ఖుర్ఆన్…

కేవలం 23 ఏళ్లలో ఒక అనాగరిక జాతి మొత్తాన్ని నైతికతకు పట్టుకొమ్మగా మార్చేసిన గ్రంథం…

జాత్యాహంకారాన్నీ, ఉచ్చనీచ నిమ్నోన్నతా భావాలనూ, వర్ణవివక్షా ధోరణులను కూకటివెళ్లతో పెకిలించివేసిన గ్రంథం…

గత 1400 సం.లుగా కోట్లాది మంది ప్రజలను ప్రభావితం చేస్తూ వస్తున్న గ్రంథం…

గత 1400 సం.లుగా కోట్లాది స్మర్తల హృదయ ఫలకాలపై నిక్షిప్తమై ఉన్న ఏకైక గ్రంథం..

గత 1400 సం.లుగా ఒక్క పొల్లైనా మారకుండా సంరక్షించబడుతున్న గ్రంథం…

అనేక మంది ముస్లిమేతర మేధావి వర్గాన్ని ప్రభావితం చేసిన గ్రంథం..

ఆధునిక శాస్త్రవేత్తల ద్వారా చెప్పబడ్డ ఎన్నో శాస్త్రీయ విషయాలను 1400 సం.ల క్రితమే వివరించిన గ్రంథం…

అవగాహనా, ఆలోచనా పరుల ఆలోచనలకు మరింత పదునుపెట్టి వారి ద్వారా గొప్ప ఆవిష్కరణలు చేయించిన గ్రంథం…

ప్రపంచంలో మూడవ వంతు జనాభా ద్వారా అనుసరించబడుతున్న గ్రంథం..

ప్రపంచంలో ఏదో ఒక మూల ప్రతీ నిముషం నిత్యం పఠించబడుతూ ఉండే గ్రంథం…

లోతైన పరిశీలన చేసిన ఎందరినో శాంతిమార్గంలో నడిపిన గ్రంథం…

ఉగ్రవాదం చేపట్టిన కొందరి మూర్ఖుల ద్వారా అపార్థానికి గురికాబడిన గ్రంథం..

అనవగాహనా, అనాలోచితంగా చదివిన వారి ద్వారా అత్యధికంగా విమర్శకు లోనైన గ్రంథం…

వేదోపనిషత్తులూ, గీతా, బైబిల్ వగైరా పూర్వగ్రంథాలలో ఉన్న సకల సత్యాలన్నిటినీ తనలో ఇముడ్చుకున్న చిట్టచివరి దైవ గ్రంథం…

***

ఖురాన్ గురించి సంక్షిప్తంగా వివరించమన్న ఓ ముస్లిమేతర మిత్రుడి ప్రశ్నకు  సమాధానం

2 thoughts on “ఖుర్ఆన్…”

Leave a Reply to Mohammed Abdul Mujeeb Cancel reply

Your email address will not be published. Required fields are marked *