హుందాతనంగా సైద్ధాంతీక వాదన చెయ్యటం చేతకాని కొందరు క్రైస్తవ బోధకులు ఉపయోగించే చివరి అస్త్రం ఖురాన్ పై పనికిమాలిన విమర్శలు చెయ్యటం, ఖురాన్ లో ప్రస్తావించబడ్డ స్వర్గ సౌఖ్యాల గురించి హేళనగా మాట్లాడటం వగైరా! వీరు చెప్పే మాటలు కూడా భలే గమ్మత్తుగా ఉంటాయి అవి: “అందమైన భార్యలు, సుందరాంగులు, మందు, విందులు, భోగ భాగ్యాలు, అశ్లీల్ల చేష్టలు వగైరా కార్యకలాపాలు సాగే నిలయం అసలు స్వర్గమేనా!? పైగా యేసు “పరలోకంలో పెళ్లికియ్యబడరు” అని చెబుతుంటే ఖురాన్ స్వర్గంలో అందమైన సుందరాంగులా? వారితో పెళ్లిళ్లా? ఇలాంటి అపవిత్ర కార్యకలాపాలు జరిగే స్థలమా ఖురాన్ స్వర్గం అంటే?”
ఇలాంటి చవకబారు వాదనలు చేసేవారికి కనీస బైబిల్ జ్ఞానం మాత్రమే కాదు, కనీసం లోకజ్ఞానం సైతం లేదని నిస్సందేహంగా తీర్మానించవచ్చు. మనిషిని సృష్టించిన ఆ దేవుడే అతనిలో ఎన్నో కోరికలూ, ఆశలనూ పెట్టాడు. అంతేకాదు ఆ కోరికలతో పాటు ప్రతీ మనిషిలో అదనంగా మరో ప్రగాఢమైన కోరికా పెట్టాడు అదేమిటంటే- “నాకు మరణం అనేది రాకూడదు! నిత్య యవ్వనంతో పాటు, ఏ శ్రమా లేకుండా నేను తలచిందే తడవుగా నా మనస్సు కోరుకునే ప్రతీదీ నాకు లభించే నిత్య జీవితం కావాలి” అన్నది. ఒకవేళ మనిషిని ఎదురుగా నిలబెట్టి దేవుడు “నీకేం కావాలో కోరుకో!” అని అడిగితే మనిషి పుట్టుక పుట్టిన ఎవడైనా ఇంతకంటే కోరుకునే కోరిక ఇంకేముంటుంది? “అబ్బే! ఏ సుఖమూ లేని సన్యాని బతుకు” కావాలని ఎవడూ కోరుకోడు కదా! నేడు అగ్ర రాజ్యాలన్నీ ఏకమై కోట్ల రూపాయలు ఖర్చుపెట్టి మనిషి త్వరగా చనిపోకుండా అతని జీవిత కాలాన్ని పెంచటానికి మానవ జీనోమ్ (జన్యువు) పై చేస్తున్న అనేక పరిశోధనాలే మనిషిలో ఉన్న పై ప్రగాఢమైన కోరికకు నిదర్శనం.
ఎవరైతే దైవాన్ని యదార్థంగా గుర్తించి, ఆయన ఆజ్ఞల ప్రకారం నీతివంతమైన జీవితం గడుపుతారో అటువంటి వారికి సృష్టికర్త అయిన దేవుడు ఈ లోకంలో గొప్ప గొప్ప రాజులు మహారాజులు అనుభవించిన సుఖాల కంటే ఎన్నో రెట్ల సుఖాలు, నిత్య యవ్వనంతో కూడిన మరణం లేని నిత్యజీవితం, రుచికరమైన ఆహారపానీయాలతో కూడిన నిత్య సుఖాల నిలయమైన స్వర్గాన్ని ఇస్తానంటున్నాడు. ఇదే విషయాన్ని బైబిల్ అక్కడ “మరణము ఇక ఉండదు, దుఃఖమైనను ఎడ్పైనను వేదన అయినను ఇక ఉండదు” – ప్రకటన 21:1-5 అంటే స్వర్గంలో కేవలం సుఖసంతోషాలు మాత్రమే ఉంటాయన్న గొప్ప విషయాన్ని ప్రకటిస్తుంది.
అంతే కాదు, పౌలు- “దేవుడు తనను ప్రేమించే వారి కొరకు స్వర్గంలో ఏవైతే ఏర్పాటు చేశాడో అవి కంటికి కనపడలేదు, చెవికి వినపడలేదు, హృదయమునకు గోచరము కాలేదు” – 1 కోరింథీ 2:9 అని చెబుతున్నాడు. ఖురాన్ స్వర్గం గురించి హేళనగా మాట్లాడే కొందరికి తెలియని విషయం ఏమిటంటే- స్వర్గం అంటేనే – “నిత్య యవ్వనంతో కూడిన, సర్వ సుఖాలు, భోగ భాగ్యాలతో నిండిన ప్రదేశం” అని అర్థం. ఆదే లేనప్పుడు దానిని స్వర్గం అని అనేకంటే వైరాగ్యంతో కూడిన సన్యాసులు తిరిగే మఠం అని చెప్పొచ్చు! ఇక ఖురాన్ స్వర్గ సౌఖ్యాల గురించి హేళన చేసేవారు మరి అవే స్వర్గ సౌఖ్యాల గురించి యేసు కూడా చెబుతున్నారు కదా! రండి మరి బైబిల్ స్వర్గంలో ఇవ్వబడే సుఖ సౌఖ్యాల గురించి పరిశీలిద్దాం.
బైబిల్ స్వర్గంలో “వంద రెట్ల భార్యలు ఇవ్వబడతారని” ప్రకటిస్తున్న యేసు!
ఖురానులో అల్లాహ్ ఇస్తానని వాగ్దానం చేస్తున్న స్వర్గంలో సుందరాంగులైన భార్యలా? అపరిశుద్ధ లైంగిక సుఖాలను ఇచ్చే అల్లాహ్ అసలు దేవుడేనా? ఖురాను స్వర్గం అసలు స్వర్గమా? కామ కోరికలు తీర్చుకునే క్షేత్రమా? అని ఘోరంగా విమర్శిస్తున్న నేటి క్రైస్తవ బోధకులు కాస్త కళ్ళు తెరచి ఈ క్రింది వాక్యాన్ని చదవాలి.
“పేతురు- ఇదిగో మేము సమస్తమును విడిచి పెట్టి నిన్ను వెంబడించితిమి గనుక మాకేమి దొరుకునని ఆయనను అడుగగా యేసు వారితో ఇట్లనెను- (ప్రపంచ) పునర్జనన మందు మనుష్య కుమారుడు తన మహిమ గల సింహాసనము మీద ఆసీనుడై యుండునప్పుడు నన్ను వెంబడించిన మీరును పండ్రెండు సింహాసనముల మీద ఆశీనులై ఇశ్రాయేలు పండ్రెండు గోత్రములవారికి తీర్పు తీర్చుదురు. నా నామము నిమిత్తమును అన్నదమ్ముల నైనను అక్క చేల్లెండ్ర నైనను తండ్రి నైనను, తల్లి నైనను “భార్యల నైనను” పిల్లల నైనను, భూముల నైనను, ఇండ్ల నైనను విడిచిపెట్టిన ప్రతి వాడును “నూరు రెట్లు” పొందును, ఇది గాక నిత్యజీవమును స్వతంతృంచుకొందురు” – మత్తయి 19:27-29
గమనిక: “నూరంతల భార్యలు” అన్న పదం తెలుగు బైబిల్లో లేపెయ్యటం జరిగింది! ఇంగ్లీష్ బైబిల్లో WIFE shall receive an HUNDRED FOLD అని ఉన్న దాన్ని బట్టి పై వాక్యంలో “నూరు రెట్లు భార్యలు” పొందును అసలు అనువాదం చెయ్యటం జరిగిందన్నది దృష్టిలో పెట్టుకోవాలి. ఒకసారి ఈ వాక్యాన్ని ఇంగ్లీష్ బైబిల్లో ఎలా వ్రాయబడి ఉందో గమనించగలరు.
“And every one that hath forsaken houses, or brethren, or sisters, or father, or mother, or WIFE, children, or lands, for my name’s sake, shall receive an HUNDRED FOLD, and shall inherit everlasting life” – Matthew 19:28,29
పై లేఖనంలో యేసు చెబుతున్నది ఏమిటంటే- యేసు అందించిన దేవుని రాజ్య సువార్త కోసం ఎవరైతే భూలోకంలో తాత్కాలిక సుఖలను, ఇళ్లూ వాకిళ్లూ సర్వ సుఖాలను త్యాగం చేస్తారో, వారు పరలోకంలో వాటన్నిటినీ “నూరు రేట్లు (HUNDRED FOLD)” పొందుతారన్నది. అన్నిటికంటే ముఖ్యంగా “భార్యలను విడిచిపెట్టిన వాడు” సైతం పరలోకంలో “నూరు రెట్లు భార్యలు” కూడా పొందుతాడన్నది అత్యంత గమనార్హం. ఈ నూరు రెట్ల భార్యలను యేసు రెండవ రాకడలో ఆయన స్థాపించే దేవుని రాజ్యంలో అని కొందరు పొంతలేని, ఆధార రహితమైన వాదనలు చేస్తుంటారు. కానీ, పై వాక్యం జాగ్రత్తగా గమనిస్తే- “(ప్రపంచ) పునర్జనన మందు మనుష్య కుమారుడు తన మహిమ గల సింహాసనము మీద ఆసీనుడై యుండునప్పుడు” అన్న వాక్య భాగాన్ని బట్టి యేసు వాగ్దానం చేస్తున్న “నూరంతల భార్యలు” యేసు రెండవ రాకడ, ప్రళయం, పునరుత్థానం తరువాత స్వర్గ వాసులు “దేవుని రాజ్యంలో (Kingdom of Heaven) లో పొందనున్నారని తెలుస్తుంది.
సరే, ఇంతకూ తెలుగు బైబిల్లో “భార్యలు” అన్న పదం ఎత్తేయటం వెనుక కుట్ర ఏమిటి? ఇది కేవలం- ఖురాన్ స్వర్గంలో భార్యలు ఇవ్వబడతారన్న విషయం ఎక్కడ సత్యం అయిపోతుందో అన్న భయం వల్లే బైబిల్లో “భార్యలు” అన్న పదం లేపెయ్యటం వెనుక జరిగిన అసలు కుట్ర అని తెలియటం లేదూ! సరే, ఇప్పటి వరకు మన పరిశీలనలో బైబిల్లో సైతం పరలోకంలో నూరంత భార్యలు ఇవ్వబడతారని తేటతెల్లమైంది. మరి, భార్యలు ఇవ్వబడిన తరువాత జరిగేది ఏమిటి? భార్యా-భర్తల” మధ్య లైంగిక సంబంధం కాకపోతే ఇంకేముంటుంది? “ఛీ ఛీ, మా బైబిల్ స్వర్గంలో అలాంటివి ఉండవు క్రైస్తవులైన మేము పవిత్రులుగా ఉంటాం! అని ఎవడైనా అంటే “భార్యలు ఉన్నా వారితో ఆష్టా-చమ్మాట, తుక్కుడు బిళ్ళాటలు ఆడుకుంటూ ఏ కొరికా లేని వైరాగ్యంతో కూడిన సన్యాసి బతుకు బతకాల్సివస్తుందా? ఏంటి? అన్న డౌటు ఎవడికైనా రాక మానదు! అయినా భూలోకంలో దేవుడికి భయపడి, మనస్సులో కోరికలన్నీ అణుచుకుని, ఇళ్లూ, వాకిళ్ళు, పెళ్ళాం పిల్లలు అన్నీ వదిలిపెట్టి నానా శంకలు నాకి, సువార్త కోసం పడరాని తంటాలు పడితే స్వర్గంలో భార్యలతో సుఖం పంచుకోవటానికి ఉండదు, మనస్సు కోరుకునే విధంగా తినటానికి తిండి, త్రాగటానికి ఏమీ ఉండదు అన్నప్పుడు అలాంటి పనికిమాలిన వైరాగ్యంతో కూడిన స్వర్గాన్ని ఎవడు కోరుకుంటాడు? అని పైకి చెప్పకపోయినా మనసులో అయినా అనిపిస్తుంది ఎవడికైనా. బహుశా, బైబిల్ స్వర్గంలో అలాంటి సన్యాసి బతుకు బతకాల్సివస్తుందని ప్రచారం చెయ్యటం వల్ల కాబోలు, మనసులో కోరికలన్నీ తీర్చేసుకోవాలన్న హడావిడిలో పడటం వల్ల ఈనాడు అటు వ్యభిచారం, మత్తుపానీయాల సేవనం వగైరా వాటిలో క్రైస్తవులు అధికంగా నివసించే దేశాలు టాప్ టెన్ లో నమోదు కాబడుతున్నాయి! కానీ, యేసు పరలోక రాజ్యంలో అలాంటి మోడువారిన సన్యాసి జీవితం లభిస్తుందని చెప్పటం లేదు. పేతురు “మేము సమస్తమును విడిచి పెట్టి నిన్ను వెంబడించితిమి గనుక మాకేమి దొరుకును” అని ప్రశ్నించినప్పుడు, యేసు- భూలోకంలో మీరు విడిచి పెట్టిన సుఖాలు, ఇళ్ళు, వాకిళ్ళు, పెళ్ళాం పిల్లలు వగైరా వాటికి బదులు పరలోకంలో ఒకటి కాదు, రెండు కాదు “నూరు రెట్లు” అదనంగా పొందుతారని ఎంతో న్యాయబద్దమైన వాగ్దానం చేస్తున్నారు. ఇలాంటి వాగ్దానం చేసిన యేసు “పరలోకంలో పెళ్లి చేసుకోరు, పెళ్లికియ్యబడరు” అన్న మాటలు చెప్పి ఉంటారా? కాస్త ఆలోచించండి.
బైబిల్ స్వర్గంలో “మందు ఇవ్వబడుతుందని” ప్రకటిస్తున్న యేసు!
“ఖురాన్ లో మందూ-విందులు ఇచ్చే అల్లాహ్ దేవుడు ఎలా కాగలడు? అదీ ఒక స్వర్గమేనా?” అంటూ విమర్శించేవారు- యేసు “నూరంత భార్యలే కాదు, బైబిల్ స్వర్గంలో మందు-విందులు కూడా ఇవ్వబడతాయని చెబుతున్నారు! ఆశక్తికరమైన ఈ విషయాన్ని ఈ క్రింది వాక్యాల్లో త్వరగా చదివేద్దామా?
“నా తండ్రి రాజ్యములో మీతో కూడా నేను ఈ ద్రాక్షరసము క్రొత్తదిగా త్రాగు దినము వరకు, ఇకను దాని త్రాగనని మీతో చెప్పుచున్నాననెను” – మత్తయి 26:29
“ఇక మీదట దేవుని రాజ్యము వచ్చువరకు నేను ద్రాక్షరసము త్రాగనని మీతో చెప్పుచున్నాననెను” – లూకా 22:18
“నా తండ్రి రాజ్యములో మీతో కూడా నేను ఈ ద్రాక్షరసము క్రొత్తదిగా త్రాగు దినము వరకు” “I drink it new with you in my Father’s kingdom” అని యేసే చెబుతున్న వాక్యాలను బట్టి దేవుని రాజ్యం (Father’s kingdom) లో అంటే తండ్రి ప్రసాదించే “పరలోక స్వర్గం”లో చాలా పుష్కలంగా “మందు (Vine)” దొరుకుతుందని తెలుస్తుంది. అయితే నిత్య రాజ్యంలో లభించే మందు భూలోకంలో దొరికే మందు వంటిది కాందంటూ, ఖురాన్ దాని గుణం ఎటువంటిదో చెబుతుంది.
“వారి (దేవుని రాజ్యంలో ఉండేవారి) సమావేశాలలో నిత్యం బాల్యం కల బాలురు, మధువు ప్రవహించే చెలమల నుండి నింపిన మధు పాత్రలు, గిన్నెలు, గాజు పాత్రలు కూజాలు తీసుకుని పరుగులతో తిరుగుతూ ఉంటారు. దానిని త్రాగటం వల్ల వారి తల తిరగటం కానీ, వారికి బుద్ధి మాంద్యం కలగటం గానీ జరగదు” – 56:17-19
ఖురాన్ ను విమర్శించటమే పనిగా పెట్టుకున్నోల్ల గుడ్డి కళ్ళకు ఇలాంటి వాస్తవాలు కనపడవు. ఖురాన్ చెబుతున్నదేమిటంటే- పరలోక రాజ్యంలో లభించే మధువు వల్ల “తల తిరగటం కానీ, వారికి బుద్ధి మాంద్యం కలగటం గానీ జరగదు” అన్నది. ఇంత స్పష్టంగా బైబిల్లో అయితే లేదు! పైగా బైబిల్లో పేర్కొనబడిన “ద్రాక్షరసం వెక్కిరింతల పాలు చేయును, మధ్యము అల్లరి పుట్టించును” (సామెతలు 20:1) అని ఉంది. ఇక ఖురాన్ స్వర్గం గురించి హేళనగా మాట్లాడేవారు తెలుసుకోవలసింది- బైబిల్ స్వర్గంలో ఒక్క మందు మాత్రమే కాదు, విందులు కూడా ఉంటాయన్నది.
బైబిల్ స్వర్గంలో “విందులు కూడా ఉంటాయని” ప్రకటిస్తున్న యేసు!
“ఆయనతో కూడా భోజన పంక్తిని కూర్చుండినవారిలో ఒకడు ఈ మాట విని- దేవుని రాజ్యములో భోజనము చేయువాడు ధన్యుడని ఆయనతో చెప్పగా..” – లూకా 14:15
“అప్పుడాయన- నేను శ్రమ పడకమునుపు మీతో కూడా ఈ పస్కాను భుజింపవలెనని మిక్కిలి ఆశ పడితిని. అది (పస్కా విందు) దేవుని రాజ్యములో నెరవేరువరకు ఇక ఎన్నడును (అంటే ఈ లోకంలో) దాని (పస్కా విందు) భుజింపనని మీతో చెప్పుచున్నాను” – లూకా 22:15-16
“గనుక నా తండ్రి నాకు రాజ్యమును నియనించినట్టుగా నా రాజ్యములో నా బల్ల యొద్ద అన్న పానములు పుచ్చుకుని, సింహాసనముల మీద కూర్చుండి ఇశ్రాయేలు పన్నెండు గోత్రముల వారికి మీరు తీర్పు తీర్చుటకై, నేను మీకు రాజ్యమును నియమించుచున్నాను” – లూకా 22:29,30
# దేవుని రాజ్యములో భోజనము చేయువాడు ధన్యుడు # అది (పస్కా విందు) దేవుని రాజ్యములో నెరవేరువరకు ఇక ఎన్నడును (అంటే ఈ లోకంలో) దాని (పస్కా విందు) భుజింపనని మీతో చెప్పుచున్నాను” # అన్న పానములు పుచ్చుకుని, సింహాసనముల మీద కూర్చుండి ఇశ్రాయేలు పన్నెండు గోత్రముల వారికి మీరు తీర్పు తీర్చుటకై” అన్న వాక్యాలను బట్టి నిత్యరాజ్యంలో చక్కటి భోజనము, పస్కా విందులు సైతం పుష్కలంగా ఉంటాయని తేటతెల్లమైంది.
ఇప్పటి వరకు గమనించిన పై వాక్యాలను బట్టి దేవుని రాజ్యములో అంటే బైబిల్ స్వర్గంలో # నూరంతల భార్యలు # మందు (Vine) # భోజన-పానీయాలు # పస్కా విందులు వగైరా ఎన్నో సుఖ భోగాలు ఉంటాయని తేలిపోయింది. పైగా యేసైతే ఇశ్రాయేలు పన్నెండు గోత్రముల తీర్పు తీర్చే ముందు కూడా అన్న పానములు పుచ్చుకుని తీర్పు తీర్చుదురు అని చెబుతున్నారు. వాస్తవం ఇదైతే చాలా గమ్మత్తుగా కొందరు బోధకులు “దేవుని రాజ్యములో భోజనము పానము కాదు గానీ, నీటియు సమాధానము పరిశుద్ధాత్మ యందు ఆనందము నై యున్నది (రోమా 14:17)” అన్న వాక్యం చూపి “ఛీ! ఖురాన్ స్వర్గంలో మందు, విందులు ఉన్నప్పుడు తిన్న తిండి మాలా మూత్రాల రూపంలో బయటకు రాకుండా ఏమౌతుంది? స్వర్గంలో మాల మూత్రాలా? అదే మా బైబిల్ స్వర్గంలో అలాంటివేవీ ఉండవు అంటూ హేళనగా మాట్లాడుతుంటారు. అలాంటివారు బైబిల్ స్వర్గంలో సైతం నూరంతల భార్యలు, మందు, భోజన-పానీయాలు వగైరా ఎన్నో సుఖ భోగాలు ఉంటాయని యేసు చెబుతున్న దానిని అబద్ధమని చెప్పగలరా? కాబట్టి తాము చూపే వాక్యం ఎంతవరకు ప్రామాణికం అయిందో వారే తేల్చుకోవాలి! అయినా దేవుని నిత్యరాజ్యం “హృదయమునకు గోచరము కానిది” – 1 కోరింథీ 2:9) అని బైబిల్ చెబుతుంటే స్వర్గలోకపు స్థితిని, సాధారణ భౌతిక లోకపు స్థితితో పోల్చి, ఏవేవో ఊహించుకున్నప్పుడే ఇలాంటి పనికిమాలిన ఆలోచనలు, అనుమానాలు వస్తూ ఉంటాయి.
దేవుని రాజ్యమే – పరలోక రాజ్యం
ఖురాన్ స్వర్గానికీ, బైబిల్ స్వర్గానికీ సంబంధం లేదని చెప్పటానికి బోధకులు ఉపయోగించే చివరి అస్త్రం- యేసు చెబుతున్న దేవుని రాజ్యం వేరు! పరలోక రాజ్యం (స్వర్గం) వేరు అని వాదించటం. బైబిల్ పరిశీలనగా చదవనివారే ఇలాంటి వాదనలు చేసేది! నేటి బోధకులు చెప్పే స్టోరీ ఏమిటంటే- “దేవుని రాజ్యం అంటే యేసు రెండవ రాకడ తరువాత వెయ్యెండ్ల పాలనలో అది స్థాపించబడుతుంది” అప్పుడు నూరంతల భార్యలు, మందు, విందులు వగైరా ఎన్నో సుఖ భోగాలు ఉంటాయన్నది! అలా అంటే, పోనీ నేటి బోధకుల వెర్షన్ లోనే మాట్లాడుకుంటే, యేసు స్థాపించే దేవుని రాజ్యం “మందు-విందు-పొందులు” వంటి కామ వికార చేష్ఠలు సాగించే నిలయమని చెప్పొచ్చా?
యేసు సాక్షిగా “దేవుని రాజ్యమే (Kingdom of God – పరలోక రాజ్యం (Kingdom of Heaven)”!
యేసు తన శిష్యులను చూచి- ధనవంతుడు పరలోక రాజ్యము (Kingdom of Heaven) లో ప్రవేశించుట దుర్లభమని మీతో చెప్పుచున్నాను. ఇది గాక ధనవంతుడు పరలోక రాజ్యము (Kingdom of God) లో ప్రవేశించుట కంటే సూది బెజ్జములో ఒంటె దూరుట సులభమని మీతో చెప్పుచున్నాననెను” – మత్తయి 19:23,24
“పరలోక రాజ్యము (Kingdom of Heaven) అంటే” దేవుడు ప్రసాదించే స్వర్గమని అర్థం. అయితే పై వాక్యంలో “ధనవంతుడు పరలోక రాజ్యము (Kingdom of Heaven) లో ప్రవేశించుట దుర్లభం” అన్న వాక్యంలో “పరలోక రాజ్యము (Kingdom of Heaven)” నే, తరువాతి వాక్యంలో “ధనవంతుడు పరలోక రాజ్యము (Kingdom of God) లో ప్రవేశించుట కంటే సూది బెజ్జములో ఒంటె దూరుట సులభమని” చెబుతున్నారు. నిజానికి రెండవ వాక్యంలో “Kingdom of God” ను “దేవుని రాజ్యము” అని అనువాదం చెయ్యాలి! కానీ Kingdom of Heaven, Kingdom of God రెండు పదాలకూ “పరలోక రాజ్యము” అనే అనువాదం చెప్పబడింది. దీనిని బట్టి “పరలోక రాజ్యము” వేరు, “దేవుని రాజ్యము” వేరు అన్న తారతమ్యం బైబిల్లో అయితే లేదు! అలాంటి తారతమ్యాలు చూపటం మహా జ్ఞానులైన కొందరు బోధకులకే చేతనైన కళ!
ఖురాన్ ప్రస్తావిస్తున్న స్వర్గలోకపు సౌఖ్యాల పై హేళనగా మాట్లాడటం, చిల్లర డైలాగులు వేసే కొందరు ఇక నుండి సవరించుకోవలసిన విషయాలు- బైబిల్ ప్రస్తావిస్తున్న “పరలోక రాజ్యము” లేదా “బైబిల్ స్వర్గం” లో సైతం # నూరంతల భార్యలు # మందు (Vine) # భోజన-పానీయాలు # పస్కా విందులు వగైరా ఎన్నో సుఖ భోగాలు ఉంటాయి తప్ప, బైబిల్ స్వర్గం అంటే వైరాగ్యంతో కూడిన సన్యాసి జీవితం గడిపే స్థలం కాదు అన్నది. ఇలాంటి సుఖాలు, భోగభాగ్యాలతో కూడిన స్వర్గాన్నే ఖురాన్ లో కూడా వాగ్దాన చేయటం జరిగింది! ఆ స్వర్గాన్నే యేసు కూడా లభించనుందని వాగ్దానం చెయ్యటం జరిగింది అన్నది. కాబట్టి ముందుగా ఖురాన్ పై విమర్శలు ప్రక్కన పెట్టి యేసు చెప్పినట్టు దేవుడు ఒక్కడే అని నమ్మి, నైతిక జీవితం గడిపితే బైబిల్ స్వర్గంలో వైరాగ్యంతో కూడిన సన్యాసి జీవితం గడపాల్సి వస్తుందనే భయం అవసరం లేదు యేసు వాగ్దానం చేసిన అన్నిరకాల సుఖభోగాలతో కూడిన స్వర్గాన్ని పొందవచ్చు! సో, డోంట్ వర్రీ, జస్ట్ చిల్!!
Md Nooruddin
బైబిల్లో స్వర్గ సౌఖ్యాల ప్రస్తావన
