క్వారంటైన్ ప్రక్రియ పితామహుడు – “ఇబ్నె సీనా”

ఒకరి నుండి మరొకరికి అత్యంత వేగంగా వ్యాప్తి చెందుతూ మహమ్మారిగా మారే వైరస్ వ్యాప్తి “గొలుసు (Chain)” ను తెగ్గొట్టి, దాని వ్యాప్తిని నిరోధించటానికి ఈనాడు ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాలు ఏ “క్వారంటైన్ (Quarantine)” ప్రక్రియనైతే అవలంబిస్తున్నాయో దానికి పితామహుడు “ఇబ్నె-సీనా” అనే ఒక ముస్లిం సైంటిస్ట్, ఇస్లామిక్ ఫిలాసఫర్ మరియు డాక్టర్ అన్న విషయం ఎంత మందికి తెలుసు?

“ఇబ్నె సీనా” – ఆధునిక వైద్య పితామహుడు (Father of Medicine)

ఆధునిక వైద్య పితామహుడు (Father of Medicine) గా గుర్తింపు పొందిన “ఇబ్నె సీనా” ఇరాన్ లో 980 లో పుట్టారు. లాటిన్ మరియు పాశ్చాత్యదేశాలలో “అవెసినా”గా పిలువబడే బహుముఖ ప్రజ్ఞాశాలి అయిన ఈ ముస్లిం సైంటిస్ట్ 980 – 1037 CE మధ్య కాలంలోనే కంటికి కనిపించని “సూక్ష్మ జీవులు (Microorganisms)” పై చేసిన ఎన్నో పరిశోధనలు, “సూక్ష్మ జీవుల” ద్వారా వ్యాప్తి చెందే కొన్ని అంటువ్యాధులు (ట్యూబర్ కొలసిస్ మరియు కొన్ని శ్వాససంబంధ వ్యాధులు వగైరా) వాటికి గల కారణాలు, అవి ఏ విధంగా సమాజంలో అంటువ్యాధులు (Communal transmission) గా మారతాయి, ఈ సూక్ష్మ జీవుల నియంత్రించటం కొరకు ఇబ్నె -సీనా ప్రతిపాదించిన వైధ్య విధానాలు, సూత్రాలే నేటి ఆధునిక వైధ్య శాస్త్రానికి దిక్సూచిగా మారాయి. ఆయన రాసిన ‘అల్‌-కానూన్‌ ఫిత్తిబ్‌” గ్రంథం “The Canon of Medicine” పేరుతో ఆధునిక వైధ్యశాస్త్రానికి ఎన్సైక్లోపీడియాగా గుర్తించబడింది మరియు ప్రపంచంలో అనేక దేశాలతో పాటు యూరప్ దేశాల యూనివర్శిటీలలో ప్రామాణిక మెడికల్ పాఠ్య పుస్తకంగా కొనసాగుతూ వచ్చింది. “ఇబ్నె సీనా” గుండె సంబంధ వ్యాధులకు, మూత్రపిండాల వ్యాధులకు సంబంధించిన చికిత్స విషయంలో రాసిన ఎన్నో ఇతర విలువైన పరిశోధనా గ్రంథాలు ఉన్నాయి.

ముఖ్యంగా అంటువ్యాధులు (Microbial diseases) మనిషి స్రవాల ద్వారా కంటికి కనిపించని సూక్ష్మ జీవులు (Microorganisms) అంటే బాక్టీరియా లేదా వైరస్ ద్వారా ఒకరి నుండి మరొకరికి వేగంగా వ్యాప్తి చెందుతాయన్న విషయాన్ని కనిపెట్టి, వాటి ద్వారా వేగంగా వ్యాపించే అంటువ్యాధుల వ్యాప్తి గొలుసు “(Chain)” తెగ్గొట్టటానికి “ప్రజలు కనీసం 40 రోజులు నిర్బంధం (Quarantine) చెయ్యబడాలన్న విధానాన్ని మొట్టమొదటిగా ప్రతిపాదించటం జరిగింది. ఈ విధానానికి “Al-Arba’iniya (“the forty”) అని పేరుపెట్టటం జరిగింది.

నేటి ఆధునిక ప్రపంచంలో కరోనా లాంటి మహమ్మారి వ్యాప్తి గొలుసు “(Chain)” తెగ్గొట్టటానికి ప్రపంచ వ్యాప్త సైంటిస్టులంతా- ప్రజలను కనీసం నలబై రోజుల “క్వారంటైన్ (Quarantine)” చెయ్యనిదే సాధ్యం కాదని గగ్గోలు పెడుతున్నారు.

ఇబ్నె సీనా రచించిన “కితాబుష్షిఫా (The Book of Healing)” తో పాటు భౌతిక శాస్త్రం, రసాయనశాస్త్రం, ఖగోళశాస్త్రాలపై అనేక పరిశోధనా రచనలు ఉనాయి. అన్నిటికంటే ముఖ్యంగా ఆధునిక వైధ్య శాస్త్రంలో అందించిన సేవలకు గానూ “UNESCO” 2003 లో “ఇబ్నె-సీనా” పేరు మీద “UNESCO Avicenna Prize for Ethics in Science” అన్న గౌరవ పురస్కారాన్ని స్థాపించి, ప్రతీ రెండు సంవత్సరాలకోసారి సైన్స్ లో అత్యుత్తమ విజయాలు సాధించినవారికి ఈ గౌరవ పురస్కారాన్ని ఈనాటికీ అందిస్తూనే వస్తుంది. దానికి సంబంధించిన LINK:

https://en.unesco.org/prizes/avicenna

చివరిగా…

గత సంవత్సరం కరోనా వైరస్ ను వ్యాప్తి చెయ్యటంలో ముస్లిములను కుట్రదారులుగా మీడియా చిత్రీకరించింది.
చివరకు అలా చెయ్యమని ఇస్లాం చెబుతున్నట్టుగా చిత్రీకరించేవరకు వెళ్ళిపోయారు ఇస్లాం విమర్శకులు! కానీ వాస్తవం ఏమిటంటే ఈనాడు వైరస్ వ్యాప్తిని తెగ్గొట్టటానికి ఏ “క్వారంటైన్” విధానమైతే ప్రపంచం అవలంబిస్తుందో దానికి పితామహుడే ఓ ముస్లిం…

ఈ ఆధునిక వైధ్యశాస్త్ర పితామహుడి కంటే ముందే అంటువ్యాధులు ప్రబలినప్పుడు “క్వారంటైన్ (Quarantine)” నిర్దేశించిన వ్యక్తి ఎవరో కాదు ప్రవక్త ముహమ్మద్ (స)….

“ఏదైనా ప్రదేశంలో అంటు వ్యాధి ప్రబలినట్టు వింటే మీరు అక్కడకు వెళ్ళకండి; ఒకవేళ మీరున్న ప్రాంతంలో అంటు వ్యాధి ప్రబలినట్టైతే మీరు ఉండే ప్రదేశాన్ని వదిలి పెట్టి వెళ్ళకండి” – [Bukhaari 3473]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *