ఒకప్రక్క శోభాయాత్ర, హనుమాన్ జయంతుల పేరిట డీజేలు పెట్టి మసీదుల ముందు డ్యాన్సులు, భీబత్సమైన మ్యూజిక్కులు కేరింతలతో కూడిన ఊరేగింపులు, మత ఘర్షణలు జరుగుతున్న నేపథ్యంలో ..
మరోప్రక్క ఆదివారం ఢిల్లీలోని జహంగీర్‌పురి ప్రాంతంలో హిందూ మరియు ముస్లిములు శాంతి మరియు సామరస్యాన్ని కాపాడటం కోసం జాతీయ జెండాలను చేతబూని కలిసికట్టుగా ‘తిరంగా యాత్ర’ నిర్వహించి దేశం మొత్తానికి ఆదర్శంగా నిలిచారు.
ఈ మధ్య ఢిల్లీ జహంగిర్ పురిలో హనుమాన్ జయంతి ఊరేగింపు అనంతరం హిందూ-ముస్లిముల మధ్య చెలరేగిన మత ఘర్షణల తరువాత ప్రత్యేకంగా ముస్లిములను టార్గెట్ చేస్తూ ఆక్రమణల తొలగింపు పేరిట వారి ఇళ్లను కూల్చేసిన సంఘటన అందరికీ తెలిసిందే.
నిజానికి ఢిల్లీలో 731 ఆక్రమణ కాలనీలున్నాయి. వాటిలో లక్షల మంది నివశిస్తుండగా కేవలం ముస్లిములు అధికంగా నివసించే ఒక్క కాలనీని మాత్రమే టార్గెట్ చేస్తూ సుప్రీం కోర్టు ఆదేశాలను ధిక్కరించి మరీ ముస్లిముల ఇళ్లు, షాపులను కూల్చేసి వారిని రోడ్డున పడేయటం దేశం మొత్తం చూసింది.
కానీ, జహంగిర్ పురిలో నివసించే హిందువులు ఈ దారుణాన్ని చూసి మౌనం వహించలేదు. జహంగిర్ పురిలో హనుమాన్ జయంతి ఊరేగింపు సందర్భంగా మత ఘర్షణలు చెలరేగిన వారం తర్వాత ఇది కేవలం హిందూ-ముస్లిముల మధ్య సోదర భావాన్ని దెబ్బతీయటానికి కొందరు వేర్పాటు వాదులు పన్నిన రాజకీయ కుట్ర అన్న విషయాన్ని గ్రహించి తమ తోటి ముస్లిం సోదరులతో కలిసి ఒక ‘ఉమ్మడి శాంతి కమిటీ’ని (Joint peace committee) కూడా ఏర్పాటు చేసుకున్నారు.
తమ సోదరభావాన్ని చాటుతూ హిందూ-ముస్లిములు కలిసి ‘హిందూ ముస్లిం సిక్కు ఈశాయి ఆపస్ మే హై భాయ్ భాయ్’ మరియు ‘వందేమాతరం’ నినాదాలు చేస్తూ తిరంగా యాత్రను నిర్వహించారు.
ఇదే ఆదర్శాన్ని గనుక దేశం మొత్తం మీద ఉన్న హిందూ-ముస్లిములంతా కలిసికట్టుగా పాటిస్తే గనుక పోలిటికల్ స్టంట్ లో భాగంగా ప్రస్తుతం మత విద్వేష వేర్పాటువాద రాజకీయాలు నడుపుతున్న వారి కుట్రలు పూర్తిగా నిర్వీర్యం అయిపోతాయనటంలో సందేహం లేదు.
ఎందుకంటే హిందూ-ముస్లిముల పటిష్ట ఐక్యత దేశ నిర్మాణానికి ఎంత అత్యంత అవశ్యకమో.. వారి మధ్య మత విద్వేషాలు రగిల్చి తమ రాజకీయ ఉనికి కాపాడుకోవటం కూడా కొందరు దుర్మార్గులకు అంతే అవసరం కాబట్టి.
మత విద్వేషాలు రగుల్చుతూ హిందూ-ముస్లిముల మధ్య విభజన రాజకీయాలు నడుపుతున్న కొందరు దుర్మార్గుల ఆగడాలను చూస్తూ మౌనం వహించే సమయం కాదు ఇది. హిందూ-ముస్లిం వర్గాల్లో ఉత్తములు మౌనం వీడి ఆచరణాత్మకంగా తమ ఐక్యతను చాటే సమయం ఇది.
‘శోభాయాత్ర” vs “తిరంగా యాత్ర”
