రష్యా గతంలో ఉక్రేయిన్ పై సృష్టించిన మారణ హోమాన్ని మీడియా “రష్యా చేస్తున్న యుద్ధం” అని చెప్పుకొచ్చింది, ఉక్రేయిన్ ప్రజలు అక్కడి సైన్యాలతో కలిసి రష్యా సైనికులను పొరాడి చంపితే దాన్ని “గొరిల్లా వార్” అంటూ చెప్పుకొచ్చింది.
బాల్ఫోర్ డిక్లరేషన్ తరువాత బ్రిటన్ అండదండలతో 1920 నుండి నేటి దాకా యూదులు పాలస్తీనాలో పిల్లలు, స్త్రీలు అన్నది చూడకుండా వేలాది మంది ముస్లిములను చంపుతూ ఎన్నడూ లేని ఓ కొత్త దేశాన్ని సృష్టించుకుంటే దానిని మీడియా “ఇశ్రాయిల్ చేస్తున్న యుద్ధం” అనే చెప్పుకొస్తుంది.
తమ భూముల్ని, తమ దేశాన్ని తమకు కాకుండా చేసినందుకు, స్వంత దేశంలోనే తమను పరాయివాళ్లుగా మార్చేసిన దుర్మార్గులతో, తమ స్వంత ప్రాంతాన్నే ఓ డిటెన్షన్ క్యాంప్ గా మార్చేసిన క్రూరులతో తమ విముక్తి కోసం, భూమి కోసం పోరాటం చేస్తున్న వారు “ఉగ్రవాదులు” ఎలా అయ్యారు? వాళ్లు చేసిన తిరుగుబాటు ఉగ్రవాదం ఎలా అయ్యింది? పైగా హమాస్ చేస్తున్న దాడులను “ఇస్లామిక్ జిహాద్” అన్న పేరు తగిలించి, వారిపై ఉగ్రవాదులనే ముద్రవేసి ప్రపంచానికి తెలియజేయాలను కుంటుంది ఏమిటి?
పోనీ ఇశ్రాయీల్, పాలస్తీనా మధ్య జరుగుతుంది మత యుద్ధమా? లేక హమాస్ అన్నది అల్-ఖైదా, ఇసిస్ లాంటి అమెరికా, యూరప్ లు పెంచి పోషిస్తున్న పెంపుడు కుక్కల గ్రూపా? అది ఇశ్రాయీల్ చేస్తున్న దౌర్జన్యాలకు రియాక్షన్ లో తయారైన ఓ తిరుగుబాటు సంస్థ.
ఇలా ఏదో సమస్య మీద తిరుగుబాటు చేసేవారంతా ఉగ్రవాదులే అయితే…
ప్రభూత్వ విధానాలపై అడవుల్లో ఉంటూ పోరాటాలు, తిరుగుబాట్లు చేసే వారిని “నక్సలేట్లు” “మావోయిస్టులు” “టైగర్లు” “మిలిటెంట్లు” వగైరా పేర్లేందుకు? వారందర్నీ మీడియా టెర్రరిస్టులు, ఉగ్రవాదులు అన్న ముద్ర ఎందుకు వెయ్యటం లేదు?
హమాస్ చేసింది కరెక్టా? కాదా? అన్నది ఇక్కడ వాదన కాదు, కానీ పాలస్తీనాలో హమాస్ అనే ఓ తిరుగుబాటు గ్రూపు ఉనికిలోకి రావటానికి, వారు ఆయుధం ఎత్తటానికి ముందు కారకులెవరు? అన్నదే ఇక్కడ అసలు ప్రశ్న.
హమాస్ అంటే అది ఈ మధ్య 1987 లో తయారైంది. మరి 1948 కి ముందు హమాస్ అన్న ఏ సంస్థా లేని కాలం నుండీ పాలస్తీనాలో స్వంతంగా ఒక్క అడుగు భూభాగం కూడా లేని కాలం నుండి మొత్తం పాలస్తీనాను ఆక్రమించటానికి యూదులు సృష్టించిన మారణహోమం “ఉగ్రవాదం” కాదా? అక్కడి ప్రజల్ని అన్యాయంగా వేలల్లో చంపుతూ సృష్టించిన రక్తపాతం “టెర్రరిజం” కాదా?
దీన్ని పేయిడ్ మీడియా జర్నలిస్టులు “జ్యూయిష్ టెర్రరిజం” అని ఎందుకు చెప్పలేకపోతున్నారు?
వారి ద్వారా బ్రెయిన్ వాష్ చెయ్యబడిన వారంతా యూదులు చేస్తున్న దౌర్జన్యాన్ని “ఇశ్రాయీల్ ఉగ్రవాదం” అని ఎందుకు గుర్తించలేకపోతున్నారు? ఇది వన్ సైడ్ అనాలసిస్ కదా?
బలహీనులపై చేసే దౌర్జన్యం యుద్ధమా? దానికి కడుపు మండి ఎదురు తిరిగి పోరాడితే అది ఉగ్రవాదమా?
పేయిడ్ మీడియా ఈ రకమైన పైత్యం ప్రదర్శించటానికి కారణం కేవలం పాలస్తీనా ప్రజలు ముస్లిములు కావటమే కదా.
వారు ఉగ్రవాదులెలా అయ్యారు?
