సరిగ్గా వంద సంవత్సరాల క్రితం మొదటి ప్రపంచ యుద్ధం జరుగుతున్న సమయం. నవంబర్ 2, 1917 న అప్పటి బ్రిటిష్ ప్రభుత్వపు విదేశాంగ మంత్రి ‘ఆర్థర్ బాల్ఫోర్’ బ్రిటిష్ యూద వర్గానికి చెందిన ప్రముఖుడైన ‘లియోనెల్ వాల్టర్ రూత్స్ చైల్డ్’కు 67 అక్షరాలతో కూడిన ఒక ‘ఉత్తరం’ రాశాడు.
అప్పటివరకూ పాలస్తీనాలో ప్రశాంత జీవనం గడుపుతూ వస్తున్న ముస్లిములకు పాపం తెలీదు ఆ ఉత్తరం ద్వారా వారి జీవితాలు ఛిద్రం చేయ్యబడి, భవిష్యత్తులో వారి రక్తంతో తడిచిన నేలపైనే మరో దేశం నిర్మించబడుతుందని, తాము స్వతంత్రంగా నివసించిన భూమే తమ కోసం ఓ డెటెన్షన్ క్యాంప్ గా మారబోతుందని, తమ ఇళ్లు కూల్చబడి తమ భూములు లాక్కోబడతాయని, రాబోయే రోజుల్లో ఓ భయంకరమైన రక్తచరిత్ర సృష్టించబడుతుందని.
ఆ ఉత్తరం యొక్క సారాంశం ఏమిటంటే- బ్రిటిష్ ప్రభుత్వం యూదుల కోసం పాలస్తీనా భూభాగంలో ఒక స్వంత దేశాన్ని నిర్మించి ఇవ్వటానికి నిర్ణయం తీసుకుందన్నది. ఆ ఉత్తరం పేరే- ‘బాల్ఫోర్ డిక్లరేషన్’.
****
పాలస్తీనాను ఇశ్రాయీల్ ఆక్రమించుకుంది కాబట్టి యూదులు, అక్కడి పాలస్తీనా ముస్లిముల మధ్య యుద్ధం జరుగుతుందన్న విషయమే దాదాపుగా అందరికీ తెలుసు, కానీ ఆ యుద్ధం మొదలవ్వటానికి మొట్టమొదట కార్చిచ్చు రగిలించింది ‘బ్రిటీష్ ప్రభుత్వం’ అన్నది చాలా తక్కువ మందికి తెలిసిన వాస్తవం.
యూదుల సామ్రాజ్యాన్ని పాలస్తీనాలో స్థాపించాలనే ‘జియోనిజం’ లక్ష్యానికి బ్రిటన్ ఎందుకు మద్దతు ఇచ్చింది? దానికి రెండు కారణాలు.. ఒకటి బ్రిటన్ యూదులను సపోర్ట్ చెయ్యటం ద్వారా మొదటి ప్రపంచ యుద్ద సమయంలో అమెరికా, రష్యాలలో పెద్ద సంఖ్యలో నివశిస్తున్న యూద జనాభా మద్దతు లభిస్తుంది. రెండు- ఇతర దేశాలను తమ కంట్రోల్లో ఉంచుకున్నట్లే ఇశ్రాయీల్ దేశంపై కూడా తమ అధికారం చలాయించవచ్చన్నది.
ఈ కుట్రపూరిత ఆలోచనతోనే 1922 నుండి 1948 మధ్యలో అప్పటికే యూరప్, జర్మనీ ఇతర దేశాల్లో ఉన్న యూదులందరినీ పాలస్తీనాలో సామూహిక అక్రమ వలసలకు అన్ని ద్వారాలనూ తెరచింది బ్రిటిష్ ప్రభుత్వం. అప్పటివరకూ కేవలం పాలస్తీనాలో 7 శాతం ఉన్న యూదులు 27 శాతానికి అమాంతంగా పెరిగిపోయారు.
ఒకప్రక్క బ్రిటిష్ సైన్యాల ద్వారా యూదుల కోసం తమ భూములు, ఇళ్లు అక్రమంగా జప్తు చెయ్యబడుతుంటే, తమ కళ్ల ముందే తమ వారంతా వెళ్లగొట్టబడి అక్కడి జనాభా క్రమంగా మార్చబడుతుంటే.. పాలస్తీనా ముస్లిములు హతాశులై ఏమీ చెయ్యలేని పరిస్థితిలో నిస్సహాయులుగా ఉండిపోయారు.
ఈ ఉద్రిక్తల మధ్య అటు అరబ్ దేశాల్లో 1936 లో ఏర్పడిన ‘అరబ్ నేషనల్ కమెటీ’ బ్రిటిష్ వలసవాదాన్ని వ్యతిరేకించాలని, యూదుల వ్యాపార ఉత్పత్తులను బహిష్కరిస్తూ సమ్మె ప్రారంభించాలని పాలస్తీనియన్లకు పిలునివ్వటం జరిగింది.
ఆరు నెలల పాటు జరిగిన ఈ సమ్మెను బ్రిటిష్ గవర్నమెంట్ అతి క్రూరంగా అణచివేసింది. అయినా 1937 లో పాలస్తీనియన్లు బ్రిటీషు దళాలకు, వలస వాదానికి వ్యతిరేకంగా తిరుగుబాటు చెయ్యటం ప్రారంభించారు.
దానితో పాలస్తీనా ముస్లిముల వారి ఇళ్లను కూల్చేసి వారిని నిర్దాక్షనీయంగా సామూహిక జనహననం చెయ్యటానికి, బ్రిటిష్ ప్రభుత్వం పాలస్తీనాలో తన 30 వేల సైన్యాన్ని ఆయుధాలతో సహా ఒక్కసారిగా దించింది. అక్కడి యూదులతో కలిసి “కౌంటర్ ఇన్సర్జెన్సీ ఫోర్స్” పేరట ఒక ఫోర్స్ ను సైతం తయారు చేసింది.
బ్రిటిష్, యూదుల సైన్యాలు కలిసి పాలస్తీనా ముస్లిముల ఇళ్లను దారుణంగా కూల్చివేశారు. భూములు లాక్కున్నారు. పాలస్తీనా ఊళ్లపై బాంబుల వర్షం కురిపించారు. చేతికందిన ముస్లిం పురుషుల్ని, స్త్రీలను, పిల్లల్ని అతి క్రూరంగా చంపటం ప్రారంభించారు.
నిర్దాక్షనీయంగా మూడేళ్ల పాటు సాగిన ఆ నరమేధంలో 5000 వేలకు పైగా పాలస్తీనియన్లు చంపబడ్డారు. పాలస్తీనా వీధులు శవాలతో నిండిపోయాయి. ఇరవై వేల మందికి పైగా గాయపరచబడ్డారు ఎందరో వికలాంగులుగా మారారు. వేలమంది జైళ్లలో కుక్కబడ్డారు.
కేవలం 1947 నుండి 1949 మధ్యలో 750000 మంది పాలస్తీనా ముస్లిములు తమ ఇళ్ల నుండి గెంటి వేయబడి బయట దేశాల్లో శరణార్ధులుగా మార్చబడ్డారు. గాజా పట్టీ అక్కడి ముస్లిములకు ఒక డిటెన్షన్ క్యాంప్ గా మార్చబడింది. దీనిని బట్టి ఏ విధమైన దౌర్జన్యం పాలస్తీనా ప్రజలపై జరిగిందో అంచనా వెయ్యవచ్చు.
నిజానికి యూదులు ఎంతటి స్వార్ధపరులంటే ఇంతగా బ్రిటీషు ప్రభుత్వం సహాయం చేసినప్పటికీ 1944 లో ఇతర దేశాల నుండి యూదులు పాలస్తీనాలో ప్రవేశించటానికి బ్రిటీషు ప్రభుత్వం కొన్ని పరిమితులు విధించటంతో జియోనిస్ట్ సాయుధ సమూహాలు బ్రిటిష్ పైనే యుద్ధాన్ని ప్రకటించాయి. బ్రిటీషు అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసుల మీద, వారి హోటళ్ల మీద బాంబులు వెయ్యటంతో 91 మంది బ్రిటీషు వారు చనిపోయారు. వీళ్ల దెబ్బకు తట్టుకోలేక బ్రిటీషు ప్రభుత్వం పాలస్తీనాను వదిలిపెట్టి పారిపోయింది. పాలస్తీనా, ఇశ్రాయీల్ గొడవను ఐక్యరాజ్య సమితే తేల్చాలని చేతులెత్తేసింది.
జియోనిస్ట్ పారామిలిటరీ గ్రూపులు యూదుల రాజ్యాన్ని నిర్మించడానికి పాలస్తీనియన్లను వారి పట్టణాలు మరియు గ్రామాల నుండి సామూహికంగా బహిష్కరించే లక్ష్యంతో పెద్ద ఎత్తున దాడుల రూపంలో “జాతి ప్రక్షాళన” అనే దుర్మార్గపు ప్రక్రియను ప్రారంభించింది.
1947 నుండి 49 మధ్యలో 15000 వేల మంది పాలస్తీనా ముస్లిములు దారుణంగా చంపబడ్డారు. వేల కొద్దీ ఇళ్లు నేలమట్టం చెయ్యబడ్డాయి. ఎంతో మంది కట్టుబట్టలతో భార్యా పిల్లల్ని తీసుకుని వేరే దేశాలకు కాలి నడకన వెళ్లిపోయారు.
ఐక్యరాజ్య సమితి ఇచ్చిన పరిమితులతో సంబంధం లేకుండా సుమారు 78 శాతం పాలస్తీనా భూభాగాన్ని యూదులు ఆక్రమించారు.
ఇంతపెద్ద రక్తపాతాన్ని సృష్టించిన యూదులు మే 15, 1948 న ఇశ్రాయీల్ దేశాన్ని ప్రకటించుకుంటారు. ఆరోజును గుర్తు చేసుకుంటూ ప్రతీ సంవత్సరం పాలస్తీనియన్లు “అక్బా” దినంగా జరుపుకుంటారు. అక్బా అన్న అరబీ పదానికి “ఘోర విపత్తు” అని అర్థం.
ఈ మధ్య 1987 లో ఇశ్రాయీల్ దౌర్జన్యాల ఫలితంగా “హమాస్” గ్రూపు తయారైంది. సరే, మరి అంతకు ముందే 1920 నుండి బ్రిటీషు ప్రభుత్వ సహాయంతో పాలాస్తీనా పై యూదులు చేసింది ఉగ్రవాదం కాదా? వేల కొద్దీ పాలస్తీనా ముస్లిములను నిర్దాక్షనీయంగా చంపుతూ వచ్చి ఐక్యరాజ్య సమితి పరిధులను కూడా పట్టించుకోకుండా అక్రమంగా పాలస్తీనాను ఆక్రమించి అన్యాయంగా ఇశ్రాయీల్ దేశాన్ని నిర్మించుకోవటం ఉగ్రవాదం కాదా?
“నరహత్య చెయ్యవద్దు” “దొంగలింపవద్దు” అన్నవి యూదులు చదివే “తోరా” గ్రంథపు “పది ఆజ్ఞల”లోని రెండు ప్రధాన ఆజ్ఞలు. ఈ రెండిటికీ వ్యతిరేకంగా పాలస్తీనా భూభాగంలో యూదులు నరహత్య చేసి, భూములు దొంగలించి నెరవేర్చించి దేవుని సంకల్పమా? సాతాను సంకల్పమా?
ఇప్పుడు హమాస్ గ్రూపు అన్యాయంగా ఇశ్రాయీల్ పై టెర్రరిజం చేసేస్తుందని, తామేదో పతీతులన్నట్టు యూదులు ఆడుతున్న నాటకానికి పేయిడ్ మీడియా వంత పాడుతుంటే, యూదులంటే రెండు చెవులూ కోసేసుకునే క్రైస్తవులు అవే రాగాలు తీస్తుంటారు.
రక్తచరిత్ర సృష్టించిన ‘బాల్ఫోర్ డిక్లరేషన్’
