సైన్స్ ఆఫ్ “హలాల్” మీట్

భిన్న రకాల ఆహారపు అలవాట్లు కల వ్యక్తులున్న భారతదేశంలో తమ విశ్వాసాలను బట్టో, ఇష్టాయిష్టాలను బట్టో, ఆరోగ్య పరిస్థితులను బట్టో కొన్ని రకాల ఆహార పదార్థాలు తినటం, తినకపోవటం అన్నది ప్రజల వ్యక్తిగత విషయం. ఏది తిన్నా అది మన ఆరోగ్యానికి మేలు చేసేదై ఉండాలన్నది మట్టుకు అందరూ పాటించాల్సిన ఉమ్మడి నియమం.
ప్రస్తుత నేపథ్యంలో ‘హలాల్’ హిందువులు తినకూడదు ‘ఝట్కా’ మాంసాన్ని మాత్రమే తినాలని కొన్ని హిందుత్వ సంస్థలు నిరసనలు తెలియజేస్తున్న నేపథ్యంలో ప్రముఖ ‘ఆహార నిపుణులు’ ‘హలాల్’ మరియు ‘ఝట్కా’ మాంసాల గురించి ఏం చెబుతున్నారో గమనిద్దాం.

ఆహార నిపుణులు ఏ పద్దతిని ఆమోదిస్తున్నారు?

మైసూర్‌లోని ‘సెంట్రల్ ఫుడ్ టెక్నాలజీ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్‌’లో మాంసం సాంకేతిక విభాగం అధిపతి డాక్టర్II వి.కె మోడీ, హలాల్ పద్ధతిలో వధించిన జంతువు శరీరం నుండి రక్తం సంపూర్ణంగా బయటకు వచ్చేయటం వలన మాంసం ఎక్కువ సమయం తాజా ఉంటుంది మరియు ఎంతో మృదువుగా ఉంటుందని నిర్ధారించటం జరిగింది.

డా. కరుణా చతుర్వేది (Consultant nutritionist at Apollo Hospitals in New Delhi) సైతం- “హలాల్ పద్ధతి ఎంతో ఆరోగ్యకరమైందని దాని వల్ల జంతువు శరీరంలో రక్తం ఎక్కడా గడ్డ కట్టి బాక్టీరియా పేరుకుపోయి హానికరంగా మారిపోకుండా ఉంటుంద”ని చెప్పటం జరిగింది.

దీనికి భిన్నంగా ‘ఝట్కా’ పద్ధతి (మెడ వేరు చెయ్యటం) లో జంతువు శరీరంలో రక్తం గడ్డ కట్టేస్తుందని, తద్వారా ఆ జంతు శరీరంలో “సూక్ష్మజీవులు” పేరుకుపోయి ఆరోగ్యానికి హాని కలుగజేస్తుందని చెప్పటం జరిగింది.

‘హలాల్’ మాంసం ఎందుకు ఆరోగ్యకరం?

వాస్తవానికి జంతు కంఠాన్ని, మెడ నాళము (Jugular Vein) ను కత్తిరించటం ద్వారా మాత్రమే జంతు శరీరంలో రక్తం పూర్తిగా బయటకు వచ్చేయటానికి ఆస్కారం ఉంటుందని ఆహార నిపుణులు శాస్త్రీయంగా నిరూపిస్తున్నారు. ఈ ప్రక్రియలో జంతువు మెడ ఒక్కసారిగా శరీరంతో వేరు చెయ్యబడకపోవటం వలన జంతువు గుండె ఒక్కసారిగా ఆగిపోకుండా వెన్నపూస ద్వారా మెదడుకు, గుండెకు మధ్య రక్తం సరఫరా అయ్యే నాళాలు (vessels) దెబ్బతినకుండా గుండె పంపింగ్ చెయ్యబడుతూ ఉండటం వలన పూర్తి రక్తం బయటకు వచ్చేస్తుంది.

ఈ విధానానికి భిన్నంగా అదే ‘ఝట్కా’ పద్ధతిలో ఒక్కసారిగా జంతువు మెడ నరికేయటంతో గుండె ఒక్క సారిగా ఆగిపోతుంది. తద్వారా గుండె నుండి మెదడుకు సరఫరా అయ్యే నాళాలు తెగిపోవటం వల్ల గుండె రక్తాన్ని పంపింగ్ చేసే ప్రక్రియ నిలిచిపోతుంది. తద్వారా ఆ జంతువు శరీరంలో ఉండే సిరలు, ధమనుల్లో రక్తం ఎక్కడికక్కడే ఆగిపోయి గడ్డకట్టుకుపోతుంది. అంతేకాక, ఒక్కసారిగా మెడ నరికేయటం వలన జంతు కండరాలలో గ్లైకోజెన్ అనే ఎంజైమ్ విడుదలై నిల్వ ఉండిపోవటం వలన మాంసం గట్టిపడిపోయి త్వరగా కుళ్లిపోవటం ప్రారంభమైపోతుంది. కాబట్టి ఝట్కా పద్దతిలో లేక మెడ తిప్పి చంపేయటం వలన జంతు శరీరంలో రక్తం గడ్డకట్టేయటం జరుగుతుంది. ఆ రకమైన మాంసం తినటం వలన ఎన్నో వ్యాధుల బారిన పడే ప్రమాదముంది.

వధించబడిన జంతు మాంసం మృదువుగా, మెత్తగా ఉండాలంటే దాని ph కౌంట్ 5.4 మాత్రమే ఉండాలని, అదే ఝట్కా పద్ధతిలో జంతువుకు ఒక్కసారిగా గాయం అవ్వటం వలన ph గణన 7 వరకు పెరిగిపోతుందని.. హలాల్ విధానంలో ph స్థాయిలు ఝట్కాతో పోల్చితే 20 శాతం తక్కువగా ఉందని న్యూ ఢిల్లీలోని అపోలో హాస్పిటల్స్‌లో పోషకాహార నిపుణుడు డాక్టర్ కరుణా చతుర్వేది చెబుతున్నారు.

హలాల్ వలన జంతువు హింసించబడుతుందా?

హలాల్ విధానం వలన జంతువు ఎక్కువ బాధ అనుభవిస్తుందన్నదో అతి పెద్ద అపోహ. నిజానికి ఎప్పుడైతే జంతు మెడ నాళము (Jugular Vein) కత్తిరించబడుతుందో అప్పుడే మెదడుకు రక్తప్రవాహం ఆగిపోయి ఆ జంతువుకు నొప్పి అనేదే తెలియదు. పైగా గుండె పంపింగ్ చెయ్యబడుతూ ఉండటం వల్ల శరీరంలో రక్తం ఎక్కడా ఆగిపోకుండా కంఠం నుండి పూర్తి రక్తం బయటకు తన్నుకొచ్చేస్తుంది. ఆ సమయంలో జంతువు గిజగిజలాడుతూ, కాళ్లూ రెక్కలు ఆడించేది నొప్పివల్ల కాదు రక్తం వేగంగా ప్రవహించే సమయంలో కండరాలు వేగంగా కొట్టుకోవటం జరుగుతుంది.

పోనీ ‘ఝట్కా’ పద్ధతి హిందూ శాస్త్రాల్లో ఉందా?

ఎక్కడా లేదు! ‘ఝట్కా’ పద్ధతి అసలు హైందవుల ఆచారం కానే కాదు. నిజానికి అది పంజాబ్ సిక్కుల కల్పిత ఆచారం! వారే 20 వ శతాబ్దంలో ‘ఝట్కా’ పద్ధతిని కనిపెట్టారు. అనుమానం ఉన్నవారు సిక్కు పండితులు కూర్చిన “రెహత్ మర్యాదా” అన్న గ్రంథంలో (Chapter 13, Section 6) లో వారేం రాసుకున్నారో చదువుకోవచ్చు. వారే “ముస్లిములు చేసే హలాల్ పద్ధతిలో జంతు మాంసం తినటం నిషిద్ధం అని రాసుకున్నారు”. దానినే తరువాతి కాలాల్లో కొందరు హిందుత్వ వాదులు పుణికి పుచ్చుకున్నారు.

20వ శతాబ్దం ప్రారంభంలో పంజాబ్‌లోని ఏ మాత్రం శాస్త్రీయ అవగాహన లేని కొందరు సిక్కులు జట్కా విధానంతో జంతువును చంపటం ‘తక్కువ బాధాకరమైన విధానమని ప్రచారం చేశారు. దాన్నే కాపీ కొట్టి ఈనాటికీ చాలా మంది అవగాహన లేనోల్లు అదే రకమైన వాదన చేస్తుంటారు.

కాబట్టి అనవసర భావోద్రేకాలకు గురైపోకుండా.. ‘ఝట్కా’ మాంసం మంచిదా? ‘హలాల్’ మాంసం మంచిదా? ఏది ఆరోగ్యకరం? ఏది ఆరోగ్యానికి హానికరం అన్నది సైంటిఫిక్ కోణంలో కూడా పరిశీలించటం మంచిది. దాని ప్రకారం ఏది మంచిదనిపిస్తే అదే తినండి. అందులో బలవంతమేమీ లేదు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *