“NSSO” ప్రకారం ఆ రాష్ట్రం దేశంలోకెల్లా నిరుద్యోగ్యంలో మొట్టమొదటి స్థానంలో నమోదయ్యింది..

“CPCB” ప్రకారం ఆ రాష్ట్రం దేశంలోకెల్లా అత్యంత కాలుష్యం కలిగిన రాష్ట్రంగా నమోదయ్యింది..

“నితి ఆయోగ్” ప్రకారం హెల్త్ కేర్ ఇండెక్స్ లోనూ ఆ రాష్ట్రం దేశంలోకెల్లా అత్యంత హీనదశలో ఉంది..

“NCRB” రిపోర్ట్ ప్రకారం ఆ రాష్ట్రం స్త్రీలకు అత్యంత ప్రమాదకర రాష్ట్రం ఎందుకంటే ఆ రాష్ట్రం దేశంలోకెల్లా స్త్రీ అత్యాచారాల్లో మొట్టమొదటి స్థానంలో నమోదై ఉంది..

అయినప్పటికీ Mood of the Nation సర్వే ప్రకారం ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి దేశంలో కెల్లా ఉత్తమ ముఖ్యమంత్రి!!

ఇలాంటి అరుదైన వింత సంఘటనలు ఒక్క భారతదేశంలోనే జరుగుతుంటాయి.

ఆ రాష్ట్రంలో స్త్రీలను రేప్ చేసిన దుర్మార్గులు సాక్ష్యాలను లేకుండా చేయటానికి వారిని చంపి శవాలను తగలెట్టేసేవారు..

ఇప్పుడు వారికి శ్రమ తగ్గించి రక్షణ కల్పించాల్సిన వ్యవస్థలే ఆ పని చేసి పెడుతున్నాయి. వారి ద్వారానే ప్రజాస్వామ్యం చీకట్లో తగలెట్టబడుతుంది..

ఇలాంటి అరుదైన వింత సంఘటనలు ఒక్క భారతదేశంలోనే జరుగుతుంటాయి.

బాబ్రీ మసీదు పడగొట్టిన వీడియోలు ఏ విధంగానూ బాబ్రీ మసీదు బలవంతంగా కూల్చేశారనటానికి సాక్ష్యాలుగా పనికిరావు.. కానీ, కొన్ని వేల సంవత్సరాల క్రిందట అక్కడ రాముడు జన్మించాడనటానికి ఏ రికార్డూ లేనప్పటికీ అది రామజన్మ భూమిగా డిక్లేర్ చెయ్యబడుతుంది.

ఇలాంటి అరుదైన వింత సంఘటనలు ఒక్క భారతదేశంలోనే జరుగుతుంటాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *