ఇస్లామోఫోబియా – ఫ్రీడం ఆఫ్ స్పీచ్ ముసుగులో

ఫ్రాన్స్ సంవత్సరాలుగా ప్రదర్శిస్తూ వస్తున్న ఇస్లామోఫోబిక్ పైత్యానికి పెట్టుకున్నకొత్త పేరే “ఫ్రీడం ఆఫ్ స్పీచ్”. ప్రవక్త ముహమ్మద్ (స) మీద వ్యంగ్యంగా కార్టూన్లు వెయ్యటం అన్న సంస్కృతి చంపబడ్డ ఆ శామ్యూల్ పాటీ కొత్తగా కనిపెట్టిందేమీ కాదు. ఛార్లీ హెబ్డో మాగజైన్ కొన్ని సంవత్సరాల క్రితమే ప్రవక్త ముహమ్మద్ (స) వారిని ఉద్దేశిస్తూ అత్యంత జుగుప్సాకరమైన కార్టూన్లు వెయ్యటం మొదలెట్టింది. అదంతా “ఫ్రీడం ఆఫ్ ఎక్స్ప్రెషన్” తప్ప ఉద్దేశపూర్వకంగా ఎవర్నీ కించపరచటం కాదని సమర్ధించుకుంది. ఎప్పటి నుండో ఫ్రాన్స్ లో ముదురుతూ వస్తున్న ఇస్లామోఫోబియాకు కొనసాగింపే ఆ స్కూల్ టీచర్ ప్రవక్త ముహమ్మద్(స) మీద వ్యంగ్య కార్టూన్లు చూపిస్తూ క్లాసులో పని కట్టుకుని చెప్పిన “ఫ్రీడం ఆఫ్ స్పీచ్” పాఠాలు.

అంతటితో ఛార్లీ హెబ్డో మాగజైన్ ఊరుకోలేదు ఈ సంఘటన తరువాత మరిన్ని ప్రవక్త (స) కార్టూన్లను విడుదల చేసి ఫ్రాన్స్ ముస్లిములను రెచ్చగొట్టింది.
ఇంకాస్త వెనక్కి వెళితే చరిత్రలో ఫ్రాన్స్ ముస్లిములపై చేసిన ఆకృత్యాలు, అత్యాచారాలు అత్యంత క్రూరమైనవి. 1945 నుండి 62 సం.ల మధ్య కాలంలో మిలియన్ల కొద్దీ అల్జీరియా ముస్లిములను అత్యంత పాశవికంగా చంపేసిన రక్తచరిత్రను ఫ్రాన్స్ గతంలోనే రాసుకుంది.

ఇవేమీ తెలియని కొందరు అభ్యుదయవాదులు ఫ్రాన్స్ పై ముస్లిములు దాడులు చేసేస్తున్నట్టు తెగబాధపడిపోయి.. ఆ టీచరు ఏదో ఫ్రీడం ఆఫ్ స్పీచ్ లో భాగంగా.. మీ ప్రవక్త కార్టూన్లు వేస్తే చంపేస్తారా? ఆ మాత్రం దానికే ఫ్రాన్స్ ప్రొడక్ట్స్ ను బాయ్ కాట్ చేసేసుకుంటారా? అంటూ సోషల్ మీడియాలో ప్రశ్నలు వేస్తూ టైమ్ పాస్ చేస్తుంటారు.

ఆ స్కూల్ టీచరును చంపేసిన ఆ విద్యార్థి చేసింది మంచి పనే అని సమర్ధించటం లేదిక్కడ.. “ఒక మానవుణ్ణి చంపితే సకల మానవులనూ చంపేసినంత పాపమని” ఖురాన్ చెబుతుంది. ఆ విద్యార్థి సహనం కోల్పోవటం ఎంత పెద్ద తప్పో..
అంతమంది పోలీసులు ఉన్నప్పటికీ ఆ స్కూల్ విద్యార్థిని చట్టబద్ధంగా అరెస్టు చేసి అసలేం జరిగిందో తెలుసుకోవటానికి సాక్ష్యమే లేకుండా ఆన్ స్పాట్ లో చంపేయటం కూడా అంతే తప్పు? మరి అది ఉగ్రవాదం కాదా? మీ ప్రవక్త కార్టూన్లు వేసినంత మాత్రానా చంపేస్తారా? అంటూ ప్రశ్నించేవారు ఫ్రాన్స్ ముస్లిములపై చేస్తున్న అత్యాచారాల గురించి గానీ, ఆ విద్యార్థిని అరెస్టు చేయకుండా చంపేయటం పై గానీ ఫోకస్ పెట్టరు. ఎందుకంటే ఇస్లాంపై తమ పైత్యాన్ని కక్కటానికి దొరికిన ఓ చక్కటి అవకాశం కాబట్టి.

పైగా పరిస్థితులను చక్కదిద్దాల్సిన అధ్యక్షుడైన మాక్రోనీ జరిగిన ఘటనకు “ఇస్లామిస్ట్ టెర్రరిజం” అన్న పేరు తగిలించి, ఫ్రీడం ఆఫ్ స్పీచ్ ను, ఫ్రీడం ఆఫ్ ఎక్స్ప్రెషన్ ఎవరైనా ఉపయోగించుకోవచ్చు.. కార్టూన్లు మేము వదిలబోము.. పైగా ఫ్రాన్స్ టెర్రరిస్ట్ ఎట్టాక్స్ కు గురవుతుందని స్పీచులిచ్చి ప్రత్యక్షంగా ఇస్లాంపై తనకున్న ధ్వేషాన్ని అందంగా వెళ్లగక్కాడు. ఫ్రీడం అతనికి అంత ప్రాముఖ్యమైనప్పుడు అక్కడి ముస్లిం స్త్రీలు హిజాబ్ ధరించటంపై ఎందుకు నిషేధం. అది వారి ఫ్రీడం ను హరించటం కాదా? అలాగే ఛార్లీ హెబ్డో మాగజైన్ చేసే వేసే తింగరి కార్టూన్లపై నిషేధం విధించటం మాక్రోనికి ఒక్క నిమిషం చాలు. మాక్రోనీ మాటలు నచ్చని ముస్లిం దేశాలు మేము కూడా మాకున్న ఫ్రీడం ఆఫ్ ఎక్స్ప్రెషన్ ను ఉపయోగించుకుంటే తప్పేంటని ఫ్రాన్స్ ప్రొడక్ట్స్ ను తమ దేశాల్లో బాయ్ కాట్ చేసుకున్నాయి. అది వాళ్ల ఫ్రీడం ఆఫ్ ఎక్స్ప్రెషన్.

ఫ్రీడం ఆఫ్ స్పీచ్ అంటే..?

ఓ మైనారిటీ వర్గ ప్రజలు ఓ మెజారిటీ వర్గం తాలూకు ప్రభుత్వాన్నో దాని అధికారుల ముందో నిలబడి ధైర్యంగా మాట్లాడగలగటం ఫ్రీడం ఆఫ్ స్పీచ్ అవుతుంది. ఒక అధికారి ముందు ధైర్యంగా నిలబడి నిజం చెప్పటం ఫ్రీడం ఆఫ్ స్పీచ్ అవుతుంది. అన్యాయం జరిగితే న్యాయం కోసం ప్రభూత్వాన్ని నిలదీయగలగటం ఫ్రీడం ఆఫ్ స్పీచ్ అవుతుంది. తప్పితే.. తమ దేశంలో కేవలం 7 శాతం కంటే కూడా తక్కువగా ఉన్న మైనారిటీ ప్రజలు ఆదర్శంగా తీసుకునే ప్రవక్తను వెక్కిరించేలా కార్టూన్లు వెయ్యటం అది ఏ విధమైన ఫ్రీడం ఆఫ్ స్పీచ్ అవుతుంది?
ప్రపంచవ్యాప్తంగా 1.8 బిలియన్ల (అంటే ప్రపంచ జనాభాలో మూడొంతుల్లో ఒకవంతు జనాభా) ప్రజలు తమ ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించే ప్రవక్త ముహమ్మద్ (స) ను కించపరిచేలా జుగుప్సాకరమైన కార్టూన్లు వెయ్యటం ఏ విధంగా ఫ్రీడం ఆఫ్ ఎక్స్ప్రెషన్ ను ఉపయోగించుకోవటం అవుతుంది? ప్రతీ దానికీ ఓ హద్దు (Limit), మోతాదులు అనేది ఉంటాయి. చివరకు విమర్శలకైనా సరే.

ఫ్రీడం ఆఫ్ ఎక్స్ప్రెషన్ ఉపయోగించుకోవటంలో తప్పేముందని ఆ మాత్రం దానికే మనోభావాలు పాడైపోతే ఎలా? అని స్పీచులిచ్చేవారు అదే వారిని వెక్కిరించేలా నగ్న కార్టూన్లను వేస్తే.. లేక వారు ప్రాణపదంగా ప్రేమించేవారి కార్టూన్లను పేపర్లలో ముద్రిస్తే లేక వారు అభిమానించే దేవీదేవతల కార్టూన్లో వేస్తే సహించగలరా? అటు ఆస్తికులకైనా, నాస్తికులకైనా ఆత్మాభిమానం, సభ్యత సంస్కారాలూ అనేది కొన్ని ఉంటాయి. తాము ఇష్టపడే వ్యక్తులూ మహనీయులు ఉంటారు. వారిపై గౌరవమూ ఉంటుంది. వారిని కించపరచటం ఫ్రీడం ఆఫ్ స్పీచ్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *