ఆ పాకిస్తాన్ ఉగ్రవాదుల్ని చంపిందీ ముస్లిమే!

నార్త్ కాశ్మీర్ బారాముల్లా జిల్లాలో పాకిస్తాన్ జైషే ముహమ్మద్ సంస్థ ఉగ్రవాదులతో పోరాడుతూ దేశం కోసం తన ప్రాణాల్ని సైతం లెక్క చెయ్యకుండా వారిని ఎన్కౌంటర్ చేసి చంపి ఆ దాడిలో తన ప్రాణాల్ని సైతం త్యాగం చేసిన యువ పోలీస్ అధికారి పేరు ముదస్సిర్ అహ్మద్ షేక్.

పాక్ ఉగ్రవాదులతో జరిగిన ఎన్‌కౌంటర్‌లో వీరమరణం పొందిన పోలీసు అధికారి ముదస్సిర్ షేక్ తండ్రి ఇంటర్యూలో “నా కొడుకును చూసి గర్వపడుతున్నాను. నా కొడుకు తిరిగి రాడు అని తెలుసు, కానీ వందలాది మంది ప్రాణాలను కాపాడేందుకు ఆ ఉగ్రవాదులను చంపి వెళ్లిపోయాడు. ఇలాంటి కొడుకు ప్రతీ తల్లి ఇలాంటి కొడుకును కనాలి. నా కొడుకు ఈ దేశం కోసం ప్రాణాలు అర్పించినందుకు గర్వపడుతున్నాను” అంటూ ఎంతో గర్వంతో చెప్పటం దేశం మొత్తం అభినందించాల్సిన విషయం.

బహుశా ఆ ముస్లిం పోలీస్ అధికారి స్థానంలో ఏ ముస్లిమేతర పోలీస్ అధికారో ఉండి ఉంటే మీడియాలో బహుశా అదో పెద్దవార్తై పోయేది. కేంద్రంతో సహా అన్ని రాష్ట్ర ప్రభుత్వాల తరఫు నుండి ఈపాటికే అతని కుటుంబానికి సంతాపాలు, అభినందనలు, రివార్డులు, గజాల కొద్దీ స్థలాలు వగైరా అన్నీ ప్రకటించబడిపోయి ఉండేవి.

మరో ప్రక్క బ్రిటీషోల్ల “స్పై వర్కర్” శిష్యులంతా ఈ సంఘటనకు మత రంగు పూసేసి, ఆ పాకిస్తాన్ ఉగ్రవాదులతో మొత్తం భారతదేశ ముస్లిములతో లింకు పెట్టేసి, ఆ పోలిసు అధికారి మరణానికి దేశ ముస్లిములందర్నీ బాధులు చేసేసి ‘కాశ్మీర్ ఫైల్స్ పార్ట్ 2’ తీసే ప్లానులో పడిపోయేవారు.

“ముస్లిములంతా ఉగ్రవాదులు కారు ఉగ్రవాదులంతా ముస్లిములే” అంటూ పనికిమాలిన కొటేషన్లు రాసుకుని పదే పదే చూసుకుంటూ స్వయం తృప్తి చెందేవారికి.. ఈ దేశం కోసం ఎందరో ముస్లిములు స్వతంత్ర పోరాట కాలం నుండి తమ ప్రాణాల్ని లెక్క చెయ్యక త్యాగం చేస్తూనే ఉన్నారన్న వాస్తవం అస్సలు తెలీదు. తెలిసినా మతోన్మాదంతో మెదడు వాపుకు గురైపోయిన వారి మెదళ్లకు అస్సలు ఎక్కదు.

అందుకే ఆ ముస్లిం పేర్లు తగిలించుకున్న పాకిస్తాన్ ఉన్మాద ఉగ్రవాదులను చంపి మరీ చనిపోయింది ఈ దేశ ముస్లిం కావటం చాలా మందికి మింగుడు పడని విషయంగా మారిపోయింది. ఇస్లాంను, ఖురాన్ ను విమర్శించటాని ఓ చక్కటి చాన్సు మిస్సైనట్టైంది.

Md Nooruddin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *