సంక్షిప్తంగా ఛార్మినార్ ప్రక్కన గుడి ఎలా కట్టబడిందంటే..

1955-56లలో చార్మినార్ చుట్టూ చాలా లావుగా ఉండే ఇనుప గొలుసు ఉండేది. క్రమంగా అది కనుమరుగు అయిపోయింది. అందులో చిన్న ముక్క అమ్మినా బోలెడు డబ్బు వచ్చేది. అలా జనం కొందరు ఇనుప తాడు దొంగిలించేవారు. అప్పుడు అక్కడ ఒక మైలురాయి ఉండేది. హైదరాబాద్ జీరో మైలు రాయి అది. 1967లో ఒక బస్సు డ్రైవర్ ఆ రాయిని గుద్దేస్తే పగిలిపోయింది. వెంటనే ఆర్య సమాజ్ వారు వచ్చి ఆ రాయి భాగ్యలక్ష్మీ దేవని చెప్పి అప్పటికప్పుడు రెండున్నర అడుగుల ఎత్తులో నాలుగు పైపులు వాడి ఒక షెడ్ లాగా వేసేశారు. ఆ షెడ్ కట్టక ముందు అక్కడ ఇద్దరు అమ్మాయిలు భిక్షాటన చేసేవారు. వారు అక్కడే పసుపు, కుంకుమ వేసేవారు. ఈ గుడి కట్టాక వారిని పంపించేశారు. ఒక పూజారి వచ్చాడు. ఆ రాయి దగ్గర లక్ష్మీ దేవి ఫోటో పెట్టారు. ఆమె భాగ్యలక్ష్మీ అనీ హైదరాబాద్‌ను కాపాడటానికి వచ్చిందనీ చెప్పారు. కొన్ని రోజులకు ఆ ఫోటో బదులు విగ్రహం పెట్టారు… అదన్నమాట సంగతి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *