ఆ హంతకుడు ముస్లిం కాదు కాబట్టి బహుశా ఉగ్రవాది అన్న ముద్ర పడలేదు!

అగ్రరాజ్యంలో టెక్సాస్ రాష్ట్రంలో ఉవాల్టే నగరంలో ఉన్న ఓ ఎలిమెంటరీ స్కూల్లోకి ఓ పద్దెనిమిదేళ్ల యువకుడు గన్ను పట్టుకుని నడుచుకుంటూ వెళ్లి అలవోకగా 19 మందిని కాల్చి చంపేశాడు.

ఈ విషయం చాలా మందికి తెలీదు. కారణం…

ఆ సంఘటనపై మీడియా ఫోకస్ చెయ్యాల్సినంతగా చెయ్యలేదు కాబట్టి..

ఆ సంఘటనను గోదీ మీడియా చానెళ్లు ఓ వారం రోజుల పాటు తిప్పి తిప్పి ప్రదర్శించలేదు కాబట్టి..

ఆ సంఘటనపై ఇస్లామోఫోబియాను పనికట్టుకుని ప్రదర్శించే ఆ సోకాల్డ్ జర్నలిస్టు ‘నేషన్ వాంట్స్ టూ నో’ అంటూ పిచ్చిగా కేకలు పెడుతూ ఎటువంటి డిబేట్లూ నిర్వహించలేదు కాబట్టి..

సోషలో మీడియాలో అవసరం లేకపోయినా హిజాబ్, ఇస్లాంలను నిత్యం విమర్శిస్తూ టైమ్ పాస్ చేసే కొందరు ఫేస్బుక్ అభ్యుదయవాదులు ఎటువంటి వ్యాసాలూ రాయలేదు కాబట్టి..

ఇవన్నీ ఎందుకు జరగలేదంటే.. ఆ కాల్చి చంపినోడు ముస్లిం కాదు కాబట్టి!

యదావిధిగానే ఆ కాల్పులు జరగ్గానే రెండో నిముషంలోనే మీడియా చానళ్లన్నీ ఆ కాల్చి చంపినోడి మతాన్ని చకచకా వెతికేశాయి. కానీ… డామిట్! ఆ వెధవ ముస్లిం కాదని తేలిపోయింది.

ఛా! లేదంటే…

ఈ పాటికే మీడియా చానళ్లన్నీ ఆ ఘటనకు ‘ఇస్లామిక్ ఉగ్రవాదం’ ‘ఇస్లామిక్ జిహాద్’ అనే పేర్లు తగిలించేసి ఉండేవి.

ఆటోమేటిగ్గా ప్రపంచవ్యాప్త ముస్లిములంతా ఆ నేరానికి బాధ్యులైపోయి ఉండేవారు.

ఫేస్బుక్ అభ్యుదయవాదులంతా ఖురాన్ భావజాలం కారణంగానే ముస్లిం సమాజంలో నేరాలు పెరిగిపోతున్నాయని సెల్ఫ్ డిక్లరేషన్లు ఇచ్చేసి పనిలో పనిగా అవసరం లేకపోయినా హిజాబ్ టాపిక్ ను కూడా మధ్యలో ఇరికించేసి పనికిమాలిన స్వంత ఫిలాసఫీలతో కూడిన వ్యాసాలను రాసిపడేసి ఉండేవారు.

ఇలా స్కూళ్లలో కాల్పులు జరగటం అన్నది కొత్తేమీ కాదు! గతంలో మిచిగాన్ స్కూల్లో, ఫ్లోరిడాలోని పార్క్ ల్యాండ్ స్కూల్లోనూ కాల్పులు జరిగాయి. చాలా మంది చనిపోయారు. ఇవేకాక ఎన్నో దారుణమైన నేరాలు చుట్టూ ఉన్న సమాజంలోనూ జరుగుతుంటాయి.

కానీ ఆయా సంఘటనల్లో నేరస్తులు ముస్లిం పేర్లు తగిలించుకున్నప్పుడు మాత్రమే మీడియా ఛానళ్లు పనికట్టుకుని ఇస్లామోఫోబియాను ప్రదర్శిస్తూ ఉండటం వలన వ్యంగ్యం వెటకారం వెకిలితనం తప్ప మరేమీ తెలీని కొందరు మేధావులు “ముస్లిములంతా ఉగ్రవాదులు కారు ఉగ్రవాదులంతా ముస్లిములేనని” కొటేషన్లు రాసుకుని పదేపదే చూసుకుంటూ మురిసిపోతూ అదోటైపు శునకానందం పొందుతుంటారు.

Md Nooruddin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *