పగవాడు బూతులు మాట్లాడినా తాను మాత్రం సంస్కారంగా మాట్లాడే నైజం.. తన శత్రువులు తనను కించపరుస్తూ హేళన చేస్తూ మాట్లాడినా సహనం వహించగలిగే సంస్కారం.. బాధించినా ఓర్పు వహించే గుణం.. శత్రువు సమరానికి సై అంటున్నప్పటికీ సంధి కుదర్చటానికి కృషి చేసే తత్వం.. శాంతి స్థాపనకు నిత్యం కృష్టి చేసే వ్యక్తిత్వం.. చెడును సైతం మంచి ద్వారా తొలగించగలిగేంత మానవత్వం..
ఇలాంటి సుగుణాలు ప్రవక్త ముహమ్మద్ (స) లో ఉండబట్టే ఎందరో ముస్లిమేతర చరిత్రకారులు సైతం ఆయన ఉన్నత వ్యక్తిత్వాన్ని ప్రశంసించగలిగారు
ఈ గుణాలు లేని ముస్లిములు పైకి ప్రవక్త ముహమ్మద్ (స) పట్ల ఎంత ప్రేమ ప్రదర్శిస్తున్నప్పటికీ ఎన్నటికీ ఆయన అనుచరులు కానే కారు…
ఎందుకంటే ఏ నాయకుడినైనా గుడ్డిగా ప్రేమించేవారు అనుచరులు కారు.. అతని ఆదర్శాలు పాటించేవారు మాత్రమే నిజ అనుచరులు అవుతారు కాబట్టి
కానీ అలాంటి ముస్లిములు ప్రవక్త ముహమ్మద్ (స) అనుచరులు కారు
