“యునైటెడ్ స్టేట్స్ డిపార్ట్‌మెంట్ ఆఫ్ స్టేట్ టెర్రరిజం” 2020 నివేదికల ప్రకారం నవంబర్, 2020 నాటికి ISISతో 66 మంది భారతీయులు మాత్రమే జతకట్టినట్టు ఆధారాలున్నాయి.
“2018 స్టార్ట్ న్యూస్ గ్లోబల్ రిపోర్ట్” సైతం ISIS తో జతకట్టిన భారతీయులు సంఖ్య 60 మంది అని తెలపటం జరిగింది.
ఈ 60 మంది భారతీయుల్లో ఎంతమంది స్త్రీలు ఉన్నారు?
కేవలం 13 మంది స్త్రీలు ఉన్నారు.
ఎంతమంది స్త్రీలు కేరళ నుండి ఉన్నారు?
కేవలం 6 గురు స్త్రీలు మాత్రమే ఉన్నారు.
ఈ 6 గురు స్త్రీలలో ఎంత మంది ఇస్లాంలోకి కన్వర్ట్ అయినవారున్నారు?
కేవలం ముగ్గురు స్త్రీలు మాత్రమే ఉన్నారు.
ఆ ముగ్గురు స్త్రీలలో ఎంత మంది హిందూ స్త్రీలున్నారు?
కేవలం ఒక్కామే మాత్రమే హిందూ, మిగతా ఇద్దరూ క్రైస్తవులు.
దీనిని బట్టి “ది కేరళ స్టోరీ” సినిమాలో చూపినట్టు ఇది 32000 మంది స్త్రీల కథ కాదు.. లేదా కొందరు హిందుత్వ అతివాదులు చెబుతున్నట్టు ఇది “32000 హిందూ అమ్మాయిల కన్నీటి గాధ” అంతకంటే కాదు.
…….
మొదట్లోనే “3 స్త్రీల కథ” అని తీయవచ్చు కదా?
ఎప్పుడైతే ఈ సినిమాలో చెప్పినట్టు 32000 స్త్రీలు కేరళ నుండి మాయమయ్యారన్నది కోర్టులో అబద్ధమని తేలిందో ఈ సినిమా ట్రైలర్ డిస్క్రిప్షన్ నుండి 32000 తొలగించి 3 స్త్రీల కథ అని మార్చేయటం జరిగింది.
ఒకవేళ 32000 స్త్రీల స్థానంలో కేవలం “ముగ్గురు స్త్రీల కథ” అని గనుక ఈ సినిమా మొదట్లోనే తీసి ఉంటే మొత్తం సినిమా కాన్సెప్టే ఫేయిల్ అయిపోయేది. ఈ సినిమా ద్వారా చెప్పాలనుకున్నది- లవ్ జిహాద్ కుట్ర ద్వారా వేలకొద్దీ అమ్మాయిలు బలవంతంగా ఇస్లాంలోకి కన్వర్ట్ చేయబడి ఐ.ఎస్.ఐ.ఎస్ కు తరలించబడుతున్నారన్న అబద్ధాన్ని సర్వసామాన్యం చెయ్యటం.
ఒకవేళ 3 స్త్రీల కథ అని మొదట్లోనే ఈ సినిమా తీసి ఉంటే అది ముగ్గురు స్త్రీల వ్యక్తిగత కథ అయ్యేది తప్ప ఇందులో కుట్ర కోణం అనేది కనపడేది కాదు. ఈ రకంగా ఒక అబద్ధాన్ని అతిశయించి చెప్పటం, దాన్ని ప్రజల్లో సర్వసామాన్యం చెయ్యటం అన్నది అతి పెద్ద మూర్ఖత్వం.
ఇది ఎలాంటిదంటే ఉదాహరణకు గడచిన కొన్ని నెలల్లో, “విమాన ప్రయాణాల్లో తోటి ప్రయాణికుల మీద మూత్రవిసర్జన చేసిన భారతీయ వ్యక్తులకు సంబంధించి మూడు సంఘటనలు జరిగాయి. ఇప్పుడు దీని ఆధారంగా, 32000 మంది భారతీయులు విమానాల్లో తోటి ప్రయాణీకుల మీద మూత్రవిసర్జన చేశారని, భారతీయులందరూ ఇంతే అన్న ఇంప్రెషన్ కలిగేలా అమెరికానో, జపానో “ఇండియా స్టోరీ” పేరుమీద సినిమా తీస్తే?
“32వేలో, ముగ్గురో.. మొత్తానికి చేయనైతే చేశారు కదా.. కాబట్టి సినిమా తీయటం న్యాయమే దాన్లో అభ్యంతరపెట్టాల్సింది ఏముంది..”, అని వాదిస్తే..?
ఇది విని మీ రెస్పాన్స్ ఏమిటి?
అదే “కేరళ స్టోరీ” సినిమా. బుద్ధి, ఇంగిత జ్ఞానం ఉండి, కడుపు అన్నం తింటున్నోల్లెవరూ ఇలాంటి సినిమాల్ని వెనకేసుకురారు, చూడరు.
