ఎక్కడో ఉన్న కేరళలో జరిగే సంఘటనలపై మాత్రమే కాదు కాస్త గుజరాత్ లో జరిగే రియల్ స్టోరీలపై కూడా సుదీప్తో సేన్ లాంటి డైనమిక్ డైరక్టర్లు దృష్టి సారించాలి. ఈ మధ్యే గుజరాత్ పోలీస్ శాఖ అతి జుగుప్సాకరమైన హ్యూమన్ ట్రాఫికింగ్ రాకెట్ ను ఛేదించారు.
గత ఏమిదేళ్లలో గుజరాత్ లోని అహ్మదాబాద్ ఇతర ప్రాంతాల నుండి 15 మంది మైనర్ అమ్మాయిలు పెళ్లి కూతుళ్ల రూపంలో ఒకొక్కరూ రెండున్నర లక్షల రూపాయలకు బలవంతంగా అమ్మబడ్డారు. వీరిలో 13 ఏళ్ల అమ్మాయి అయితే 15 మందికి అమ్మబడి అతి దారుణంగా సామూహిక అత్యాచారానికి, అనేక హింసలకు గురికావటం జరిగింది.
ఈ రాకెట్ వెనుక అశోక్ పటేల్, అతని భార్య రేణుక ఉన్నట్లు పోలీసుల పరిశోధనలో తేలింది. వారిని వారి గ్యాంగ్ ను గుజరాత్ పోలీసులు చాకచక్యంగా పట్టుకున్నారు. ఈ హ్యూమన్ ట్రాఫికింగ్ ర్యాకెట్ ఒక్క గుజరాత్ లోనే కాక, రాజస్థాన్, మహారాష్ట్రలో వీరి ద్వారా జరిగినట్లు తేలింది. ఐసిస్ కు మతం మార్చి అమ్మాయిలను తరలించటం నేరమైతే.. ఇలా మైనర్ అమ్మాయిలను వ్యభిచార కూపాలకు అమ్మేయటం కూడా పెద్ద నేరం కాదంటారా?
దీనిపై “ది కేరళ స్టోరీ” సినిమా తీసిన సుదీప్తో సేన్ లాంటి డైనమిక్ డైరెక్టర్ ఎవరైనా ఇవే కాక గుజరాత్ లో మరో 32 వేల సంఘటనలు జరిగి ఉండొచ్చని అతనిలానే గాల్లో కోడి లెక్కలు కట్టి “ది గుజరాత్ స్టోరీ” అన్న టైటిల్ తో ఓ సినిమా తీస్తే.. సుప్రీం కోర్టు పర్లేదు మీరు మీ సినిమా “డిస్క్లైమర్ లో ఈ సినిమాలో చూపిన పాత్రలు, సన్నివేశాలు కల్పితాలు మాత్రమే” అని రాసుకుని రిలీజ్ చేసేసుకోవచ్చని పర్మిషన్ ఇస్తుందంటారా?
గత ఐదేళ్లలో గుజరాత్ నుండి 40 వేల మంది మహిళలు అదృశ్యమయ్యారని National Crime Records Bureau (NCRB) స్వయంగా వెల్లడించిన సంగతి తెలిసిందే.
