8 మే 1945 కు ముందు అల్జీరియన్ ముస్లిములు నెలల తరబడి తమ స్వతంత్రం కోసం వలసవాద వ్యతిరేక ఉద్యమం చేస్తున్న రోజులు. అదే సమయంలో జనరల్ డువాల్ ఆదేశాల మేరకు అల్జీరియన్ ముస్లిం పురుషులు, మహిళలు మరియు పిల్లలను ఫ్రెంచ్ దళాలు సమీకరించి, కేవలం మే 8 నుండి మే 22, 1945 మధ్య, సుమారు 45,000 మంది అల్జీరియన్ ముస్లింలను ఫ్రెంచ్ దళాలు ఊచకోతకోసి చంపాయి.
ముఖ్యంగా సెటిఫ్ మరియు గ్వెల్మా నగరాలతో పాటు అనేక నగరాలపై దాడులు చేసి విమానాల నుండి బాంబుల వర్షం కురిపించి భీకర దాడులు చెయ్యటం జరిగింది.
అంతేకాక, అప్పటి ఫ్రాన్స్ యొక్క తాత్కాలిక ప్రభుత్వ అధిపతి జనరల్ డి గల్లె, చుట్టుపక్కల ప్రాంతాల నుండి రైతులు మరియు గ్రామస్తులను చంపాలని ఆదేశించాడు.
ఆ దాడుల్లో వేలాది ముస్లిం పురుషులు, స్త్రీల, పిల్లల మృతదేహాలు పేరుకుపోయాయి. వాటిని పాతిపెట్టడం అసాధ్యమైపోయింది. దానితో బావుల్లో దగ్గర్లో ఉన్న లోయల్లో వారి శవాల్ని విసిరేశారు.
సరిగ్గా 9 సం.ల తరువాత అంటే 1961 లో తిరిగి ఫ్రెంచ్ దళాల దాడుల్లో స్వతంత్రం కోసం పోరాడుతున్న 1.5 మిలియన్ల అల్జీరియన్ ముస్లిములు చంపబడ్డారు.
ఓ ముస్లిం పేరు పెట్టుకుని ఒకడు నేరం చేస్తే అది ఫ్రాన్స్ ప్రెసిడెంట్ మాక్రోని దృష్టిలో “ఇస్లామిక్ టెర్రరిజం”.. అదే ఫ్రాన్స్ కొన్ని సంవత్సరాల క్రితం వేల కొద్దీ ముస్లిములను ఊచకోతకోసి చంపేస్తే మరి దాన్నేమనాలి? ఫ్రాన్స్ టెర్రరిజం అనే కదా అనాల్సింది.
