ఇస్లాం పేర్కొంటున్న “జిహాద్”కు మీడియా చూపుతున్న “టెర్రరిజానికి” పొంతనే లేదు!

“యూద టెర్రరిజం” “క్రైస్తవ టెర్రరిజం” “హిందూ టెర్రరిజం” “బుద్దిస్ట్ టెర్రరిజం” అన్నపదాలతో ఎవరికీ పెద్దగా పరిచయం ఉండదు కారణం ఈ పదాలను ఫోకస్ చేసే ధైర్యం మీడియాకు ఉండదు కాబట్టి! కానీ ఖురాన్ అవతరించిన తరువాత గత 1400 సంవత్సరాల కాలంలో ఎప్పుడూ వినపడని, కేవలం గత ఇరవై సంవత్సరాల కాలంలో మనకు ఎక్కువగా వినపడుతూ ఉన్న పదం “ఇస్లామిక్ టెర్రరిజం” అన్నది. దానికి కారణం అమెరికా, యూరప్ దేశాలకు తొత్తులుగా పనిచేసే మీడియాకి కేవలం ఇస్లాం, ముస్లిములే టార్గెట్ కనుక ముస్లిముల కోసం మీడియా ప్రత్యేకమైన భాషను, పదజాలాన్ని ఉపయోగిస్తూ “ఇస్లామిక్ టెర్రరిజం” అన్న కొత్త పదాన్ని ప్రపంచానికి ఈ మధ్య కాలంలో పరియం చేసింది కాబట్టి!

“చల్లటి నిప్పు” “తియ్యటి ఉప్పు” ఒకవేళ ఉనికిలో ఉన్నాయంటే ఎంత ఆశ్చర్యమో, “ఇస్లామిక్ టెర్రరిజం” అన్న పదం ఉనికిలో ఉండటం కూడా అంతే ఆశ్చర్యకరం అని చెప్పవచ్చు. కారణం “ఇస్లాం” అన్నపదానికి “శాంతి” అన్న అర్థం సైతం తెలియని మీడియా “శాంతి ఉగ్రవాదం” అన్న పదాన్ని కనిపెట్టటానికి మించిన ఆశ్చర్యకరమైన విషయం మరొకటి ఏముంటుంది చెప్పండి? ఒక్క మాటలో చెప్పాలంటే సమాజంలో “అహింస” “అశాంతిని” నిర్మూలించటానికి ఇస్లాం చెయ్యమంటున్న కృషి పేరే జిహాద్ అంటే! జిహాద్ లక్ష్యం సమాజంలో శాంతిని స్థాపించటం మాత్రమే! చివరకు ఒక మనిషి తన మనసులో మెదిలే చెడు ప్రేరణలనతో పోరాడటం కూడా ఇస్లాం పేర్కొంటున్న జిహాదే! ఈ విషయం తెలియని అధిక శాతం సామాన్య ప్రజలు నేడు మీడియా ఏదైతే “ఇస్లామిక్ టెర్రరిజం” అనే క్రొత్త పదాన్ని కనిపెట్టి, ఏదైతే ప్రజలకు చూపుతుందో అదే జిహాద్ అన్న అపార్థాంలో ఉన్నారనటం అతిశయోక్తి కాదు.

జిహాద్ అన్న పదానికి అసలు అర్థం ఏమిటి?

“జిహాద్” అంటే “టెర్రరిజం” ఇదీ నేటి మీడియా మాయలో చిక్కుకున్న అధికశాతం మంది చేస్తున్న విమర్శ! “జిహాద్” అన్నది జ.హ.దా. అన్న పదం నుండి ఏర్పడింది. దాని అర్థం- “శ్రమించటం” “కృషి చెయ్యటం” అని. తప్ప భయభాంతులకు గురిచెయ్యటం అని కాదు. ఖురాన్ చెడును మారణాయుధాలతో కాదు “నీవు చెడును శ్రేష్ఠమైన మంచి ద్వారా తొలగించు” (41:34) అని చెబుతుంది. ప్రవక్త ముహమ్మద్ (స) చెయ్యమంటున్న జిహాద్ ఏమిటో ఒకసారి చదవండి.

“ఏ వ్యక్తి అయితే దైవం కొరకు తన హృదయంలో మెదిలే చెడులతో పోరాడతాడో అతడే వాస్తవంగా జిహాద్ చేసిన వాడు” – సహీహ్, ఇబ్నె హిబ్బన్ 4862

పై ప్రవక్త ప్రవచనం చదివిన తరువాత “జిహాద్” అంటే మనసుతో మనిషి చేసే అంతర్గత పోరాటం అని తెలుస్తుంది. పొరుగువాడు (అతను హిందువైనా, క్రైస్తవుడైన ఏ వర్గానికి చెందిన వాడైనా) ఆకలిగా ఉంది తాను మాత్రమే కడుపునిండా భుజించేవాడు అసలు విశ్వసే కాదన్నారు మహా ప్రవక్త ముహమ్మద్ (స) అలాంటి ఉన్నత సోదరభావాన్ని బోధించిన వ్యక్తి తోటిసోదరులు అవిశ్వాసులైతే వారిని నిర్దాక్షనీయంగా చంపేయమని చెప్పగలడా?

ముస్లిములందరూ తీవ్రవాదులు కారు! కానీ టెర్రరిస్టులందరూ ముస్లిములే!

పాశ్చాత్య దేశాలకు చెందిన మీడియా పనిగట్టుకుని చేసే చేసే ప్రచారమే ఇది. నిజానికి ప్రపంచవ్యాప్తంగా ఉన్న దాదాపు రెండువందల యాభై కోట్ల ముస్లిం ప్రజానీకంలో 0.1% వ్యక్తులు కూడా తీవ్రవాదులు కారు. అటువంటప్పుడు ఇస్లాం తీవ్రవాదం బోధిస్తుందని ప్రచారం చెయ్యటం దారుణం. ఎవరో కొందరు ముస్లిం పేర్లు తగిలించుకుని, ముస్లిం వేషధారణలో ఉండి కాల్పులు జరిపితే దానిని “ఇస్లామిక్ టెర్రరిజం” అన్న పేరు సృష్టించటం అత్యంత దారుణం. ఆ మాటకువస్తే ఇరాక్ వద్ద విధ్వంశకర ఆయుధాలు ఉన్నాయన్న అనుమానంతో అమెరికా సృష్టించిన విధ్వంసం ప్రపంచం మొత్తానికి తెలుసు. అమెరికా ఆకాశం నుండి బాబులు విసిరి 12 లక్షల17 వేల 892 మందిని చంపింది. ఆ యుద్ధం కోసం కొన్ని 20 లక్షల కోట్ల రూపాయలను ఖర్చుచేసింది. మరి మీడియా దానిని “క్రిస్టియన్ టెర్రరిజం” అని ఎందుకు ప్రస్తావించలేదు? చేసింది క్రైస్తవ దేశం! చేసింది, చేయించింది క్రైస్తవులేగా? ఒసామా బిన్ లాడెన్ అనే వ్యక్తికొసం అమెరికా మొత్తం ఆఫ్ఘనిస్తాన్ పై బాంబులు వేసి సృష్టించిన మారణహోమం “క్రైస్తవ ఉగ్రవాదం” కాదా? జార్జ్ బుష్ క్రైస్తవుడు కాడా? బాంబులు వేసిన సైన్యం క్రైస్తవులు కారా? చివరకు అసలు ట్విన్ టవర్స్ పై దాడులు చేసింది ముస్లిములే కాదని, దానికి పరోక్ష కారకుడు స్వయంగా జార్జ్ బుష్ అని, ఆరోజు ట్విన్ టవర్స్ లో పనిచేసే దాదాపు మూడువేలమంది యూదులు సెలవు మీద ఉన్నారని, చచ్చింది మటుకు క్రైస్తవులని అసలు వాస్తవాలు అమెరికా యూనివర్సిటీ ప్రొఫెసర్లు, సైంటిస్టులూ ఆధారాలతో సహా నిరూపించారు. ఇంతకు మించిన ఉగ్రవాదం ఇంకేముంటుంది? కానీ, ఈ దారుణానికి మీడియా పెట్టిన పేరు “ఇస్లామిక్ టెర్రరిజం”! తమకు శత్రు దేశమైన సోవియట్ రష్యాకు పోరాడే ఆఫ్ఘనిస్తానీయులకు ఆయుధాలను, డబ్బును సరఫరా చేస్తూ “అల్-ఖైదా”ను తయారు చేసిందే అమెరికా గూఢచారి సంస్థ CIA. తప్ప అది ముస్లిం ఉగ్రవాద సంస్థా కాదు! దానిని ముస్లిములూ స్థాపించలేదు. అసలు అల్-ఖైదా అన్న పేరుమీద ఇస్లామీ సైన్యం గానీ, టెర్రరిస్ట్ సంస్థ గానీ లేనే లేదు! అది కేవలం బుష్ ప్రభూత్వం తయారుచేసిన ఒక వ్యవస్థ మాత్రమే! 1979 ప్రాంతంలో ఆఫ్ఘనిస్తాన్ లో సోవియట్ రష్యాకు వ్యతిరేకంగా పోరాడే ఆఫ్ఘానీయులకు అమెరికా కొన్ని వందల డాలర్ల డబ్బును వెచ్చించి అక్కడ ఉన్న ముస్లిములను వాడుకుంది. అందులో ఒకడే ఒసామా బిన్ లాడెన్. ఈ విధంగా అమెరికా తయారుచేసిందే అల్-ఖైదా! ఈ విధంగా అల్-ఖైదా నుండి ఈ మధ్య తయారైన ISIS మరియు పాకిస్తాన్ లో తయారైన ఉగ్రవాదుల వరకు కేవలం ఉగ్రవాదాన్ని తయారుచేస్తుంది అమెరికా, కానీ మత దురభిమానంతో ఇస్లాంను అవమానపరుస్తూ వస్తుంది. ఇది దారుణమైన క్రైస్తవ ఉగ్రవాదం కాదంటారా?

అలాగే గాజా మీద ఇశ్రాయేల్ ఎలా విరుచుకు పడిందో, ఎంతమంది అమాయ కులను చంపిందో ప్రపంచం మొత్తం చూసింది. సిరియన్ల పై ఏవిధంగా మారణకాండ సాగిస్తుందో ప్రపంచం మొత్తం చూస్తుంది. ఈ విధంగా కొన్ని వేల మందిని చంపుతున్న యూదుల విషయంలో మీడియా “జ్యూయిష్ టెర్రరిజం” అని ఎందుకు ప్రస్తావించలేకపోతుందీ? 1945 కు ముందు ప్రపంచ పటం పై ఇశ్రాయేల్ అనే దేశమే లేదు. వారికి ఆశ్రయమిచ్చిన పాలస్తీనియన్ల పైనే దాడికి తెగబడి, పాలసినా భూభాగాన్ని ఆక్రమించుకుని యూదులు ఇశ్రాయేల్ దేశం నిర్మించుకున్నారు. అన్ని సంవత్సరాల యూదుల దాడులు జరుతున్నప్పుడు ఏనాడూ మీడియా “జ్యూయిష్ టెర్రరిజం” అన్న పేరు ఉపయోగించలేకపోయింది! కానీ తమ భూభాగం కోసం పోరాడిన ముస్లిములను మటుకు మటుకు మీడియా తీవ్రవాదులుగా పరిగణించటం దారుణం. పాలస్తీనా విషయంలో యూదులు చేసిందే, ఇండియా విషయంలో బ్రిటీషు ప్రభూత్వం చేసింది. దానిని క్రైస్తవ ఉగ్రవాదమని చెప్పే ధైర్యం మీడియాకు లేదు. కానీ, ఆనాడు భారత దేశ స్వతంత్ర పోరాటంలో పాల్గొన్నది అధికశాతం ముస్లిములే అన్నది అతికొద్దిమందికి తెలిసిన వాస్తవం! సిరాజుద్దౌలా, హాజీ షరియతుల్లాహ్, బహదూషా జాఫర్, మౌల్వీసయీద్ అల్లా ఉద్దీన్, అష్రఫుల్లా ఖాన్, బర్కతుల్లా భోపాలి, మౌలానా ముహమ్మద్ అలీ జౌహర్, ముఖ్తార్ అహ్మద్ అన్సారీ, ముహమ్మద్ గౌస్ సాబ్, మేజర్ జనరల్ షాన్వాజ్ ఖాన్, ఆబిద్ హాసన్ ఆఫ్రాని, మౌలానా హస్రత్ మొహానీ, మౌలానా ముహమ్మద్ హాబీబుర్రహ్మాన్, మౌలానా అబుల్ కలాం ఆజాద్, డా. సైఫుద్దీన్ వీరే కాకుండా ఇంకా ఎందరో ముస్లిములు భారత దేశ స్వతంత్రం కోసం కొన్ని వేలమంది ముస్లిములు ప్రాణత్యాగాలు చేశారు. కానీ, వారి ప్రాణత్యాగాలేవీ ఎవరికీ కనిపించవు. ఈనాడు భారతదేశంలో ఉన్నవారందరూ అనుభవిస్తున్న స్వతంత్రంలో ఎందరో ముస్లిముల ప్రాణత్యాగాలు దాగిఉన్నాయి. ఇస్లాం అవిశ్వాసులను చంపమని చెబుతుందని ఏ జ్ఞానమూ లేకుండానే మాట్లాడేవారు భారతదేశంలో అల్పసంఖ్యాక వర్గమైన ముస్లిములు ముస్లిమేతర దేశం కోసం, ముస్లిమేతరుల స్వతంత్రం కోసం చేసిన ప్రాణ త్యాగాల గురించి ఎందుకు పట్టించుకోరు? ఎక్కడో ఓ ఉన్మాది ముస్లిం పేరు తగిలించుకుని ఏదైనా కాల్పులు చేస్తే ఇస్లాంను, మొత్తం ముస్లిం సమాజాన్నే నిందించే వారు కాస్త చరిత్రలో వారికోసం ముస్లిములు చేసిన ప్రాణత్యాగాలను గమనించరా?

ఈ విధంగా హీరోషిమా-నాగసాకి పై దాడి మొదలుకుని, మొదటి, రెండవ ప్రపంచ యుద్ధాల్లో కోట్లమందిని చంపిన ఘనత క్రైస్తవులదే! కానీ, ఏనాడూ మీడియా ఈ ఘటనలను “క్రిస్టియన్ టెర్రరిజం”గా అభివర్ణించలేకపోయింది. గుజరాత్ లో హిందువులు, ముస్లిములపై చేసిన దాడులు సైతం ప్రపంచం మొత్తం టీవీల్లో చూసింది. వందల ముస్లిములను వీధుల్లో పరిగెత్తించి దారుణంగా చంపారు. మక్కా మసీదు, ఆజ్మీర్ పై దాడులు చేసింది స్వామీ ఆశీమానంద, దేవేంద్ర గుప్తా, సునిల్ జోషి వగైరా వీరంతా హిందువులే. మరి మీడియా “హిందూ టెర్రరిజం” అన్న పేరును ఎందుకు ఉపయోగించలేదు? కొన్ని వేలమంది రోహింగ్యా ముస్లిములను బుద్ధిస్టులు చంపారు. స్త్రీలను అత్యాచారం చేసి, పురుషులను, స్త్రీలను వారి శరీరభాగాలు కోసి అత్యంత పాశవికంగా చంపిన సంఘటనలు మీడియాలో చూశాం. కానీ మీడియా దానిని “బుద్దిస్ట్ టెర్రరిజం” అనే పేరు ఎక్కడా ప్రస్తావించలేకపోయింది.

చివరకు ముస్లిం పేర్లతో “గోహత్యలు” చేస్తుంది హిందూ సంస్థలే!

గోహత్యలు చేస్తున్నది, గోమాసం విస్తారంగా ఎగుమతి చేస్తుంది ముస్లిములు కాదు! కానీ, పైకి ముస్లిం పేర్లు పెట్టుకుని గోమాంసం ఎగుమతి చేస్తున్న సంస్థలు హిందువులవన్నది అందరూ తెలుసుకోవాల్సిన విషయం! “అల్ కబీర్ ఎక్స్ పోర్ట్స్” (Al Kabeer Exports Pvt. Ltd) ఇది పైకి వినటానికి ముస్లిములకు చెందిన సంస్థలా ఉంది కదూ! నాలుగు వందల ఎకరాల్లో తెలంగాణా రాష్ట్రంలో విస్తరించి ఉన్న భారతదేశంలోనే అతిపెద్ద గోమాంస ఎగుమతి సంస్థ ఇది. దీనిని నడుపుతుంది “సతీష్ సబెర్వాల్” అనే హిందువు. ఇది ఏటా 650 కోట్ల టర్నోవర్ కలిగి ఉంది. “అరేబియన్ ఎక్స్ పోర్ట్ లిమిటెడ్ (Arabian Exports Pvt. Ltd) దీని యజమాని “సునీల్ కపూర్” ఇతను ముస్లిం కాదు. “అల్-నూర్ ఎక్స్ పోర్ట్ లిమిటెడ్” (Al Noor Exports Pvt Ltd) ఈ గోమాంస ఎగుమతి సంస్థ నడుపుతుంది “సునీల్ సూద్” ఇతనూ ముస్లిం కాడు! ఇది ఉన్నది ఎక్కడో కాదు గోరక్షణ పేరుతో ముస్లిములపై దాడులకు తెగబడుతున్న యోగీ ఆధిత్యనాద్” ముఖ్యమంత్రి గా ఉన్న ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రం “షేర్ నగర్” లో అన్నది గమనార్హం. “AOB Exports Pvt. Ltd” దీనికి యజమాని “అరోరా”! ఇతనూ ముస్లిం కాదు! “Standard Frozen Foods Exports Pvt. Ltd” ఈ గోమాంస ఎగుమతి సంస్థ నడుపుతుంది “కమల్ వర్మ” ఈయనా ముస్లిం కాడే! “Maharashtra Food Processing and Cold Storage Pvt. Ltd” ఈ గోమాంస ఎగుమతి సంస్థ నడుపుతుంది “సన్ని ఖట్టర్” ఇతనూ ముస్లిం కాదు!

ఇవి కాక ఇంకా ఎన్నో హిందూ సంస్థల ద్వారా పైకి ముస్లిం పేర్లు పెట్టుకుని ప్రపంచవ్యాప్తంగా 18.50 లక్షల మెట్రిక్ టన్నుల గోమాంసం” ఎగుమతి చేస్తున్నారు. కేవలం మోడీ ప్రభూత్వ హయాములో 2015-16 మధ్య 26 వేల 682 కోట్ల రూపాయల ఆవు మాంసం ఎగుమతి అయిందని సమాచారం. వివరంగా చెప్పాలంటే ప్రపంచ వ్యాప్తంగా ఆవు మాంసం ఎగుమతి చేయటంలో బ్రేజిల్ తరువాత రెండవ అతిపెద్ద దేశం మన భారత దేశమే! మరి నేడు ముస్లిమేతర గోమాంస ఎగుమతి సంస్థల్లో జరుతున్న “గోహత్యలు” నేటి గొరక్షకుల కళ్ళకు కనపడటం లేదా? ఇది ముస్లిముల ముసుగులో కొనసాగుతున్న హిందూ ఉగ్రవాదం కాదా? కానీ ఇన్ని వాస్తవాలను కప్పెసి టెర్రరిజం అన్నది ముస్లిములకే స్వంతం అన్నట్టు మీడియా చిత్రీకరించి చూపుతుంటే కొందరు చరిత్ర అవగాహన లేని కొందరు “ఉగ్రవాదులందరూ ముస్లిములే” అని కూయటం మొదలెట్టారు.

కానీ ఖురాన్ చెబుతున్నదేమిటంటే-

“హత్యకు బదులు హత్యగానీ లేదా కల్లోలాన్ని వ్యాపింపజేసినందుకు గానీ కాక, మరే కారణం వల్లనైనా ఒక మానవుణ్ణి చంపినవాడు సమస్త మానవులను చంపినట్లే. ఒక మానవుడి ప్రాణాన్ని కాపాడిన వాడు మొత్తం మానవుల ప్రాణాలను కాపాడినట్లే” – ఖురాన్ 5:32

“ఒక మానవుడి ప్రాణాన్ని కాపాడిన వాడు మొత్తం మానవుల ప్రాణాలను కాపాడినట్లే” అని ఖురాన్ చెబుతుంది తప్ప ఒక ముస్లింను కాపాడిన వాడు అని చెప్పటంలేదు. ఇదే అనేకమంది ముస్లిములు భారత స్వతంత్ర ఉధ్యమంలో తోటి వ్యక్తుల ప్రాణాలకోసం తమ ప్రాణాలను పణంగా పెట్టటంలో ప్రేరకంగా పనిచేసింది. ఈ విధంగా భారతదేశ స్వతంత్రం కోసం అప్పట్లో అనేకమంది ముస్లిములు చేసిన ప్రాణత్యాగం సైతం జిహాద్ లో భాగమే!

నేరస్తుడు స్వంత వర్గీయుడైనా శిక్ష పడాల్సిందే!

నేరమూ, దానికి విధించే శిక్ష అన్న విషయాల్లో ఇస్లాం అవలంబించే న్యాయమైన విధానం ఏమిటో ఈ సందర్భంలో అందరూ తెలుసుకోవాల్సిందే! ఒక సందర్భంలో ప్రవక్త ముహమ్మద్ (స) వారు చెప్పిన విషయం- “ఐశ్వర్యం పేరు పలుకుబడి గల వ్యక్తి దొంగతనం అతడ్ని శిక్షించేవారుకాదు. ఈ కారణంగానే మీకు పూర్వం గతించిన జాతులు నాశనమయ్యాయి. అల్లాహ్ సాక్షి! ముహమ్మద్ కూతురు ఫాతిమా (రజి) అయినా సరే దొంగతనం చేస్తే నేనామే చేతిని నరికేస్తాను”

ఒక దొంగతనం నేరానికే ఇంత తీవ్రంగా చెప్పిన మహా ప్రవక్త ముహమ్మద్ (స), తోటివ్యక్తులను అన్యాయంగా ప్రాణాలు తీయమని చెప్పటం సాధ్యమేనా? ఈ మధ్య సౌదీ రాజకుటుంబానికి చెందిన యవరాజు , ఓ సాధారణ వ్యక్తిని హత్య చేశాడు. ఇస్లాం లా ప్రకారం శిక్షను రద్దు చేయటం మరియు క్షమాభిక్ష పెట్టే అధికారం, కేవలం చనిపోయిన వ్యక్తి కుటుంబీకులకు మాత్రమే ఉంటుంది. ఈ కేసులో, మృతుడి కుటుంబీకులు క్షమాభిక్ష పెట్టడానికి ఒప్పుకోలేదు. రాజకుటుంబం ఎన్ని రకాలుగా బతిమలాడినా, కోరినంత ధనం ఇస్తామని చెప్పినా వారు ఒప్పుకోలేదు. చివరికి ఉరి శిక్ష అమలు చేయబడింది. ఇదీ ఇస్లాం నేరస్తుల విషయంలో అవలంబించే న్యాయమైన విధానం.

ఈ మధ్యకాలంలో కొందరు అభినవ బోధకులు కొన్ని వాక్యాలు చూపి ఖురాన్ అవిశ్వాసులను చంపేయమంటుందని బురదజల్లే ప్రయత్నాలు ఎక్కువగా చేస్తున్నారు. అలాంటి ఆదేశాలు నిజానికి బైబిల్లో, భాగవద్గీతలో కోకొల్లలుగా ఉన్నాయి. కానీ అది వారికి తెలియదు. తెలిసిందల్లా ఇస్లాం పై ఎదోలా బురద జల్లటమే! వాస్తవానికి అప్పట్లో ప్రవక్త ముహమ్మద్ (స) వారి కాలంలో జరిగిన యుద్ధాలు కేవలం ధర్మాన్ని అణచటానికి శత్రువులు కాలు దువ్వినప్పుడు దైవధర్మ రక్షణకు చేసిన యుద్ధాలే తప్ప తమతఫున అమాయకులపై చేసిన యుద్ధాలు ఎంతమాత్రం కావు.

ఈ వాస్తవాలేవీ పట్టించుకోకుండా మీడియా సృష్టించిన “ఇస్లామిక్ టెర్రరిజం” అనే తెలివితక్కువ అర్థరహితమైన పదాన్ని పట్టుకుని ఇస్లాంను, ముస్లిములను ఉగ్రవాదంతో ముడిపెట్టటం, ఇస్లాంను ఒక బూచిగా ప్రజలకు చూపి తమ మాత రాజకీలకు వాడుకోవటమే వాస్తవానికి ఘోరమైన ఉగ్రవాదం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *