అసలు సమస్య ఆ హిజాబ్ కానే కాదు…

కానీ ఏదోలా మతవిధ్వేషాన్ని రగిలించటమే…

హిందూ, ముస్లిం వేర్పాటువాద రాజకీయాన్ని చేయటమే…

హిందూ, ముస్లిముల భావోధ్వేగాలను రెచ్చగొట్టి మతోన్మాదాన్ని వ్యాపింపజేయటమే…

ఒకప్పుడు బాబ్రీ మసీద్, గోమాంసం, లవ్ జిహాద్, పౌరసత్వ సవరణ చట్టాలు, ఇప్పుడు కొత్తగా హిజాబ్ కేవలం ఒక వంక మాత్రమే.. రేపు మరొకటేదైనా.

మొత్తానికి జాతీయ జండాకు బదులు కాషాయ జండాను నిలబెట్టటమే అసలు లక్ష్యం.

మత విధ్వేషమే పునాదిగా చేసుకుని తమ ఉనికిని కాపాడుకునే పాలకులుండే దేశంలో ఇలాంటి సంఘటనలు పునరావృత్తం అవ్వటం కామనే!

ఇది స్పష్టంగా కళ్ల ముందు కనపడుతున్నప్పటికీ… దానిపై పోరాడటం మానేసి సోషల్ మీడియాలో కొందరు అసలు హిజాబ్ అవసరమా కాదా? ఖురాన్ లో ఉందా లేదా? ముస్లిం మహిళలు బలవంతంగా తొడుగుతున్నారా? ఇష్టపూర్వకంగా ధరిస్తున్నారా? వగైరా పనికిరాని డిస్కషన్లు మొదలెట్టారు.

మరోప్రక్క ఇస్లామోఫోబియాను పంటిక్రింద బిగపట్టి పైకి అభ్యుదయవాదుల్లా చలామణీ అయ్యే కొందరు ఈ అవకాశాన్ని ఉపయోగించుకుని ఎప్పట్నుంచో కడుపులో దాచుకున్న ఇస్లామోఫోబియా పైత్యాన్ని కక్కటం మొదలెట్టారు.

ఇంకోప్రక్క నాస్తికులు ఈ అవకాశాన్ని జారవిడుచుకోకుండా మతం వల్లే ఇన్ని అనర్థాలు అందరూ మతాల్ని వదిలిపెట్టేసి యూనిఫాం పాటిస్తే ఇన్ని అనర్థాలే జరగవుకదా అంటూ స్వంత ఫిలాసఫీలు మాట్లాడ్డం మొదలెట్టారు.

మొత్తానికి ఈ రాజకీయ కుట్రలో ప్రజలందరి దృష్టి చక్కగా మళ్లించబడుతుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *