శరీరంలో ఏ భాగంలో నైనా కణాలు (Cells) అసాధారణ రీతిలో నియంత్రణ కోల్పోయి విభజనకు గురయ్యే వ్యాధినే కేన్సర్ అంటారు. కానీ ఉపవాస స్థితిలో ఉంటే గనుక కేన్సర్ కణాలు సాధారణ కణాల కంటే భిన్నమైన రీతిలో ప్రవర్తిస్తాయని, కేన్సర్ పేషంటుకు అందించే కీమోథెరపీ చికిత్స ఉపవాస స్థితిలో ఉండగా చేసినప్పుడు కేన్సర్ ప్రభావంతంగా’ నయం అవుతుందన్న విషయం ఆధునిక పరిశోధనల్లో తేలిందన్నది చాలా తక్కువ మందికి తెలుసు
కేన్సర్ ట్రీట్మెంట్ లో అందించే కీమోథెరపీ ను మరింత ప్రభావంతంగా పని చేయించే లక్ష్యంతో దశాబ్దాల కాలంగా కేన్సర్ సైంటిస్టులు అనేక పరిశోధనలు జరుపుతూ వస్తున్నారు. కానీ, కేన్సర్ ట్రీట్మెంట్ లో అందించే కీమోథెరపీ ‘ఉపవాస’ స్థితిలో మరింత మెరుగ్గా ప్రభావంతంగా పని చేస్తుందన్న విషయాన్ని శాస్త్రవేత్తలు అనేక పరిశోధనల అనంతరం తేల్చి చెప్పారు
కేవలం అన్నపానీయాలు మానెయ్యటాన్నే ‘ఉపవాసం’ అంటారన్నది చాలా మందికి తెలిసిన విషయం. కానీ ఆ ఉపవాస స్థితిలో ఉండగా…
• రక్తంలో గ్లూకోజ్ ఉత్పత్తి నియంత్రించబడుతుందని…
• రోగనిరోధక వ్యవస్థను పునరుత్పత్తి చేయడానికి మూల కణాలు
(stem cells) ప్రేరేపించబడతాయని…
• సమతుల్య పోషకాలు శరీరానికి అందించబడతాయని…
• కణితి (Tumor) ను చంపే కణాల ఉత్పత్తి పెరుగుతుందని…
వగైరా ఎన్నో అంతర్గత ప్రయోజనాలున్నాయన్న విషయం మటుకు చాలా తక్కువ మందికి తెలుసు. ఈ ప్రయోజనాలే ముఖ్యంగా కేన్సర్ ను సైతం నియంత్రించటంలో ప్రధాన భూమిక వహించటం జరుగుతుంది.
కనీసం 2-4 రోజుల ఉపవాసం ఉండటం వలన కేన్సర్ చికిత్స లో అందించే ‘కిమోథెరపీ’ కారణంగా రోగనిరోధక వ్యవస్థను పునరుత్పత్తి చేయడానికి అవసరమయ్యే మూల కణాలు (stem cells) పాడవకుండా రక్షించబడతాయని…
అంతేకాక, ఉపవాసం రోగనిరోధక వ్యవస్థను బలోపేతం చెయ్యటం ద్వారా కేన్సర్ కణాలు నిరోధించబడతాయని…
ఉపవాసం ఇన్సులిన్ ఉత్పత్తి నియంత్రించి టైప్-2 డయాబెటిస్, ఊబకాయం ద్వారా ఏర్పడే ప్రతికూల ప్రభావాల నుండి సైతం రక్షణ కల్పించి కేన్సర్ నుండి పోరాడుతుందని శాస్త్రవేత్తలు తేల్చి చెప్పారు
‘సైన్స్ ట్రాన్స్లేషనల్ మెడిసిన్ జర్నల్’లో ప్రచురించబడిన తాజా పరిశోధనలో కేన్సర్ ట్యూమర్ కణాలు సాధారణ కణాలతో పోల్చితే ‘ఉపవాసం’ ఒత్తిడికి భిన్నంగా స్పందిస్తున్నాయని పేర్కొనటం జరిగింది.
కీమోథెరపీ చేసినప్పుడు ఉపవాసాలు ఉండటం కారణంగా క్యాన్సర్ చికిత్సను మరింత ప్రభావవంతంగా పనిచేసినట్లు పరిశోధనలో తేలింది.
అలాగే కీమోథెరపీ లేకుండా కేవలం ఉపవాసాలు ఉన్నప్పుడు రొమ్ము కేన్సర్, స్కిన్ కేన్సర్, బ్రెయిన్ కేన్సర్ మరియు నాడీ కణజాలాలలో ఏర్పడే కేన్సర్ల పెరుగుదల తగ్గినట్లు తేలింది.
ఈ విధంగా ఎన్నో ప్రయోజనాలున్న ఉపవాసం గురించి పెద్దలు ‘లంకణము పరమౌషధం’ అని చెబుతుంటారు. ఈ విషయాన్ని ఖురాన్ ఏనాడో ఈ క్రింది విధంగా ప్రకటించింది.
“మీరు తెలుసుకోగలిగితే ఉపవాసం ఉండటమే మీకు ఎంతో ఉత్తమమైనది” – 2:184
Links:
http://www.teluguone.com/…/fasting-during-cancer…
https://www.medicalnewstoday.com/articles/324169…
