ఆ సినిమా ప్రొడ్యూసర్లు కాశ్మీర్ పండిట్లను ఆదుకోవాలి

కాశ్మీర్ ఫైల్స్ సినిమా చూసిన వారికి ఎక్కడా కన్నీళ్లాగటం లేదు. డైరెక్టర్ ఎక్కడ కనపడితే అక్కడ తట్టుకోలేక గుండెలు బాదుకుంటూ అతని కాళ్ల మీద పడిపోయి సాష్టాంగ నమస్కారాలు పెట్టేస్తున్నారు పాపం చూసొచ్చిన జనం.

ఒకప్రక్క సినిమా కూడా ట్యాక్స్ ఫ్రీ, కరెంట్ ఫ్రీ వెసులుబాటు కల్పించటంతో ‘పుష్ప’ కలెక్షన్లు దాటేసి వంద కోట్లుక్రాస్ చేసి బాక్సాఫీస్ ను షేక్ చేస్తున్నట్లు రిపోర్ట్లను బట్టి తెలుస్తుంది.

మరోప్రక్క కాశ్మీర్ నుండి వలసలు వచ్చేసిన కాశ్మీరీ పండిట్లు మా పై సినిమా తీసేసినంత మాత్రనా ప్రొడ్యూసర్లకు లాభాలు రావటం తప్ప మా కష్టాలేమీ తొలగిపోయినట్లు కాదని, మేము కోరేది మాపై సినిమా తియ్యమని కాదని మా కష్టాలను తొలగించమని చెప్పుకుని వాపోతున్నారు.

కాశ్మీరీ పండిట్లపై ఉన్న వల్లమాలిన అభిమానం, ప్రేమతో తీసిన ఈ సినిమా అన్ని వందల కోట్లు కలెక్షన్లు రాబట్టటానికి కారణమైన కాశ్మీరీ పండిట్లు జమ్మూలో ఇంకా ఇతర ప్రాంతాల్లో చిన్న చిన్న ఇళ్లల్లో, ఇరుకు గదుల్లో, టెంట్లలో నివసిస్తూ అష్ట కష్టాలూ పడుతున్నారు పాపం.

కాబట్టి సినిమాపై వచ్చిన వంద కోట్ల లాభాల్ని ఉదార హృదయంతో అష్టకష్టాలు పడుతున్న కాశ్మీరీ పండిట్లకు మొత్తం పంచిపెట్టేసి, మంచి పునరావాసాలు కల్పించి కాశ్మీరీ పండిట్లపై తమకున్న అపార ప్రేమను, దేశ భక్తిని నిరూపించుకోవాల్సిందిగా ప్రత్యేక మనవి.

దీని తరువాత 1960 నుండి వరుసగా దాదాపు 18000 మంది బెంగాల్ హిందువుల్ని అస్సామీయులు అన్యాయంగా చంపేసి, తరిమేసిన సంఘటనలపై “అస్సాం ఫైల్స్” అన్న పేరుతో కూడా సినిమా తీయవచ్చు.

కాకపోతే, సినిమాలో ఇస్లామోఫోబియా తాలూకు మసాలా బాగా దట్టించి హిందూ vs ముస్లిం మత విధ్వేష రాజకీయాలు నడపటానికి పనికిరాని ప్రాజెక్ట్ అవుతుందది. బహుశా అట్టర్ ప్లాప్ కావొచ్చు కూడా.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *