ఆ అమీర్ ఖాన్ పారిపోయాడా..?

బాలాసోర్ ట్రైన్ యాక్సిడెంట్ జరిగినప్పటి నుండి ఏదోలా ఆ సంఘటనకు హిందూ vs ముస్లిం కమ్యూనల్ కలర్ పులిమెయ్యాలానే తుత్తర హిందుత్వ అతివాద మతోన్మాదులకు ఏ రేంజుకు ఉందంటే…

మొన్నటి వరకు బహనాగ రైల్వే స్టేషన్ మాస్టర్ “షరీఫ్”అని, ఆ ట్రైన్ యాక్సిడెంట్ జరిగినప్పటి నుండి అతను పరారీలో ఉన్నాడని, దాని వెనుక ఏదో కుట్ర కోణం ఉందన్న “ఫేక్” వార్తలతో సోషల్ మీడియా దద్దరిల్లిపోయింది.

తీరా ఆ స్టేషన్ మాస్టర్ ముస్లిం కాదని, అతని పేరు షరీఫ్ కాదు ‘మహంతి’ అని ఫ్యాక్ట్ చెక్ టీమ్ బయటపెట్టాక వాట్స్ యాప్ యూనివర్సిటీ బ్యాచ్ మొత్తం సైలెంట్ అయిపోయింది.

ఆ తరువాత ఆ రైల్వే పట్టాలకు కొద్ది దూరంలో మసీదు ఉండటాన్ని బట్టి ఆ సంఘటన వెనుక ఏదో ముస్లిముల కుట్ర ఉండే ఉంటుందని మెదళ్లలో ఉన్న ఆవు పేడను ఉపయోగించి మరీ… కొంతమంది వాట్స్ యాప్ ప్రొఫెసర్లు గమ్మత్తైన థియరీలు రాసుకొచ్చారు.

తీరా అది ‘మసీదు’ కాదు ‘ఇస్కాన్ టెంపుల్’ అని తేలటంతో మళ్లా ఈసారి కూడా మంచి ఛాన్స్ మిస్సైందన్న బాధతో మొత్తం వాట్స్ యాప్ యూనివర్సిటీ బ్యాచ్ ఏం చెయ్యాలో తెలీక బుర్ర గోక్కుంటూ మళ్లా సైలెంట్ అయిపోవటం జరిగింది.

కనీసం ఆ బహనాగ రైల్వే స్టేషన్లో ఆ ట్రైన్ యాక్సిడెంట్ జరిగిన రోజు అక్కడ ప్లాట్ ఫామ్ స్వీపరో, అధమం అక్కడ పట్టాల పక్కన చెత్త ఏరుకునేవాడో ఎవడో ఒక్కడికైనా ముస్లిం పేరు ఉన్నట్టు కనపడితే చాలు.. ఆ సంఘటనకు కమ్యూనల్ కలర్ పులిమేసి ఏదోలా రచ్చ చేసి పరేయొచ్చని వెయ్యి కళ్లతో తీవ్రమైన ఎదురు చూపులు చూస్తున్న నేపథ్యంలో… ఆ రోజు డ్యూటీలో ఉన్న జూనియర్ సిగ్నల్ ఇంజినీర్ ‘అమీర్ ఖాన్’ అన్న శుభవార్త వినపడింది.

ఇక చాలు ఐ.టి సెల్ ఏ మాత్రం ఆలస్యం చెయ్యకుండా రంగంలోకి దిగిపోయింది.

ఇంక అంతే, ఆ యాక్సిడెంట్ జరిగాక అమీర్ ఖాన్ పరారీలో ఉన్నాడని, అతని ఇంటికి సిబిఐ సీలు వేసిందని సోషల్ మీడియాలో పోస్టుల వెల్లువ మొదలైపోయింది.

చివరకు సౌత్ ఈస్ట్రన్ రైల్వే పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్ ‘ఆదిత్య కుమార్ చౌదరీ’ సోషల్ మీడియాలో వస్తున్న వార్తలు “ఫేక్” అని, ఆ అమీర్ ఖాన్ ఎక్కడికీ పారిపోలేదని, సీబీఐ విచారణలో భాగంగా ఆ రోజు అక్కడ డ్యూటీలో ఉన్న వారితో పాటు అతన్ని కూడా విచారించటం జరుగుతుందని వీడియో రూపంలో స్టేట్ మెంట్ రిలీజ్ చెయ్యటం జరిగింది.

అయితే వాట్స్ యాప్ బ్యాచ్ లో ఎక్కువగా ఐటి సెల్ నుండి వచ్చిన ఫేక్ వార్తల్ని వెంటనే ఫార్వర్డ్ చేసెయ్యటమే తప్ప, నిజనిజాలు పరిశీలించేంత విషయ పరిజ్ఞానం, పెద్దగా చదువు సంధ్యలు లేకపోవటంతో ఈ న్యూస్ సోషల్ మీడియాలో విపరీతంగా చక్కర్లు కొడుతుంది.

కాబట్టే కనీసం ఎంతో కొంత ఆలోచన, విషయ పరిజ్ఞానం, సామాజిక స్పృహ కలిగినవారు, విద్యావంతులు తమ తమ వాట్స్ యాపుల్లో, సోషల్ మీడియాలో వచ్చే ఇలాంటి వార్తల్ని వెంటనే నమ్మేయకుండా ఫ్యాక్ట్ చెక్ చేసుకుని, వాస్తవాలను సమాజానికి తెలియజేసే ప్రయత్నం చెయ్యాలి.

లేదంటే దేశంలో ఈ మతోన్మాద అనాగరికుల మంద పెరిగిపోతుంది.

Md Nooruddin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *