ఉన్మాదం లేని చోట ఆలోచన ఉంటుంది…

ఉన్మాదం లేని చోట ఆలోచన ఉంటుంది. ఆలోచన చంపేయాలంటే ఉన్మాదం పెంచితే చాలు. ఇప్పుడు జరుగుతుంది అదే. ఇక్కడ గమనించాల్సిందేమిటంటే…

హిజాబ్ ధరించకూడదనో, దేవాలయాల చుట్టూ ముస్లిములు వ్యాపారాలు చెయ్యకూడదనో నిరసనలు చేస్తున్నవారందరి బ్యాగ్రౌండ్ ఒకసారి చెక్ చేస్తే..

వారి తలితండ్రులు, అన్నాదమ్ముల్లోనో లేక బంధువుల్లోనో ఎవరో ఒకరు దుబాయ్, సౌదీ అరబ్, కువైట్ వగైరా ఏదో ఒక ముస్లిం కంట్రీలో ఉద్యోగాలు చెయ్యటానికో, పనులు చేసుకుని సంపాదించటానికి వెళ్లి ఉంటారు.

ప్రపంచంలో ఏ మూల ఏ చిన్న సంఘటన జరిగినా సెకన్లలో ప్రపంచం మొత్తం వ్యాపించిపోతున్న ప్రస్తుత నేపథ్యంలో ముస్లిం విద్యార్ధినిలు హిజాబ్ ధరించకూడదని, దేవాలయాల చుట్టూ ముస్లిములు వ్యాపారాలు చెయ్యకూడదని ఎందుకూ పనికిరాని దిగజారుడు నిరసనలు చేస్తున్న ఈ మతతత్వ వాదుల ఆగడాలను ప్రపంచ దేశాలు చూడటం లేదనుకుంటున్నారా?

ఒకవేళ ఈ గొడవ ముదిరి అరబ్ దేశాలు కూడా బ్రతుకుతెరువు కోసం తమ దేశాలకు వచ్చిన హిందువుల పట్ల అలాంటి నిర్ణయమే తీసుకుంటే అప్పుడు పరిస్థితి ఏంటి?

అసలు ఎన్ని మిలియన్ల మంది హిందువులు ప్రశాంతంగా అరబ్ దేశాల్లో సంపాదించుకుంటూ నివసిస్తున్నారో.. ఎన్ని బిలియన్ల రూపాయల డబ్బు ప్రతీ సంవత్సరం భారతదేశానికి వస్తుందో అసలు ఈ మతోన్మాదులకు లెక్కలు తెలుసా?

నిజంగా ముస్లిం దేశాలు కూడా అలాంటి ఉన్మాదపు నిర్ణయం తీసుకుని హిందువులను వెనక్కి పంపేస్తే.. భారత దేశంలో చదువుకున్నోళ్లకే ఉద్యోగాలివ్వటానికి దిక్కులేని పరిస్థితిలో అక్కడి నుండి వచ్చేసిన వారందరి పరిస్థితి ఏమిటి?

వారందరితో గౌరవనీయులైన ప్రధాన మంత్రిగారు రోడ్డు ప్రక్కన పకోడాల బిజినెస్ పెట్టిస్తారా? అలా అయితే పకోడాలు తినేవాళ్ల కంటే పకోడాలమ్మేవారి సంఖ్యే ఎక్కువైపోతుంది భారత దేశంలో.

ఓ ప్రక్క దేశం అప్పులు పెరిగిపోయి, ఆర్ధిక పరిస్థితి దిగజారిపోతూ, నిత్యావసర వస్తువులు, పెట్రోల్ ధరలు ఆకాశాన్నంటుకుంటుని, మరో ప్రక్క నిరుద్యోగం పెరిగిపోతూ, వ్యాపారాలు నష్టాల్లో మునిగిపోయి ప్రజలు రోడ్డున పడే పరిస్థితుల్లో ఈ సమస్యల గురించి ఆలోచన చెయ్యనీయకుండా ప్రజల్ని హిందూ-ముస్లిం అంటూ కొట్టుకుచచ్చే అనాగరికులుగా మార్చేయటమన్న అరుదైన దృశ్యం బహుశా ఒక్క భారతదేశంలోనే కనపడుతుందేమో

Md Nooruddin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *