ఆ పాతబడ్డ మసీదు కప్పెక్కి గునపం పట్టుకుని కసితో బలంగా పొడవటంతో ఆ మసీదు కూల్చివేత మొదలెట్టినా మనిషే బల్బీర్ సింగ్.
ఎవరా బల్బీర్ సింగ్?
ఇతను ఆనాటి చారిత్రక మసీదు కెప్పెక్కి కూల్చేసిన కరసేవకుల్లో ఒకడు. పైగా రాజ్ పుట్ వంశానికి చెందినవాడు. బాల్ థాకరే స్పీచులకు, ఆర్ ఎస్ ఎస్ భావజాలానికి ప్రేరేపించబడి శివశక్తిలో సైతం సభ్యుడుగా పనిచేశాడు.
ఎన్నో వందల సంవత్సరాల నుండి మూతబడి ఉన్న ఆ పురాతన మసీదు కూల్చటానికి ఆ రోజు ఆ మసీదు కప్పెక్కిన వారిలో మొట్ట మొదటి వాడిని నేనే అని చెప్పుకునేవాడా మనిషి.
ఈరోజెందుకో ఆ మనిషిని జ్ఞాపకం చేసుకోవాలనిపించింది.
***
ఏమీ చెయలేని పరిస్థితిలో రక్షక భటులు అక్కడ నిలబడి ఉన్నప్పటికీ మసీదు కప్పును పగలగొట్టేసి తలకు కాషాయ కండువా చుట్టుకుని గర్వంగా రెండు చేతులు పైకెత్తి వికట్టాహాసం చేసాడు.
కానీ, ఆ మసీదు కూల్చిన రెండో రోజు నుండే మనసులో ఏదో తెలియని ఆందోళన, భయం, తప్పు చేశానన్న భావన ఆ మనిషిని వెంటాడటం మొదలైంది. మసీదు కూల్చిన బాధతోనే ఓ రోజు మౌలానా కాలీమ్ సిద్దీఖీ అనే ఓ ముస్లిం పెద్దాయన్ని కలవటం జరిగింది. తాను చేసిన పనికి ఎంతో సిగ్గుపడుతున్నానని తన బాధను ఆయన ముందు వెళ్ళగక్కాడు.
ఆ బల్బీర్ సింగ్ బాధను చూసి ఆ పెద్దాయన చెప్పిన విషయం- “ఒక మసీదు కూల్చితే ఏం పోయింది ఇంకా వంద మసీదులు నిర్మించటానికి జీవితంలో అవకాశం ఉందికదా!” బాధ పడొద్దులే అని.
ఎందుకో గానీ ఆ క్షణమే ఆ బల్బీర్ సింగు ఇస్లాం స్వీకరించి “ముహమ్మద్ అమీర్”గా తన పేరు మార్చుకున్నాడు. తాను చేసిన పనికి ఎంతో పశ్చాత్తాపం చెందాడు. తక్షణమే తాను చేసిన పాపానికి ప్రాయశ్చిత్తంగా వంద మసీదులు నిర్మిస్తానని సంకల్పం చేసుకున్నాడు! అనేక చోట్ల దాదాపు 90 మసీదులు నిర్మించాడు. అంతేకాక స్వంత విద్యాలయం తెరచి దాని ద్వారా ఇస్లాం వ్యాప్తి చేయటంలో నిమగ్నమైపోయాడు.
ఓ మూతపడిన మసీదును కుట్ర పన్ని, దానిని పడగొట్టేస్తే ఆ కూల్చేసిన వారిలో నుండే వంద మసీదులు కట్టటానికి ఓ వ్యక్తి నడుం బిగించటం అన్న అద్భుత సంఘటన ఈ ఇరవైయ్యవ శతాబ్దంలో మన కళ్ల ముందే జరిగింది. కాకపోతే అలాంటివి మీడియా చూపదు కనుక ఎవరికీ పెద్దగా ఆ సంఘటన గురించి తెలియదు.
బాధాకరమైన విషయం ఏమిటంటే వంద మసీదులు కట్టాలన్న సంకల్పం చేసుకున్న ఆ బల్బీర్ సింగు దాదాపు 90 మసీదులు కట్టేక తనువు చాలించి ఈ లోకం విడిచిపెట్టి వెళ్లిపోయాడు.
అప్పుడు జంతువులా ప్రవర్తించినందుకు చాలాసార్లు ఎంతో బాధను దిగమింగుతూ కన్నీళ్లు పెట్టుకునే వాడా మనిషి.
ఎందుకో ఈరోజు అతను జ్ఞాపకమొచ్చాడు
ఆ కరసేవకుణ్ణి జ్ఞాపకం చేసుకుందాం
