద్ధత, సత్యత కలిగి ఉండే గొప్ప నాయకుడికే సాధ్యమవుతుందన్న కొలమాన్ని దృష్టిలో పెట్టుకుంటే యేసు గతించిన 600 సం.ల తరువాత ప్రవక్తగా నియమితులైన ముహమ్మద్‌(స) యేసు ఉధ్యమానికి కొనసాగింపుగా తన ఉధ్యమాన్ని నడిపి తన ప్రభావాన్ని (Influence) మానవాళిపై ఎంత బలంగా వేయగలిగారంటే ఈనాడు ప్రపంచ జనాభా 7.7 బిలియన్ల ఉంటే అందులో ప్రవక్త ముహమ్మద్‌(స) ను అనుసరించేవారి సంఖ్య- దాదాపు 2.5 బిలియన్లు అంటే ప్రపంచ జనాభాలో మూడొంతుల్లో ఒక వంతు ఉన్నారు.

*******************

ముహమ్మద్‌(స) వ్యక్తిత్వం తాలూకు ప్రభావం ఈనాటికీ ఎంత
బలంగా పనిచేస్తుందో తెలుసుకోవటానికి గొప్ప ఉదాహరణ!

అతిపెద్ద క్రైస్తవ రాజ్యమైన ‘యునైటెడ్‌ స్టేట్స్‌ ఆప్‌ అమెరికా’ (U.S.A) లో క్రైస్తవం తరువాత రెండవ అతిపెద్ద ధర్మం ఇస్లాం! ఇప్పటికే అక్కడ 3.5 మిలియన్ల క్రైస్తవులు ముహమ్మద్‌(స)ను ప్రవక్తగా అంగీకరించి, ఇస్లాంలో చేరిపోయారు. రెండవ అతిపెద్ద క్రైస్తవ రాజ్యమైన ‘యునైటెడ్‌ కింగ్‌డమ్‌ (U.K)’ లో గమనిస్తే ఇప్పటికే 500 వందల చర్చీలు మూతపడిపోగా అందులో 493 చర్చీలు మసీదులుగా మార్చబడ్డాయి. అంతేకాక, స్విట్జర్‌లాండ్‌లో క్రైస్తవ్యం తరువాత అతి పెద్ద ధర్మంగా ఇస్లాం అత్యంత వేగంగా వ్యాప్తి చెందుతుంది. ఇండోనేషియాలో 87%, నైజీరియాలో 50% ప్రజలు ఇప్పటికే ఇస్లాంను స్వీకరించి ఉన్నారు. ‘యునైటెడ్‌ కింగ్‌డమ్‌ (U.K)’లో 3.3 మిలియన్ల క్రైస్తవులు, ‘జర్మనీ (Germany)’లో 3.3 మిలియన్ల క్రైస్తవులు ఇస్లాంను స్వీకరించారు. రాబోయే అతికొద్ది కాలంలో U.K లోనే ఇస్లాం అతి పెద్ద ధర్మంగా అవతరించబోనున్నదని పరిశోధకులు చెబుతున్నారు.

పై సమాచారం ప్రవక్త ముహమ్మద్‌(స) వ్యక్తిత్వం తాలూకు ప్రభావం పధ్నాలుగు శతాబ్దాలుగా కొనసాగుతూ నేటికీ ఎంతబలంగా ప్రేరేపించగలుగుతుందో చెప్పటానికి ఒక చిన్న ఉదాహరణ మాత్రమే! నేటికీ ప్రపంచవ్యాప్తంగా యూదులు, క్రైస్తవులతో సహా బిలియన్ల కొద్దీ ప్రజలు ఆయన వ్యక్తిత్వానికి ప్రభావితులై ఆయన అనుచరులుగా మారుపోతున్న నేపథ్యంలో అలాంటి మహావ్యక్తి జీవిత చరిత్ర ఏ మాత్రం పరిశీలించకుండా నేటి కొందరు బోధకులు అలవోకగా ఆయన స్వయం ప్రకటిత ప్రవక్త అని కొట్టిపారేయటం కేవలం మూర్ఖత్వం కాదా? అసలు ఒక ఉధ్యమాన్ని నడపటం, తన వ్యక్తిత్వం మరియు తన బోధల తాలూకు ప్రభావాన్ని శతాబ్దాల పాటు మానవాళిపై తరతరాలుగా వేస్తూ రావటం ఒక స్వయం ప్రకటిత ప్రవక్త వల్ల సాధ్యయమ్యే పనేనా?

********************

క్రీస్తు యదార్థ బోధలను పునః స్థాపించింది
ఒక్క ప్రవక్త ముహమ్మద్‌(స) మాత్రమే!

యేసు అనంతరం దాదాపు 300 వందల సం.ల వరకే యేసు బోధలు సజీవంగా ఉన్నాయని చెప్పవచ్చు. యేసు అనంతరం 325వ సంవత్సరంలో అన్యుడైన రోమన్‌ చక్రవర్తి ‘కైసర్‌ ఫ్లావిస్‌ కాన్‌స్టన్‌టైన్‌’ ఆధ్వర్యంలో జరిగిన నైసియా సభలో వాక్య విరుద్ధమైన ‘త్రిత్వ-అవతార’ వాదాలు క్రైస్తవ్యంలో ప్రవేశపెట్టబడిన తరువాత క్రీస్తు బోధించిన పరిశుద్ధ ‘ఏక దేవుని ఆరాధనా విశ్వాసం’ కాస్తా ‘అనేక దైవాల ఆరాధనా విశ్వాసం’గా రూపాంతరం చేయబడిందని క్రైస్తవ చరిత్ర కారులే చెబుతున్నారు.

ఒకప్పుడు మోషే బోధించిన ‘ఏక దేవుని విధేయత దృక్పథాన్ని’ (CONCEPT OF MONOTHEISM) యూదులు విస్మరించిన నేపథ్యంలో యేసు దానినే తిరిగి స్థాపించారు. ఆ తరువాత త్రిత్వ-అవతార సిద్ధాంతాల కాలుష్యం వల్ల ఏర్పడిన ‘బహుదైవాల విధేయత దృక్పథం’ (CONCEPT OF POLYTHEISM) సర్వసామాన్యం అయిపోయిన నేపథ్యంలో ఒకనాటి మరుగైపోయిన క్రీస్తు ప్రబోధిత ‘ఏక దేవుని విధేయత దృక్పథాన్నే’ ప్రవక్త ముహమ్మద్‌(స) ఇస్లాం పేరుతో పునః స్థాపించటం జరిగింది.

చరిత్రలో ఎందరో మహనీయులు గతించిపోయారు. వారూ కూడా ఎన్నో సంస్కరణోధ్యమాలు నడిపారు. వారిలో కొందరు తమ అనుచరులతో చిన్న సమూహాలను ఏర్పర్చుకోగలిగారు, కొందరు చరిత్రలో కనుమరుగైపోయారు. కానీ, మక్కా అనబడే ఓ మారుమూల పట్టణంలో నిరక్ష్యరాసి అయిన ముహమ్మద్‌(స) అసలు నైతికత అంటే ఎలా ఉంటుందో కూడా తెలియని ఓ అనాగరిక జాతి ప్రజల నుండి ప్రవక్తగా దేవునిచే నియమించబడిన తరువాత కేవలం 23 ఏళ్ల కాలంలో ఆ జాతిని ఉత్తమ నైతిక విలువలకు పట్టుకొమ్మగా మార్చేయటమే కాక, ఆయన ప్రారంభించిన మానవాళి సంస్కరణోధ్యమ ప్రేరణ మరియు ఆయన వ్యక్తిత్వం తాలూకు ప్రభావం ఎంత బలమైనవీ అంటే- గత 14 వందల సంవత్సరాల నుండి ఈనాటి వరకు తరతరాలుగా మానవాళిని ఆకర్షిస్తూ, ప్రపంచ జనాభాలో మూడొంతుల్లో ఒక వంతు ప్రజలను తన అనుచరులుగా మర్చుకోగలిగినంత!

యేసు ‘నేను మీతో చెప్పవలసిన ఎన్నో సంగతులు ఉన్నాయి వాటిని మీరు ఇప్పుడు సహింపలేరు కానీ వేరొక ఆదరణకర్త వచ్చినప్పుడు మీకు సమస్తమునూ బోధించి, మిమ్మల్ని సర్వసత్యంలో నడుపును’ అన్న వాగ్దానం ప్రకారం యేసు బోధించిన సువార్తకు కొనసాగింపుగా వచ్చిన ముహమ్మద్‌(స)ను నేటి కొందరు బోధకులు విమర్శిస్తున్నట్లు ఆయన నిజంగా స్వయం ప్రకటిత ప్రవక్తే అయితే మానవాళిపై ఇంత బలమైన ప్రభావాన్ని వేయటం అన్నది అసలు సాధ్యమేనా? అన్న కనీస ఆలోచన చేయకుండా ముహమ్మద్‌(స) ను ప్రవక్త కాదని గ్రుడ్డిగా తీర్మానించటమే నేటి అధికశాతం క్రైస్తవులు చేస్తున్న అతి పెద్ద పొరపాటు.

Md Nooruddin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *