పురుషుల కామకోరికల్ని భావోద్రేకాలను రెచ్చగొడుతూ డబ్బు సంపాదించే “లస్ట్ ఫార్ములా”తో కూడిన సినిమాల వ్యాపారం ఒకప్పుడు ఊరి బయట పాడుబడ్డ సినిమాహాళ్లలో సాగుతూ ఉండేది.
క్రమేపీ ఆ “లస్ట్ ఫార్ములా” కుటుంబ కథా చిత్రాలని చెప్పబడే సినిమాల్లో, టీవీ సిరియల్స్ లోనూ వచ్చి చేరాయి. ఇంకాస్త టెక్నాలజీ డవలప్ అయింది. క్రమంగా ఆ ఫార్ములాతో కూడిన సినిమాలు వీడియో కేసెట్లలో.. ఆ తరువాత సీడీల్లోకి.. అక్కడి నుండి ఇంటర్నెట్, కంప్యూటర్ల ద్వారా అందరికీ అందుబాటులోకి వచ్చేశాయి.
టెక్నాలజీ మరికాస్త డవలప్ అయి ఇప్పుడు యువత భావోద్రేగాల్ని రెచ్చగొడుతూ “లస్ట్ ఫార్ములా”తో కూడిన వీడియోలు ‘ఇన్స్టా గ్రామ్’ మరియు ‘ఫేస్ బుక్ రీల్స్’ ద్వారా అరచేతిలో ఇమిడిపోయే సెల్ ఫోన్లలో ఎంతో అలవోకగా ప్రదర్శించబడుతున్నాయి.
పైగా ఈరకమైన “లస్ట్ ఫార్ములా”తో కూడిన “రీల్స్” తీస్తూ పురుషుల, యువకుల కోరికల్ని రెచ్చగొట్టే బృహత్తర బాధ్యతను తమ భుజాలపై మోస్తుంది ఎవరో కాదు… ఇళ్ళల్లో కమ్మగా తినేని ఖాళీగా ఉంటూ ఏం చెయ్యాలో తోచక, అందాల్ని దాచుకోవటం ఓ ఘోర పాపంగా భావిస్తూ ఎలాగైనా ఫేస్బుక్ రీల్స్ లో డ్యాన్సులు కడుతూ వీలైనంతగా తమ శరీర ఒంపుసొంపుల్ని ఎక్స్ పోస్ చెయ్యటాన్ని ఓ పవిత్ర కళగా భావిస్తూ అర్జెంటుగా రాత్రికిరాత్రే ఫేమస్ సెలబ్రేటీలు అయిపోవాలనే ఆతురత కలిగిన కొందరు కుటుంబ స్త్రీలు, చదువుకుంటున్న అమ్మాయిలే!
తమ శరీర ఒంపుసొంపుల్ని ఎంత వీలైతే అంత ప్రదర్శిస్తూ ఇన్స్టా గ్రామ్, ఫేస్బుక్ రీల్స్ ద్వారా లైకులు, షేర్లు సంపాదించటమే జీవిత ప్రరమావధిగా భావిస్తూ పనికిమాలిన పాటలకు నిస్సిగ్గుగా విచ్చలవిడితనంతో డ్యాన్సులు కడుతూ యువత ఆలోచనల్ని ఎంతగా పాడు చెయ్యాలో అంతా పాడుచేస్తూ.. సమాజంలో పద్ధతిగా అణుకువతో నడుచుకునే మిగతా స్త్రీలపై లైంగిక వేధింపులకు, అత్యాచారాలకు పాల్పడే విధంగా మగాళ్లను మృగాలుగా మార్చేసే దిగజారుడు బాధ్యతను కొందరు స్త్రీలు ఎంతో గ్లామరస్ గా తమ వంతు బాధ్యతను ఫేస్బుక్, ఇన్స్టా గ్రామ్ రీల్స్ ద్వారా నిర్వహిస్తున్నారు.
అశ్లీల్లం, వెకిలితనం వినోదంగా మారిపోయిన సమాజం.. విచ్చలవిడితనం, వ్యభిచారం, అత్యాచారాలు సర్వసామాన్యమైపోయిన దేశం ప్రమాదకరమైన అంచులపై ఉన్నట్టే. ఈ ప్రమాదకర స్థితి నుండి దేశాన్ని కాపాడటం అన్నది యువతను చెడుల్లోకి జారిపోకుండా రక్షించుకోవటంలోనే ఉంది.
ఈ ప్రమాదం నుండి యువతను కాపాడాలంటే ఈ అశ్లీల్ల ధోరణులను అరికట్టాలి. ఆ బాధ్యతను ప్రభూత్వాలు కాదు, ముందు సోషల్ మీడియాలో సెక్సీ డ్యాన్సులు కడుతూ “లస్ట్ రీల్స్” తయారు చేస్తున్న ఆడవాళ్ల కుటుంబాలలో అన్నదమ్ములో, తండ్రులో, భర్తలో ముందుగా బాధ్యత తీసుకోవాలి.
కేవలం జనాల్లో ఫేమస్ అవ్వాలన్న ఉబలాటంతో లైకుల కోసం, డబ్బుల కోసం ఒళ్ళు మరచి ఎక్స్ పోజింగ్ చేస్తున్న ఆధునిక స్త్రీలు రేపన్నరోజున వారి స్వంత పిల్లలు సైతం అలాంటి లస్ట్ రీల్స్ కు అలవాటుపడి సమాజంలో స్త్రీలపై లైంగిక దాడులు చేసేవారిగా, రేపిస్టులుగా తయారైతే ఎలా ఉంటుందో ఆలోచించాలి.
ముఖ్యంగా తలిదండ్రులు ఎదుగుతున్న పిల్లలను సెల్ ఫోనులకు దూరంగా ఉంచాలి. ముఖ్యంగా సోషల్ మీడియా నుండి, వాటిలో “రీల్స్” చూడటం నుండి వారిని దూరంగా ఉంచటమే కాక, సెల్ ఫోన్లు వాడుతున్న తమ పిల్లలు ఒంటరిగా ఉన్నప్పుడు ఏం చూస్తున్నారో ఓ కంట కనిపెడుతూ ఉండాలి.
వారిని బాల్యం నుండే భౌతిక విద్యతో పాటు, ధార్మిక గ్రంథాల ద్వారా నైతిక విద్యను కూడా అందించాలి. పరాయి స్త్రీల పట్ల గౌరవంగా, ఉత్తమంగా నడుచుకునే వ్యక్తులుగా తీర్చిదిద్ధాలి. ధర్మానికి, ఆధ్యాత్మికానికి దగ్గర చెయ్యాలి. అప్పుడే వారిలో ఉన్నత వ్యక్తిత్వపు విలువలు పెరుగుతాయి.
దేవుడూ ధర్మం వేస్టు, మనిషి ఒకప్పుడు కోతి నుండే పరిణామం చెందాడు కాబట్టి తన కోరికలకు తగ్గట్టు మంచి-చెడులన్న వాటితో సంబంధం లేకుండా నచ్చినట్టు కోతిలానే స్వేచ్ఛగా ఎలా పడితే అలా బ్రతకాలని చెప్పే కొందరి పనికిమాలిన ఫిలాసఫీల నుండి పిల్లల్ని దూరంగా ఉంచాలి. లేదంటే వారిలో విశృంఖలత్వం పెరుగుతుంది.
అలాకాక బ్యాంకుల్లో డబ్బుంది కదా, జేబులో ఫోనుంది కదా అని ఇంట్లో ఆడపిల్లలతో ఫేస్బుక్ రీళ్లలో వయసు మరచిపోయి డ్యాన్సులు చేస్తూ, వారలాంటి పనికిమాలిన డ్యాన్సులు కడుతున్నా చూస్తూ ఉరుకుంటే.. ఎదుగుతున్న యువకులు ‘స్త్రీ’ అంటే కేవలం ఓ ‘సెక్స్ టాయ్’ మాత్రమే అని భావించి వారిపై లైంగిక దాడుల్ని, అత్యాచారాల్ని అలవోకగా చేస్తూ విచ్చలవిడితనం, వ్యభిచారం సర్వసామాన్యంగా సాగే “యానిమల్స్”తో కూడిన ప్రమాదకర సమాజాన్ని సృష్టిస్తారు.
ప్రతీ నాలుగ్గంటలకో రేప్ జరుగుతున్న ఈ దేశం ప్రతీ నాలుగు నిముషాలకో రేప్ కేస్ నమోదయ్యే దుస్థితికి చేరిపోతుంది.
