హిట్లర్ నిజంగా అదృష్టవంతుడనే చెప్పాలి. జర్మనీ పూర్తిగా నాశనం అయ్యేవరకు జర్మన్లు “హిట్లర్ ను దేశం కోసం ధర్మం కోసం పనిచేస్తూ మమ్మల్ని కాపాడే రక్షకుడు” అనే భ్రమలోనే ఉండేవారు! కాదు ఆ విధంగా బ్రేయిన్ వాష్ చెయ్యబడేవారు.
‘నాగుపాము సేఫ్టీ కోసం పాము పుట్టను కట్టేది చీమలే’ అన్నట్లుగా హిట్లర్ చేసే తప్పుల్ని, నష్టాల్ని కప్పిపుచ్చటానికి, ప్రజల దృష్టిని అసలు ఇష్యూ నుండి మళ్లించటానికి వాడి అబద్ధాలను నిజాలన్నట్లు ప్రచారం చెయ్యటానికి వాడిమీద ఈగ కూడా వాలకుండా కాపాడుకోటానికి వాడికంటూ స్వతహాగా గుడ్డిగా అభిమానించే ‘అంధభక్తుల టీం’ కూడా ఉండేది. దేశపు మీడియాను తన కంట్రోల్లో పెట్టుకునేవాడు.
ప్రజలతో “మీరు దేశాన్ని ప్రేమించేవారైతే నాకు ఓటెయ్యండి” లాంటి ఎమోషనల్ డైలాగ్స్ తో ప్రజల భావోద్రేగాలను రెచ్చగొట్టేవాడు. తాను ఓ డిక్టేటర్ గా మారి ప్రజలను తన చెప్పుచేతల్లో పెట్టుకోవాలంటే ముందుగా ప్రజల లాజికల్ మైండ్ ను నాశనం చేసెయ్యాలి.
ప్రజలు చరిత్ర వల్ల, గొప్ప చరిత్రకారుల వల్ల ఎక్కడ లాజికల్ గా డవలప్ అయిపోతారో అన్న భయంతో నాజీ పార్టీ అఫిషియల్స్ ద్వారా 10 మే 1933 న అక్షరాల 25 వేల పుస్తకాలు కాల్చి వెయ్యబడ్డాయి. కాల్చివేయ్యబడ్డ ఆ పుస్తకాలన్నీ మార్క్సిజం, లిబరిజం, ప్రజాస్వామ్యం, సైకాలజీ, వివిధ కళలపై రాయబడ్డవే. ఆ పుస్తకాలన్నిటినీ కాల్చేయటానికి కారణం హిట్లర్ ఆ పుస్తకాలన్నిటినీ “యాంటీ-నేషనల్” పుస్తకాలుగా గుర్తించటమేనట!
యూనివర్శిటీ పాఠాల ద్వారా ప్రజలు మరీ తెలివైనవారిగా మారిపోకుండా ప్రజలందర్నీ పక్కా ఐటం గాళ్ల మాదిరిగా మార్చిపడెయ్యటానికి పనికొచ్చే పాఠ్యాంశాలను తొలగించేసి తమ భావజాలానికి తగ్గ సబ్జెక్టులనే నాజీ పార్టీ అఫిషియల్స్ యూనివర్శిటీ పాఠ్యాంశాలలో చేర్చేవారు. తమ భావజాలాన్ని నేర్పే అధ్యాపకులను బోధకులుగా నియమించటం జరిగేది.
గట్టర్ గ్యాస్ నుండి మంట పుట్టించి టీ సైతం కాయవచ్చన్నట్లుగా హిట్లర్ స్వంత సైన్స్ బోధించేవాడు. విశ్వం మొత్తం ఐసుతో తయారైందని చెబుతూ ‘వరల్డ్ ఐస్ థియరీ” అని ఒకదానిని హిట్లర్ ప్రమోట్ చేసేవాడు. పైగా ఈ దిక్కుమాలిన సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన ‘హన్స్ హోర్బిగర్’ అనే మూర్ఖుడికి నాజీ ప్రభుత్వం డాక్టరేట్ సైతం ప్రదానం చెయ్యటం జరిగింది!
తన అధికారాన్ని నిలబెట్టుకోటానికి హిట్లర్ వాడిన గొప్ప స్ట్రాటజీ జర్మన్ల దృష్టిలో ఓ “కల్పిత శత్రువు”ను సృష్టించి, వారి నుండి దేశాన్ని, జర్మన్ దేశ ప్రజలను కాపాడే “జర్మన్ రక్షకుడు” తానొక్కడినేనన్న ఓ ఎమోషన్ ను ప్రజల్లోకి తీసుకెళ్లటం.
హిట్లర్ వాడిన ఈ గొప్ప స్ట్రాటజీలో ఆ “కల్పిత శత్రువు” ఎవరో కాదు అప్పటికి మైనారిటీలుగా జర్మనీలో బ్రతుకుతున్న యూదులు. ఏ విధంగా యూదులు దేశానికి ప్రమాదకారులో, జర్మన్ వ్యతిరేకులో తెలియజేస్తూ వారిపై హిట్లర్ అంధభక్తుల టీం ద్వారా మీడియాలో అనేక కార్టూన్లు వెయ్యబడేవి, అబద్ధ ప్రచారాలు చెయ్యబడేవి, ఫాల్స్ ప్రోపగాండా చెయ్యబడేది.
చివరకు మొదటి ప్రపంచ యుద్ధం జరిగి జర్మనీ నష్టపోవటానికి, ఆర్థిక స్థితి దిగజారిపోవటానికి యూదులే కారణం అని హిట్లర్ అంధభక్తుల సమూహం ప్రచారాలు చేసేది.
నిజానికి ఆ ప్రచారం ఎంత అబద్ధం అంటే మొదటి ప్రపంచ యుద్ధంలో జర్మన్లతో కలిసిపోరాడిన వారిలో యూదులు లక్షకు పైగా ఉన్నారు. పైగా 12 వేల మంది యూదులు ప్రాణాలు సైతం అర్పించేశారు కూడా! కానీ, హిట్లర్ అంధభక్తుల టీం చేసిన అబద్ధ ప్రచారాల వల్ల అచ్చం భారతదేశంలో స్వతంత్ర పోరాటంలో పాల్గొని ప్రాణాలు అర్పించేసిన ముస్లిముల్ని మర్చిపోయినట్టే నాటి జర్మన్లు యూదుల త్యాగాలను మర్చిపోయి వారిని దేశద్రోహులుగా ముద్రవేయటం జరిగింది.
వారి వల్ల జర్మన్లు ప్రమాదంలో ఉన్నారని, వారిని తమ దేశం నుండి తరిమెయ్యాలని, వారు దేశానికి ప్రమాదకారులని, చూస్తూ ఉరుకుంటే వారు కొన్నాళ్లకు జర్మనీని యూద దేశంగా మార్చేస్తారని ఫాల్స్ ప్రోపగాండా చేస్తూ ఉండేవారు. మీడియా సైతం అదే చూపుతూ ఉండేది కూడా.
హిట్లర్ సృష్టించిన ఈ అబద్ధాల్ని ప్రజలు ఎందుకు నమ్మేవారంటే ఒకటి దేశంలో నిరుద్యోగం పెరిగిపోవటం, మీడియా మొత్తం ఈ అబద్ధాల్నే మాటిమాటికి ప్రచారం చెయ్యటం ఆ ఆబద్ధాలనే రాయటం.
హిట్లర్ వాడిన మరొక గొప్ప స్ట్రాటజీ తాను దైవం తరఫున జర్మన్లను కాపాడగలిగే ఏకైక ‘మెస్సీయ’గా తనకు తాను ప్రమోట్ చేసుకోవటం. దానినే అతని అంధభక్తులు ప్రచారం చేసేవారు. ప్రజల సెంటిమెంట్ ను క్యాష్ చేసుకోటానికి తన ఆటోబయోగ్రఫీలో ‘తాను చిన్నతనంలో ల్యాబర్ పని చేసేవాడినని, అత్యంత బీదరికంలో పెరిగాన’ని రాసుకొచ్చాడు. తరువాత కాలంలో అదంతా అబద్ధమని అతను చిన్నతనంలో అసలు ల్యాబర్ పనే చెయ్యలేదని తేలిపోయిందనుకోండి!
సరే, హిట్లర్ తన స్ట్రాటజీలను సక్సస్ఫుల్ గా నడపాలన్నా, మీడియాను కొనేయాలన్నా చాలా డబ్బు అవసరం అవుతుంది. దానికోసం హిట్లర్ కార్పొరేట్ సంస్థలను తన కంట్రోల్లో పెట్టుకుని వారి నుండి ఫండ్ కలక్ట్ చేసేవాడు. వోక్స్ వేగన్, కొడాక్, ఐ.బి.యం, సీమెన్స్, ఫాంట, ఫోర్డ్ లాంటి ఎన్నో కార్పొరేట్ కంపెనీలు హిట్లర్ కోసం ఫండ్ ఇస్తూ ఉండేవి. ఆయా కార్పొరేట్ కంపెనీల ఒనర్స్ తో హిట్లర్ గట్టి ఫ్రెండ్ షిప్ నడుపుతూ ఉండేవాడు.
కానీ హిట్లర్ జర్మనీలో వాడిని ఈ స్ట్రాటజీ ద్వారా భారతదేశంలో ఒక వ్యక్తి అత్యధికంగా ప్రభావితం కాబడ్డాడు. హిట్లర్ తయారుచేసిన “నాజీయిజం” ఐడియాలజీ ఆధారంగా ప్రజల ఎమోషన్స్ ను కంట్రోల్ చేస్తూ రాజకీయం ఎలా నడపవచ్చో వివరిస్తూ “హిందుత్వ ఐడియాలజీ” అనే ఒక కొత్త భావజాలాన్ని అతను ముందుకు తీసుకొచ్చాడు.
అతని పేరే “వినాయక దామోదర్ సావర్కర్”
