వైరస్ వ్యాపించినప్పుడు ప్రవక్త ముహమ్మద్(స) చెప్పిందేమిటి?

1). క్వారంటైన్ (QUARANTINE) ప్రవక్త ముహమ్మద్(స) ఆదేశం:

“మీరు ‘సింహాన్ని చూసి దూరంగా జరిగిపోయినట్టు అంటువ్యాధి ఉన్న వ్యక్తి నుండి దూరమైపోండి” – [Sahih Bukhari 5707]

***

2) సామాజిక దూరం (SOCIAL DISTANCING) ప్రవక్త ముహమ్మద్(స) ఆదేశం:

“ఎవరైతే అంటువ్యాధి కలిగి ఉన్నారో వారి నుండి ఆరోగ్య వంతులైన వ్యక్తులు దూరం పాటించాలి” – [Sahih Bukhaari 5774]

***

3) ప్రయాణాలు చెయ్యకూడదు (TRAVEL BAN) ప్రవక్త ముహమ్మద్(స) ఆదేశం:

“ఏదైనా ప్రదేశంలో అంటు వ్యాధి ప్రబలినట్టు వింటే మీరు అక్కడకు వెళ్ళకండి; ఒకవేళ మీరున్న ప్రాంతంలో అంటు వ్యాధి ప్రబలినట్టైతే మీ ఉండే ప్రదేశాన్ని వదిలి పెట్టి వెళ్ళకండి” – [Bukhaari 3473]

***

4) ఇతరులకు హాని కలిగించకూడదు” (DON’T HARM OTHERS) ప్రవక్త ముహమ్మద్(స) ఆదేశం:

“ఎవరైతే ఇతరులకు హాని తలపెడతారో, అల్లాహ్ అతనికి హాని తలపెడతాడు” -[Abu Dawood 3635]

***

5) ఇంటిలో ఉండటం (STAYING HOME) ప్రవక్త ముహమ్మద్(స) ఆదేశం:

“ఎవరైతే తమనుతాము రక్షించుకోవటానికి ఇళ్లలో ఉంటారో, వారు దేవుని రక్షణలో ఉంటారు” – [Musnad Ahmed, Saheeh]

***

6)  అవసరమైతే ఇల్లుకుడా మస్జిదే:

“సమస్త భూమి మసీదుగా చెయ్యబడింది; కేవలం కాలకృత్యాలు తీర్చుకునే ప్రదేశాలు, శ్మశానాలు తప్ప” – [Tirmidhi 317]

***

7) ముఖాన్ని వస్త్రంతో అడ్డుపెట్టుకోవటం (FACE MASKING) ప్రవక్త ముహమ్మద్(స) ఆదేశం:

“ప్రవక్త ముహమ్మద్(స) తుమ్మినప్పుడు తన ముఖాన్ని వస్త్రంతో కప్పుకునేవారు లేదా మోచేతిని అడ్డుపెట్టుకునే వారు” – [Abu Dawood 5029]

***

8) చేతులు శుభ్రపరచుకోవటం (WASH HANDS) ప్రవక్త ముహమ్మద్(స) ఆదేశం:

“నిత్యం శుభ్రత పాటిస్తూ ఉండటం విశ్వాసంలో సగభాగం” – [Sahih Muslim 223]

***

9) ఇంటి నిర్బంధం (HOME QUARANTINE) ప్రవక్త ముహమ్మద్(స) ఆదేశం:

“దేవుని ఆదేశం లేనిదే తనకు ఏ హానీ జరగదని విశ్వసిస్తూ అంటువ్యాధి కలిగిన వ్యక్తి సహనంతో ఇంటిలోనే ఉంటాడో అలాంటి వ్యక్తి దేవుని తరఫున గొప్ప ప్రతిఫలం పొందుతాడు లేదా అమరగతి పొందుతాడు” – [Sahih Bukhari 3474]

10)  ప్రతీవ్యాధికీ చికిత్స ఉంది

దేవుడు చికిత్సను సృష్టించని ఎటువంటి వ్యాధీ లేదు – [Al-Bukhari, Book 1, Hadith 33]

ఈ విధంగా వైరస్ వ్యాపించినప్పుడు వ్యక్తిగత భద్రత ఎలా తీసుకోవాలో, సామాజిక భద్రత ఎలా తీసుకోవాలో ఈనాడు డాక్టర్స్ చెబుతున్నదానిని 1400 సం.ల క్రితమే ప్రవక్త ముహమ్మద్(స) ఆదేశించటం జరిగిందన్నది గమనార్హం

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *