విధంగా ఓ వ్యక్తిని “బ్రేయిన్ వాష్” చేస్తుందో, చివరికి అతన్ని ఏ రకంగా మార్చి పరేస్తుందో తెలుసుకోబోతున్నాం అన్నమాట.
మొట్టమొదట ఇస్లాం అతనితో “జిహాద్” చెయ్యమని బ్రేయిన్ వాష్ చేస్తుంది!
అవును, ఇస్లాం ఒక వ్యక్తిని మొట్టమొదట “జిహాదీ”గా మార్చేసి, అతనితో “జిహాద్” చెయ్యమని చెబుతుంది! పైగా అది అలాంటి ఇలాంటి జిహాద్ కాదు! మరి ఎలాంటి జిహాద్ అంటే స్వయంగా ప్రవక్త ముహమ్మద్(స) మాటల్లోనే గమనించండి.
“తనలో ఉన్న చెడు ఆలోచనలతో తన మనస్సుతో పోరాడటమే మనిషి చేసే అత్యుత్తమ జిహాద్” -ప్రవక్త ముహమ్మద్(స)
చూశారా మిత్రులారా.. మనసులో మెదిలే చెడు తలంపులతో, చెడులతో పోరాడాలంట, పోరాడి నైతికంగా నడుచుకునే “అత్యుత్తమ జిహాద్” చెయ్యాలంటా! అలాంటి అత్యుత్తమ జిహాద్ చేసేవాడే ఇస్లాం ప్రకారం నిజమైన “జిహాదీ” అంట. ఇస్లాం ఎంత ప్రమాదకరమైన జిహాద్ నేర్పి బ్రేయిన్ వాష్ చేస్తుందో మీకు అర్థమవుతుందా?
పైగా ఇస్లాం అన్యాయంగా ఏ జీవిని చంపకూడదని బ్రేయిన్ వాష్ చేస్తుంది
చూడండి ఖురాన్ ప్రకారం “ఒక జీవిని అన్యాయంగా చంపితే సకల మానవులను చంపినట్టేనంటా అలాగే ఒక మానవుడి ప్రాణాలు కాపాడితే సకల మానవాళి ప్రాణాలు కాపాడినట్టే (5:32)” అంట! అలాగే “ఏ జీవినీ అన్యాయంగా చంపవద్దు (6:151)” అని ఖురాన్ చెబుతూ బ్రేయిన్ వాష్ చెయ్యటం ఎంత దారుణమో కదాండీ!
మనుషుల మధ్య వివక్ష చూపవద్దని ఇస్లాం బ్రేయిన్ వాష్ చేస్తుంది!
మనుషులు పుట్టుకతోనే మతాన్ని లేక వర్గాన్ని బట్టో, వారి రంగు రూపులను బట్టో ఎక్కువ తక్కువ కాదంట! పైగా ప్రవక్త ముహమ్మద్(స) చెబుతుందేమిటంటే… “మీలో ప్రవర్తన రీత్యా ఉత్తముడే దేవుని దృష్టిలో గొప్పవాడు తప్ప నల్లవానికి తెల్లవానిపై గానీ, తెల్లవానికి నల్లవానిపై గానీ ఏ ఆధిక్యతా లేదంట.
ఇంతేకాక, “భూలోక వాసులపై కరుణచూపితే ఆకాశవాసి మీపై కరుణ చూపుతాడని చెబుతూ, మనుషులందర్నీ సమానంగా చూడాలని, వారి మధ్య వివక్ష చూపకూడదని ఇస్లాం ఏ రకంగా బ్రేయిన్ వాష్ చేస్తుందో చూడండి మరి.!
అంతేకాక, చెడును మంచితో తొలగించమని చెప్పి బ్రేయిన్ వాష్ చేస్తుంది!
“నీవు చెడును శ్రేష్టమైన మంచి ద్వారా తొలగించు. అప్పుడు నీ పట్ల శత్రుభావం కలవాడు నీకు ప్రాణ స్నేహితుడైపోవటాన్ని నీవు గమనిస్తావు (41:34-35)” అని చెప్పటమే కాక, పైగా మీరు న్యాయం వైపే నిలబడండి మీ న్యాయం, మీ సాక్ష్యం మీకు మీ తలిదండ్రులకు, మీ బంధువులకు ఎంత హాని కలిగించినా సరే (4:135) అంటూ మనిషిని న్యాయం వైపే నిలబడే వ్యక్తిగా, చెడును మంచితో తొలగించే ఉత్తమోత్తమునిగా మార్చుతూ బ్రేయిన్ వాష్ చేస్తుంది ఇస్లాం.
తలిదండ్రుల్ని కనీసం విసుగ్గా ‘ఛీ’ అని సైతం కసురుకోవద్దని (17:23), ప్రజలతో మర్యాదగా మాట్లాడాలని (2:83), పేదరికానికి భయపడి మీ సంతానాన్ని హత్య చెయ్యటం నేరమని (17:31), పురుషులతో పరాయి స్త్రీలను చెడు దృష్టితో చూడవద్దని (24:30), స్త్రీల నుండి కట్నం తీసుకోకుండా పైగా ఎంతోకొంత ధనాన్ని ఎదురిచ్చి మరీ వివాహం చేసుకోవాలని (4:24), చివరకు మత్తు పదార్థాలు, చెడు అలవాట్ల నుండి (4:43), వ్యభిచారం నుండి దూరంగా ఉండమని (17:32), చెడు వాంఛల నుండి దూరంగా ఉండమని (79:41) బ్రేయిన్ వాష్ చేస్తుంది ఇస్లాం.
ఇదంతా ఒక ఎత్తైతే, స్వయంగా ప్రవక్త ముహమ్మద్(స) “పొరుగువాడు ఆకలిగా ఉండి తాను మాత్రమే కడుపు నిండా తిని పడుకునేవాడు విశ్వాసే కాద”ని చెప్పటమే కాక, కనీసం తన వద్ద ఏమీ లేకపోయినా ఒక ఖర్జూరాన్నైనా దానం చేసే దానగుణాన్ని నేర్పుతూ బ్రేయిన్ వాష్ చెయ్యటం ఉంది చూశారు.. ఈ రకమైన ఇస్లామిక్ బ్రేయిన్ వాష్ చాలా ప్రమాదకరమైంది కదా!
సృష్టి పట్ల గుడ్డి నమ్మకాల్ని కలిగి ఉండకుండా “భూమిపై సంచరించి, ఆ దైవం సృష్టిని ఏ విధంగా ప్రారంభించాడో కాస్త పరిశీలించమని (29:20)” బుద్ధిని ఉపయోగించమని, భూమ్యాకాశాల నిర్మాణం పట్ల శాస్త్రీయ దృష్టి కలిగి ఉండమని (3:190) ఇస్లాం నేర్పుతుంది.
కాబట్టి మిత్రులారా! చూశారు కదా. ఓ వ్యక్తిని ఇస్లాం ఎంత దారుణంగా బ్రేయిన్ వాష్ చేసి పరేస్తుందో. ఏ రకంగా ఓ వ్యక్తిని తయారు చేస్తుందో? ఒకవేళ ఈ రకమైన ఇస్లామిక్ బ్రేయిన్ వాష్ మంచిదే కదా? అంటారా.
అలా అయితే మరి వాట్స్ యాప్పుల్లో ఈ మధ్య మీడియాలో కొన్ని ఇస్లామోఫోబిక్ సినిమాల్లో “ఇస్లాం ద్వారా బ్రేయిన్ వాష్ చెయ్యబడే వ్యక్తులు ఉగ్రవాదులుగా, దౌర్జన్యపరులుగా, ప్రమాదకారులుగా మార్చివేయబడతారని” చూపుతున్నారేమిటి? అన్న సందేహం కలుగుతుందా?
“జిహాద్” అన్న పదానికి అర్థం “చెడును తొలగించి శాంతిని స్థాపించటానికి చేసే “కృషి” అన్నది ఇస్లాం చెబుతున్న అర్థమైతే.. ఈమధ్య కొందరు తయారు చేసుకున్న “లవ్ జిహాద్” పూర్తి అసంబద్ధమైన దిక్కుమాలిన పదం అనిపిస్తుందా?
అయితే కొన్నాళ్లు గాసిప్పుల్లోనో, సోషల్ మీడియాలోనో కొందరు ఇస్లామోఫోబులు రాసే రాతల్లోనో ఇస్లాంను గురించి తెలుసుకోవటం మానేసి.. అల్-ఖైదా, ఐసిస్ లాంటి సంస్థల్లో కొందరు చేస్తున్న ఉన్మాదాన్నే ఇస్లాం అన్న భ్రమలు తొలగించుకుని ఇస్లాంను కొన్నాళ్లపాటు ఖురాన్ లో, ప్రవక్త ముహమ్మద్(స) బోధల్లో స్టడీ చెయ్యటం మొదలెట్టండి.
అప్పుడు ఇస్లాం ఒక వ్యక్తిని ఏ విధంగా బ్రేయిన్ వాష్ చేస్తుందో అతన్ని ఏ విధంగా మార్చుతుందో తెలుసుకోండి.
