ఇంతకూ ప్రవక్త ముహమ్మద్(స) రాక పూర్వమే వేల కొద్దీ యూదులు వందల సంవత్సరాలుగా మదీనా పట్టణంలో ఎందుకు నివసిస్తూ ఉండేవారు? ఇంతకూ వారికి అక్కడ నివసించాల్సిన పనేంటి? వారు ఎవరి రాక కోసం ఎదురు చూస్తూ వందల సంవత్సరాలు అక్కడ నివాసాలు ఏర్పర్చుకున్నారో మీలో ఎవరికైనా తెలుసా? అయితే మీరు తప్పనిసరిగా తెలుసుకోవలసిందే.
యూదులు చదివే “తోరా (తౌరాత్)” గ్రంథం, అనేక పాతనిబంధన లేఖనాల ప్రకారం వారి కోసం ‘విశ్వప్రవక్త’ రావలసి ఉంది!
మోషే, యేసు రాకడ జరిగిపోయిన తరువాత యూదుల కోసం ఒక ప్రవక్త రానైయున్నారని తోరా మరియు పాతనిబంధన గ్రంథపు లేఖనాల్లో రాయబడి ఉండటమే కాదు, ఆయన పేరు, ఊరు, ఆయన లక్షణాలు, చివరకు ఏ ప్రాంతం నుండి రానైయున్నారు వగైరా అన్ని వివరాలతో సహా లేఖనాల్లో ఎంతో స్పష్టమైన సమాచారం రాయబడి ఉంది.
బైబిల్లోని లేఖనాల ప్రకారం రానైయున్న విశ్వప్రవక్త కేదారు నివాస గ్రామాల వద్ద ఉన్న “సెల” అనే ప్రాంతం నుండి రావలసి ఉంది! ఇంతకూ ఎవరీ కేదార్ నివాసులు? ఎక్కడ ఉందీ ఆ “సెల” ప్రాంతం అన్నది గమనించే ముందు యూదులు ఏ లేఖనం ప్రకారం వారు ఓ ప్రవక్త కోసం ఎదురు చూస్తూ ఉండేవారో ఈ క్రింది గమనిద్దాం.
“అరణ్యమును దాని పురములును కేదారు నివాస గ్రామములును బిగ్గరగా పాడవలెను. “సెల” నివాసులు సంతోషించుదురు గాక పర్వత శిఖరముల నుండి వారు కేకలు వేయుదురు గాక. ప్రభావము గలవాడని మనుష్యులు యెహోవాను కొనియాడుదురు గాక, ద్వీపములలో ఆయన స్తోత్రము ప్రచురము చేయుదురు గాక. యెహోవా శూరుని వలె బయలుదేరును. యోధుని వలె తన ఆసక్తి రేపుకొనును. ఆయన హూంకరించుచూ తన శత్రువులను ఎదురించుచు వారి ఎదుట తన పరాక్రమము కనబరుచును” – యెషయా 42:11-13
పై లేఖనంలో యెహోవా తరఫు నుండి రాబోయే ప్రవక్తకు బదులు అలంకారికంగా యెహోవా బయలు దేరును అని వ్రాయబడింది. ఈ లేఖనాన్ని బట్టి ఓ యోధుడిలా తన శత్రువులను ఎదురిస్తూ పరాక్రమం కనపరుస్తూ ఓ ప్రవక్త రానైయున్నారని, ఆయన రాకడ సంభవించినప్పుడు కేదారు నివాస గ్రామాలు బిగ్గరగా పాడుతూ ఆయనను స్వాగతిస్తారని, ఆయన వస్తున్నప్పుడు “సెల” నివాసులు ఆనంద గానం చేస్తారని యూదులకు ముందే తెలుసు.
ఇంతకూ ఈ లేఖనం ప్రస్తావిస్తున్న ‘కేదార్ వాసులు’ ఎవరో కారు అరేబియన్ ముస్లిములే! ఆశ్చర్యంగా ఉంది కదూ. ప్రవక్త అబ్రహాం(అలై) ఇద్దరు కుమారుల్లో ఒకరైన ఇష్మాయేల్(అలై) రెండవ కుమారుని పేరే కేదార్ (ఆది 25:13). కేదార్ వంశీయులే అరబ్ ముస్లిములంతా! కేదారు వాసులు నివసించే మక్కా, మదీనా ప్రాంతాలన్నీ కేదార్ గ్రామాలని బైబిల్లో రాయబడి ఉంది.
కాబట్టే యూదులు పనికట్టుకుని మరీ వందల సంవత్సరాలుగా పై లేఖనాన్ని బట్టి ఆ ప్రవక్త కోసం ఎందుకు ఎదురు చూస్తూ ఉండి పోయారు? ఎందుకంటే…
ఆ ప్రవక్త సరిగ్గా “సెల” ప్రాంతం నుండి రావలసి ఉంది కాబట్టి! ఇంతకూ ఈ “సెల” ఎక్కడుందో తెలుసా? సరిగ్గా మదీనాకు అతి దగ్గరలో, అది కూడా ‘మస్జిదే నబవీ’కి కేవలం 500 మీటర్ల దూరంలో ‘సెల’ అనే కొండ ప్రాంతంఈనాటికీ ఉంది.
ఆశక్తి ఉన్నవారు ‘గూగుల్ మ్యాప్స్’ ఓపెన్ చేసి ‘సెల-అరబ్ (Sela-Arab)’ అని సెర్చ్ చేసి చూడండి. సరిగ్గా అది మదీనా పట్టణానికి అతి దగ్గరలో “సెల” కొండ ప్రాంతం వద్దకు తీసుకెళుతుంది.
ఈ సమాచారం అరబ్బుల కంటే యూదులకు కొన్ని వందల సంవత్సరాలకు పూర్వమే తెలుసు. 70 AD లో రోమన్ రాజైన టైటాస్ ద్వారా యెరూషలేము పూర్తిగా ధ్వంసం చెయ్యబడినప్పుడు అప్పటికే విశ్వప్రవక్త ఆవిర్భావం గురించి లేఖన జ్ఞానం ఉన్న యూదులు తమ పూర్వీకులచే నిర్మించబడ్డ ‘యస్రిబ్’ పట్టణానికి దాని చుట్టుప్రక్కల ప్రాంతాలకు వచ్చి చేరిపోయి, అక్కడే వారు వడ్డీ వ్యాపారాలు చేసుకుంటూ స్థిర నివాసాలు ఏర్పర్చేసుకుంటారు.
‘యస్రిబ్’ అన్నది ఇప్పుడున్న మదీనా పట్టణానికి ఉన్న పాతపేరు. దానినే “మదీనా తుల్ అన్-నబవి” (The City Of The Prophet) అని కూడా అంటారు.
మదీనాలో ఆనాటి యూదులలో ముఖ్యమైన తెగలు “బను ఖురైజా” “బను నజీర్” “బను కైనుక” అన్నవి. ఇవిగాక- “బను హారిత్” “బను షుతైబా” “బను తలాబా” “బను జూషాం” “బను ఆఫ్” “బను అల్ఫగీర్” వగైరా అనేక యూద తెగలు మదీన పట్టణంలో వందల యేళ్లుగా నివాసాలు ఏర్పర్చుకుని, తమను కష్టాల నుండి బయటపడవేసి, తాము కోల్పోయిన పూర్వ వైభవాన్ని తెరిగి తెచ్చే విశ్వప్రవక్త ఆవిర్భావం కోసం ఎదురు చూస్తూ ఉండిపోతారు. ఆ విధంగా మదీనా యూదుల అధిక జనాభా ఉన్న పట్టణంగా మారిపోతుంది.
కానీ, వారు అనుకున్నది ఒకటైతే దైవం తలచింది వేరొకటి! అదేమిటంటే లేఖనాల ప్రకారం “సెల” ప్రాంతానికి రావలసి ఉన్న విశ్వప్రవక్త యూదులలో నుండి కాక, తాము ఎంతో నీచంగా చూసే “కేదార్” వాసుల (అరబ్బుల) లో నుండి ఆవిర్భవించటం! ఈ ఒక్క అంశమే యూదుల తలబిరుసుతనానికి కారణం అవుతుంది.
ఆ కేదార్ వంశీయులలోనే అప్పటి వరకూ యూదులు ఎదురుచూస్తూ వస్తున్న ఆ మహా ప్రవక్త ఆవిర్భావం జరిగిపోతుంది. అతనే ఇష్మాయేల్ కుమారుడైన కేదార్ వంశంలో పుట్టిన ముహమ్మద్(స).
మక్కాలో 12 సం.లు ఉండి అక్కడ నుండి ప్రవక్త ముహమ్మద్(స) తన పదివేల మంది శిష్యగణంతో మదీనాకు వలస వస్తారు. అప్పుడే మదీనా వాసులు (సెల నివాసులు) ఆయన రాకడను చూసి పట్టరాని ఆనంద గానాలు చేస్తూ ఆయనను సాదరంగా స్వాగతిస్తారు. ఆ విధంగా బైబిల్ పాతనిబంధన లేఖనం (యెషయా 42:11-13) నెరవేరుతుంది.
లేఖనాల ప్రకారం ఆవిర్భవించిన ప్రవక్త ముహమ్మద్ (స) ను యూదులు గుర్తిస్తారు. అయినప్పటికీ తమ వద్దకు పంపబడిన అనేకమంది ప్రవక్తలను అన్యాయంగా హత్యచేసిన యూదులకు ముహమ్మద్ (స)ను తిరస్కరించటం ఓ లెక్కా! వారి తిరస్కారానికి సమాధానంగా ప్రవక్త ముహమ్మద్(స) ప్రస్తావన తోరా (తౌరాత్), ఇంజీల్ (సువార్త) గ్రంథాల్లోనే వ్రాయబడి ఉందని ఆనాడు ప్రవక్త ముహమ్మద్ (స) యూదుల సమక్షంలో ఉండగానే ఖురాన్ ఎంతో స్పష్టంగా ఈ క్రింది విధంగా ప్రకటించింది.
“ఈ సందేసహరుణ్ణి, చదవనూ వ్రాయనూ రాని ఈ ప్రవక్తను అనుసరించేవారు (ఈనాడు ఈ కారుణ్యానికి అర్హులు) అతని ప్రస్తావన వారికి (యూదులు-క్రైస్తవులకు) తమ వద్ద ఉన్న తౌరాత్ (ధర్మశాస్త్రం), ఇంజీలు (సువార్త) గ్రంధాలలో వ్రాయబడి లభిస్తుంది. – 7:157”
పైగా ముహమ్మద్(స) అసలు ‘ప్రవక్త’ అన్న విషయాన్ని లేఖనాల ఆధారంగా ధృవీకరించిందే “వరఖా బిన్ నౌఫిల్” ఓ బైబిల్ పండితుడు! ఎప్పుడైతే పై వాక్యం అవతరించిందో అరేబియాలోని తిరస్కారులతో సహా, అనేకమంది యూదులు, క్రైస్తవులు లేఖనాలను పరిశీలించుకుని తండోపతండాలుగా ఇస్లాంలోకి ప్రవేశించటం జరుగుతుంది.
అయినప్పటికీ ఆనాడు మదీనాలో నివశిస్తున్న దుర్మార్గులైన అధికశాతం యూదులు మక్కా బహుదైవారాధకులతో కుమ్మక్కై ప్రవక్త ముహమ్మద్ (స) పట్ల అనేక కుట్రలు పన్నటం, అనేకమంది ప్రవక్త శిష్యులను హత్యలు చెయ్యటం ప్రారంభించారు. ఆ తరువాత ప్రవక్త ముహమ్మద్(స) యూదులపై సైనిక చర్యలు తీసుకుని, మదీనా నుండి యూదులందరినీ తన్ని తరిమేయటం జరిగింది.
ఆ విధంగా అటు యేసును “మెస్సియ” అని అంగీకరించక, ఇటు ముహమ్మద్(స) ను చిట్టచివరి ప్రవక్తగా నమ్మక దేవుని శాపానికి గురై అనేక దేశాల్లో చెదిరిపోయి, హిట్లర్ చేతిలో కుక్క చావు చచ్చి, మిలిగిపోయినవారు జర్మనీ నుండి పారిపోయి చివరకు పాలస్తీనా చేరిన వారే ఈనాడు రక్తపాతం సృష్టిస్తున్న యూదులు.
యూదులు తమ ప్రవక్త అయిన ముహమ్మద్(స) ను ఎందుకు తిరస్కరించారు? /-
