శాంతియుతంగా శోభాయాత్ర చెయ్యాలనుకున్నప్పుడు…
హాకీ బ్యాట్లు, కత్తులతో ఊరేగింపులు దేనికి?
లౌడ్ మ్యూజిక్ తో భీబత్సమైన కేకలు దేనికి?
డీజేలతో మసీదుల ముందు క్యాబరే డ్యాన్సులు దేనికి?
ముస్లిం వ్యతిరేక పాటలతో, బూతులతో కేరింతలు దేనికి?
మసీదు మీనార్లెక్కి కాషాయ జండాలు పాతటం దేనికి?
అన్ని రాష్ట్రంల్లోనూ శ్రీ రామ నవమినాడు శాంతియుతంగా జరిగాయని చెబుతున్న శోభయాత్రలు పై విధంగానే నిర్వహించబడ్డాయి! ప్రతీ రాష్ట్రంలోనూ శోభాయత్రలో జరిగింది ఇదే తంతు.
పర్మిషన్లు లేనప్పటికీ ముస్లిములు అధికంగా నివసించే ప్రాంతాల్లో బలవంతంగా శోభాయాత్రలు నిర్వహించటమైంది. ముస్లిములను దేశం నుండి వెళ్లగొట్టాలన్న ప్రసంగాలు, కొన్ని చోట్ల పనికట్టుకుని ముస్లిం యువకులను బూతులు, దుర్భాషలతో రెచ్చగొట్టటంతో రాళ్ల దాడులు జరిగాయి. మధ్యప్రదేశ్ లో అయితే ముస్లిములు రాళ్లు విసిరారన్న నెపంతో విచారణ చెయ్యకుండానే దర్గాలను, ముస్లిముల ఇళ్లను బుల్డోజర్లతో కూల్చేసి, షాపులు కాల్చేసి వారి కుటుంబాలను రోడ్డున లాగేయటం జరిగింది.
అసలు శోభాయాత్రలో కత్తులు ఎక్కడ నుండి వచ్చాయి?
వారికన్ని పొడవాటి కత్తులు, హాకీ బ్యాట్లు పంచిపెట్టింది ఎవరు?
ఇండియన్ ఆర్మ్స్ యాక్ట్ 1959 ప్రకారం 9 అంగుళాల కంటే పొడవు కత్తిని పట్టుకుని ఊరేగటం నేరం. దానికి లైసెన్స్ తీసుకోవటం అవసరం. శోభాయాత్రలో అంతేసి పొడవాటి కత్తులు పట్టుకుని భీబత్సంగా మసీదుల ముందు క్యాబరే డ్యాన్సులు చెయ్యటానికి వారికి పర్మిషన్ ఎవరిచ్చారు?
పాపం హిందువులు వారి మానాన వారేదో శాంతియుతంగా శోభాయాత్రలు చేసుకుంటుంటే ముస్లిములు రాళ్ల దాడి చెయ్యటం వలనే గొడవలు జరిగాయని సోషల్ మీడియా అంతా మారుమ్రోగిపోతుంది. కానీ, ఆ రాళ్ల దాడుల వెనుక జరిగిన పై సంఘటనలను గురించి ఎవరూ మాట్లాడరు.
అసలు ప్రతీ రాష్ట్రంలోనూ ఎంతో ఆర్గనైజ్డ్ గా జరుపబడిన ఈ వైలెన్స్ వెనుక హిందూ-ముస్లిం వేర్పాటువాద రాజకీయాలన్నది అంతర్గత ఏజండా అయితే..
దేశ వ్యాప్తంగా ప్రజల దృష్టిని రోజురోజుకూ పెరిగిపోతున్న ఆయిల్, పెట్రోల్, గ్యాస్ ధరల నుండి, నిరుద్యోగ సమస్య నుండి, నిత్యావసర ధరల నుండి, పతనమవుతున్న రూపాయి విలువ మరియు దిగజారుతున్న దేశ ఆర్థిక పరిస్థితుల నుండి మరల్చటం మేయిన్ ఏజండా.
ఇలాంటి వాటి గురించి ప్రజలు ప్రశ్నించకుండా ఉండాలంటే వారిలో మత ఉన్మాదం పెంచి వారిలోవారు కొట్టుకు చచ్చేలా తయారు చెయ్యాలి. మెజారిటీ ప్రజల కోసం ఓ కల్పిత శత్రువును తయారు చేసి వారి ముందు నిలబెట్టి, అతని వల్ల నువ్వు ప్రమాదంలో ఉన్నావని లేనిపోని భయాల్ని సృష్టించాలి. అతని పట్ల ధ్వేషాన్ని రగిలించాలి. ఇప్పుడు ఈ రకమైన భావజాలాలే సర్వసామాన్యం చెయ్యబడుతున్నాయి.
ఎంతో చక్కగా సోదరుల్లా కలిసుండే హిందూ-ముస్లిముల మధ్య ఇప్పుడు విద్వేషపూరిత వాతావరణం సృష్టించబడుతుంది. తమ మరియు తమ పిల్లల భవిష్యత్తును ప్రక్కన పెట్టేసి మరీ ముఖ్యంగా విద్యా, వైజ్ఞానిక, ఆర్థిక రంగాల అభివృద్ధి వంటి వాటి గురించి ఆలోచించకుండా.. మధ్య యుగాల్లో ముస్లిముల దండయాత్రలు, కాశ్మీర్ పండిట్ల వలసలు, రామజన్మ భూమి వగైరా అంశాల గురించి వాదోపవాదాలు చేసుకుంటూ దేశవ్యాప్తంగా అధికశాతం ప్రజలు హిందూ-ముస్లిం అంటూ కొట్టుకు చచ్చిపోతున్నారు.
ఫాసిస్టు ఏజండాతో నడుపబడే ప్రభూత్వాల ద్వారా పాలించబడే ప్రజలు ఇలా కాక మరి ఇంకెలా తయారవుతారు? ఈ ఏజండా వలన దేశం మొత్తం ప్రమాదంలో పడుతుంది.

