“ఇప్పుడే 9 గంటల ప్రాంతంలో మేము భగీరతి విహార్ లో ఇద్దరు ముల్లాలను చంపాము అక్కడ మీ పరిస్థితి ఏమిటి?”
ఈ సంభాషణ జరిగిన మరుసటి రోజు (ఫిబ్రవరి 27న) ‘ముహమ్మద్ అమీర్’ ‘హాషిం అలీ’లు భగీరతి విహార్ డ్రైనేజీలో ఒంటి నిండా తీవ్రమైన గాయాలతో శవాలై తేలారు.
“మేము గంగా విహార్, గోకుల్ పురి, జోరీపూర్ ఈ ప్రాంతాలన్నిటిలో తిరుగుతున్నాము ఇప్పటివరకు 23 ముల్లాల తలలు పగలగొట్టాము. భగీరధి విహార్ వీధి నెం.1 మసీదులో ముల్లాలందరినీ నమాజ్ చదవకుండా మసీదు నుండి వెళ్లగొట్టాము. మీకు ఏ ఇబ్బందైనా ఎదురైతే “జై శ్రీరాం” అని నినదించండి”
ఈ సంభాషణ జరిగిన తరువాత వరుసగా ఫిబ్రవరి 25 నుండి మార్చ్ 8 మధ్యలో 11 మంది ముస్లిముల శవాలు డ్రైనేజీలలో అధ్వన్న స్థితిలో దొరికాయి.
5 నిముషాల్లో ఇంటికొస్తున్నానని ఎనిమిది నెలల గర్భవతి అయిన తన భార్యకు ఫోన్ చేసి చెప్పిన అమీర్ ఎప్పటికీ రాలేదు ఎక్కడో శవమై దొరికాడు
ఫిబ్రవరీ 25,26 తారికుల్లో NRC సమర్థకులకు, వ్యతిరేకులకు మధ్య జరిగిన ఘర్షణగా చిత్రీకరించబడిన ఢిల్లీ మారణహోమం సాగుతున్న సమయంలో హిందుత్వ తీవ్రవాదుల మధ్య వాట్స్ యాప్ గ్రూప్ లో ఇలాంటి వందల కొద్దీ సంభాషణలు జరిగాయి.
ప్రత్యేకంగా ముస్లిములను టార్గెట్ చేసి చంపటానికి ముందస్తు ప్రణాళికతో 125 మందితో కూడిన ఒక వాట్స్ యాప్ గ్రూప్ క్రియేట్ చెయ్యబడింది. అందులో మేము ఫలానా ముస్లిం ఇళ్లు తగలెట్టాం, ఫలానా మసీదును కుల్చాము, ఫలానా ముల్లాల తల పగలగొట్టాము అని ఒకరికొకరు చెప్పుకుని మరీ ఎంతో ప్రణాళికాబద్ధంగా మారణహోమం సృష్టించారన్న విషయం ఢిల్లీ పోలీస్ అడిషనల్ PRO అనిల్ మిట్టల్ చేసిన విచారణలో తేలింది.
ఆ వాట్స్ యాప్ గ్రూప్ ముందుగా “కట్టర్ హిందూ ఏక్తా” అన్న పేరుతో తయారు చెయ్యబడి.. తరువాత “హిందూ ఏక్తా జిందాబాద్” అని పేరు మార్చటం జరిగింది. తరువాత “హిందూ యూనిటీ” “హిందూ ఏక్తా గ్రూప్” వగైరా నాలుగైదు పేర్లు మార్చబడ్డాయి. ముస్లిములపై దౌర్జన్యాలను, హత్యలను ఎంతో ప్రణాళికా బద్దంగా చేయటానికి “కట్టర్ హిందూ ఏక్తా” వాట్స్ యాప్ గ్రూప్ లో వేల కొద్దీ సంభాషణలు జరిగిన విషయం ఈ మధ్యనే బయటపడింది.
మరోప్రక్క ఢిల్లీ అల్లర్ల వెనుక ప్రధానకారణం పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా నిరసనకు దిగిన విద్యార్ధులు, కార్యకర్తలన్న అనుమానంతో గర్భవతి అని కూడా చూడకుండా సఫురా జార్గర్ ను అలాంటి ఎందరో విద్యార్థులను లాక్డౌన్ సమయంలో కూడా వెతికి మరీ పట్టుకుని తీవ్రవాద చట్టం క్రింద బుక్ చేసిన అరెస్టుల పర్వం ఇంకా కొనసాగుతూనే ఉంది.
కొసమెరుపు ఏమిటంటే ఆ “కట్టర్ హిందూ ఏక్తా” గ్రూప్ లో ‘కపిల్ మిశ్రా’ ప్రసంగం వినండి, విని అర్థం చేసుకోండీ అన్న మెసేజ్ తో కపిల్ మిశ్రా చేసిన విద్వేష పూరిత ప్రసంగం వందల సార్లు పోస్టు చెయ్యబడింది. ఢిల్లీ అల్లర్ల తరువాత 700 కు పైగా క్రిమినల్ కేసులు బుక్ అయ్యాయి. ఒక్క కేసులో కపిల్ మిశ్రా పేరు లేదు. కానీ NRC వ్యతిరేక ఉధ్యమంలో పాల్గొన్నందుకు ఢిల్లీ అల్లర్లతో సంబంధం లేని ఎంతో మంది అమాయకులు మటుకు తీవ్రవాద చట్టాల క్రింద అరెస్టు కాబడ్డారు.
ఒకవేళ ఇలాంటి ముస్లిముల వాట్స్ యాప్ గ్రూప్ గనుక బయటపడి ఉంటే ఈ పాటికే ముస్లిం సమాజాన్ని జిహాదీలు, టెర్రరిస్టులు అని ముద్ర వేసేసి సోషల్ మీడియాలో మతతత్వవాదం పెంచిపోషించే వేర్పాటువాదులు మరోసారి తమ విశ్వరూపం చూపించి ఉండేవారు. నలుగురు పేయిడ్ ఆర్టిస్టులను పోగుచేసుకుని గొంతుచించుకునే యాంకర్లు చెలరేగిపోయి ఉండేవారు. కానీ బయటపడింది హిందుత్వ తీవ్రవాదుల వాట్స్ యాప్ గ్రూప్ కనుక ఇలాంటి నిజాల ప్రస్తావన మీడియాలో శూన్యం.
దీనిని బట్టి ఎలాంటి గొప్ప సంస్కృతి భారతదేశంలో ప్రఢవిల్లుతుందో, ఎంతటి గొప్ప నాయకులు దానిని పాలిస్తున్నారో చెప్పటానికి ఇది గొప్ప ఉదాహరణ
Link :
https://thewire.in/…/delhi-riots-hindutva-whatsapp…
“కట్టర్ హిందూ ఏక్తా” గ్రూప్…
