“ది గుజరాత్ రియల్ స్టోరీ” /-

ది కేరళ స్టోరీలో 32 వేల హిందూ అమ్మాయిలు సిరియాకు తరలించబడ్డారన్న వార్త ఎంత అబద్ధమో గుజరాత్ నుండి 40 వేల అమ్మాయిలు సాని కొంపలకు తరలించబడ్డారన్న వార్త అంతే నిజమని National Crime Records Bureau (NCRB) చెబుతుంది

గుజరాత్‌లో 40 వేల మంది మహిళల మిస్సింగ్, NCRB లెక్కల సంచలనం.

ఐదేళ్లలో గుజరాత్‌లో 40 వేల మంది మహిళలు అదృశ్యమయ్యారు. National Crime Records Bureau (NCRB) స్వయంగా ఈ లెక్కలు వెల్లడించింది. 2016 నుంచి సంవత్సరం వారీగా ఎంత మంది మహిళలు మిస్ అయ్యారో గణాంకాలు విడుదల చేసింది. 2016లో 7,015, 2017లో 7,712, 2018లో 9,246, 2019లో 9,268 మంది మహిళలు కనిపించకుండా పోయారు.

ఆ తరవాత కూడా మిస్సింగ్ కేసులు పెరుగుతూనే వచ్చాయి. 2020లో 8,290 మంది అదృశ్యమయ్యారు. ఇలా మొత్తంగా కలుపుకుంటే 41,621 మంది మహిళలు మిస్ అయ్యారు. 2021లో అసెంబ్లీలో ప్రభుత్వమే అధికారికంగా లెక్కలు వెల్లడించింది. 2019-20 మధ్య కాలంలో 4,722 మంది మహిళలు అహ్మదాబాద్, వడోదర ప్రాంతాల్లో అదృశ్యమైనట్టు తెలిపింది. మాజీ ఐపీఎస్ అధికారి, గుజరాత్ రాష్ట్ర మానవ హక్కుల సంఘం సభ్యుడు సుధీర్ సిన్హా దీనిపై కీలక వ్యాఖ్యలు చేశారు. “కొన్ని మిస్సింగ్ కేసులలో బాలికలు, మహిళలను బలవంతంగా గుజరాత్ నుంచి వేరే రాష్ట్రాలకు తరలిస్తున్నారు. వ్యభిచార వృత్తిలోకి దింపుతున్నారు” అని స్పష్టం చేశారు.

పోలీస్ సిస్టమ్‌లో ఉన్న సమస్యేమిటంటే…మిస్సింగ్ కేసులను పెద్దగా పట్టించుకోరు. కానీ…ఇవి మర్డర్‌ల కన్నా సీరియస్‌గా తీసుకోవాల్సిన కేసులు. ఓ చిన్నారి కనిపించకుండాపోయిందంటే…తల్లిదండ్రులు ఏళ్ల పాటు వేచి చూడాల్సి వస్తోంది. మర్డర్‌ కేసులను ఎలా అయితే ఇన్వెస్టిగేట్ చేస్తారో..అలాగే మిస్సింగ్ కేసులనూ విచారించాలి. ఇలాంటి కేసుల్లో విచారణ ఇంకా బ్రిటీష్ కాలం నాటి పద్ధతుల్లోనే కొనసాగుతున్నాయి”

– సుధీర్ సిన్హా, మాజీ ఐపీఎస్ అధికారి

హ్యూమన్ ట్రాఫికింగ్ ముఠాలు అమ్మాయిలను ట్రాప్ చేసి వేరే రాష్ట్రాలకు, దేశాలకు విక్రయిస్తున్నారు. కొన్ని చోట్ల ఎలాంటి దారుణాలు జరుగుతున్నాయో ఓ మాజీ పోలీస్ అధికారి వివరించారు.

“నేను ఎస్‌పీగా పని చేసినప్పుడు యూపీలో ఓ కార్మికుడు ఓ పేద కుటుంబానికి చెందిన అమ్మాయికి మాయమాటలు చెప్పి తీసుకొచ్చాడు. ఓ ముఠాకు ఆ అమ్మాయిని అమ్మేశాడు. వ్యవసాయ కూలీగా ఆమెతో బలవంతంగా పనులు చేయించారు. ఎలాగోలా ట్రాక్ చేసి ఆ అమ్మాయిని రక్షించాం. కానీ ప్రతిసారి ఇలా కూలీ పనులే చేయిస్తారని లేదు. పడుపు వృత్తిలోకి దింపుతారు అలాంటి పరిస్థితులు ఎవరికీ రాకూడదు.” – మాజీ పోలీస్ అధికారి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *