దేశంలో ముస్లిముల వల్ల హిందూత్వం ప్రమాదంలో లేదు.. హిందువుల వల్ల ముస్లిం సమాజం కూడా ప్రమాదంలో లేరు. కానీ.. మతోన్మాద శక్తుల వల్ల మటుకు దేశం ప్రమాదంలో ఉంది.
బీహార్ లో ఇటీవల బీజేపీ నెగ్గటంతో ఊరేగింపుగా వెళుతూ అందులో మతోన్మాద పైత్యం బాగా తలకెక్కిన వానర సైన్యం అమాంతంగా మసీదుపై రాళ్లతో దాడిచేసి విధ్వాంసోత్సాహాన్ని ప్రదర్సించింది మసీదును పూర్తిగా ధ్వంసం చేయ్యటమే కాక.. తమ మానాన తాము మసీదులో ఆరాధన చేసుకుంటున్న ముస్లిములపై పడి తీవ్రంగా గాయపరచి… ఎప్పుడూ కామన్ గా పలికే “జై శ్రీరాం” అన్న నినాదాలతో మసీదులో కేకలు వేసి కాస్సేపు శునకానందం పొందటం జరిగింది. అందులో కొందరి పరిస్థితి విషమంగా ఉంది. ఈ ఉన్మాద శక్తులను నేను హిందువులని చెప్పి అసలు హిందుత్వాన్ని కించపరచలేను.
ఎందుకంటే నాకు తెలిసిన ఉన్నత విలువలతో కూడిన హిందూత్వం.. హిందూ శాస్త్రాల్లో ఉంది.. తోటి వ్యక్తుల పట్ల మానవత్వం ప్రదర్శించే ఉన్నత సంస్కార హిందువులు నాకు తెలిసి ఎందరో ఉన్నారు.
“మతోన్మాదం” వల్ల “దేశ్ ఖత్రేమే హై”
