ఉన్మాదానికి మతం ఉండదు /-

రిటైర్డ్ లెఫ్టినెంట్ కల్నల్ సోమనాథ్ పరిదా అనే వ్యక్తి జూన్ 2013 న ఆవేశంతో తన భార్య ఉషశ్రీ సమల్ ను హత్య చెయ్యటమే కాక, ఆమెను 300 ముక్కలు చేసి టిఫిన్ బాక్సుల్లో పెట్టి చివరకు పోలీసులకు దొరికిపోయాడు

డెహ్రాడూన్ లో రాజేష్ గులాటీ అనే సాఫ్ట్వేర్ ఇంజినీర్ తన భార్య అనుపమను హత్య చేసి ఆమె శరీరాన్ని 72 ముక్కలు చేసి ఫ్రీజర్ లో దాచిపెట్టాడు.

వర్జీనియాలో జూన్ 2004 న ప్రవీణ్ నందనపు అనే అచ్చ తెలుగు వాడు తన 28 ఏళ్ల భార్య దివ్యను హత్య చేసి ముక్కముక్కలుగా నరికి బ్యాగుల్లో పెట్టి డంప్ యార్డుల్లో విసిరి పారేశాడు.

మధ్యప్రదేశ్ జబల్ పూర్ లో అభిజిత్ పాటిదార్ హోటల్ గదిలో తన ప్రియురాలి గొంతు కోసి చంపి పైగా హత్య చేసి పైగా దానిని సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు.

తన ప్రియురాలిని 35 ముక్కలుగా నరికేసిన అఫ్తాబ్ పునావాల కూడా అచ్చం పై ఉన్మాదుల్లాంటివాడే!

కాకపోతే సోషల్ మీడియాలో కొందరు ఉన్మాదులు వాడిని ముస్లిం అంటూ మతాన్ని అంటగట్టి మొత్తం ముస్లిం సమాజాన్ని విమర్శించటం ఎంత తప్పో.. పై హంతకులు హిందువులు కాబట్టి వారికి హిందూ మతాన్ని అంటగట్టి హిందువులందర్నీ విమర్శించటం కూడా అంతే తప్పవుతుంది.

మంచివాళ్లందరూ ఒక మతవర్గంలో, చెడ్డవాళ్లందరూ ఒక మతవర్గంలో పుట్టరు! ప్రతీ మతవర్గంలోనూ మంచివారితో పాటు కొందరు దుర్మార్గులు కూడా ఉంటారు.

ఇక్కడ అర్థం చేసుకోవలసింది ఉన్మాదానికి మతం ఉండదు! ఏ మతమూ ఉన్మాదాన్ని నేర్పదు

Md Nooruddin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *