లక్షల కొలది కశ్మీరీ పండితులన్నీ కశ్మీర్ లో చంపేయలేదా? ఇంకా లక్షల కొలది పండితుల్ని కశ్మీర్ నుండి తరిమేయలేదా?

కశ్మీరీ పండితులు 1990 జనవరిలో లోయను వదిలి వెళ్లారు. అదే నెల మొదట్లో జగ్ మోహన్ మల్హోత్రా గవర్నర్ గా వచ్చాడు. 1989లో జరుగుతున్న సాయుధ తిరుగుబాటును పూర్తి స్థాయిలో అణచివేయటానికి అతన్ని నియమించారు. అతగాడు తన మారణకాండను కొనసాగించటానికి ముందు కశ్మీరీ బ్రాహ్మణాలను బయటికి పంపాడు. రాత్రికి రాత్రి బస్సులు వేసి వారిని జమ్మూలోని శిభిరాలకు తరలించారు. ఆ శిభిరాలలో వాళ్లు చాలా కష్టాలు పడ్డారు. కొంతమంది భారతదేశంలోని ఇతర ప్రాంతాలకు పోగలిగారు. కొంతమంది ఇతర దేశాలకు కూడా పోయారు. తమ మాతృభూమిని వదిలిపెట్టి అలా వెళ్లాల్సి రావటం వారిని అనేకానేక ఇబ్బందులకు గురి చేసింది.

అయితే బయటకు వెళ్లిన పండితుల్లో చాలామందికి తమ తోటి ముస్లిముల పట్ల ప్రేమ ఉండేది. వారిలో కొద్దిమంది మాత్రమే ఆనాటి హిందుత్వ శక్తుల గొంతుకను అరువు తీసుకొన్నారు. ఇప్పుడిక బీజేపీ పాలనలో ‘కశ్మీరీ పండితుల వలస’ ను రాజకీయంగా సక్కెస్ ఫుల్ గా మార్చుకోగలిగారు. కశ్మీరీ పండితుల వలస బీజేపీ డిజిటాల్ సైన్యానికి పేలవ ప్రేలాపనగా తయారయ్యింది. వాళ్లెవరికి కశ్మీరీ పండితుల గురించి ఏమాత్రం తెలియదని స్పష్టంగా అర్థం అవుతుంది.

1990 సెప్టెంబర్ 22న 23మంది ప్రముఖ కశ్మీరీ పండితులు కశ్మీరీ ముస్లిములకు ఒక ఉత్తరం రాశారు. ‘We are sorry, We betrayed you’ (మమ్మల్ని క్షమించండి, మేము మీకు ద్రోహం చేశాము) లో అనే ఈ ఉత్తరం, ఆ కాలంలో కశ్మీర్ లోని అతిపెద్ద సర్క్యులేషనున్న పత్రిక ‘గ్రేటర్ కశ్మీర్’ లో ప్రచురితం అయ్యింది. ఈ పండితులు 1990లో లోయనుండి వలస వెళ్లిపోయినవాళ్లు. అందులో సంతకం చేసినవారిలో బ్రిజ్ నాథ్ భాన్, ఎంఎల్ ధర్, కెఎల్ కవ్, చునిలాల్ రైనా, మోతిలాల్ మామ్, అశోక్ కౌల్, ఎంఎల్ మున్షి, బిఎన్ గుంజూ, పుష్కర్ నాథ్ కౌల్, కమల్ రైనా, ఇంకా కొంతమంది ఉన్నారు.

జగ్ మోహన్ కున్న సొంత ఆశక్తుల కోసం, పండిత్ సముదాయానికి నాయకుడుగా చెప్పుకొని అదే పండిత సమూహాన్ని బలిపశువును చేశాడని ఒప్పుకొంటూ ఆ ఉత్తరం మొదలైయ్యింది. తాము వలసపోవడం అనేది బీజేపీ, ఆర్ ఎస్ ఎస్, శివసేన తయారు చేసిన డ్రామా అని, అది రాసినవారు వర్ణించారు. లోయలో ముస్లిములు నోరుమూసుకొని, లొంగిపోయిన వెనువెంటనే పునరావాసం ఏర్పాట్లు చేస్తామని తమకు వాగ్దానం చేయటం వలన -‘ధర్మాన్ని కాపాడి పరిరక్షించటానికీ, భారతదేశపు ఐక్యమత్యాన్ని, సమగ్రతను కాపాడటానికి తమ వలస అత్యంత కీలకం’ అయ్యిందని ఆ ఉత్తరంలో సంతకాలు చేసినవారు ఒప్పుకొన్నారు. ‘భారతదేశానికి శత్రువులు అయిన వారి చేతిలో కీలుబొమ్మలం అయినందుకు, పరాయిపాలన నుండి మాతృదేశాన్ని విముక్తం చేసే పోరాటంలో పాలుపంచుకోనందుకు సిగ్గుపడుతున్నామనీ’ ఆ ఉత్తరం చెబుతుంది. తన ఆధీనంలో ఉన్న ఈ ఉత్తరం కాపీ ఎవరికైనా కావాలంటే తన దగ్గర తీసుకోవచ్చునని మఖ్దూం చెబుతున్నాడు. ఈ మెహ్ బూబా మఖ్దూమి ఇంటర్నేషనల్ బిజినెస్ అండ్ ఎకానమీని హార్వర్డ్ యూనివర్సిటీలో చదివి, తన ఎంబీయేను పెన్సిల్వేనియా యూనివర్సిటీలో చేశాడు.

అధికారిక లెక్కల ప్రకారం లోయనుండి వెళ్లిపోయేటపుడు పండితుల సంఖ్య 150000 నుండి 190000 దాకా ఉండింది. కొంతమంది కశ్మీరీ పండితులు ఇప్పటికీ లోయలో ప్రశాంతంగా జీవిస్తున్నారు. శ్రీనగర్ నడిబొడ్డున కొన్ని పండితుల కుటుంబాలు ఇప్పటికీ ఉన్నాయి.

ప్రభుత్వ లెక్కల ప్రకారం ప్రకారమే, 1990-91 మధ్య హత్యకు గురి అయిన 1544 మంది కశ్మీరీలలో హిందువులు 1400 మంది. ఆ 1400ల మందిలో 209 మంది మాత్రమే కశ్మీరీ పండితులు. కానీ మిగతా 1200 మంది హిందువుల గురించి ఎవరూ మాట్లాడటం లేదు. ఎందుకంటే ఆ మిగతా 1200 మంది నిమ్నకులాల వాళ్లు. వారిలో చాలామంది విశ్వ హిందూ పరిషత్, ఆర్ ఎస్ ఎస్ తో సంబంధంతో ఉంటారు. ఈ సంస్థలు పండితులు కాని హిందువులను వలస పోవటానికి అంగీకరించవు. వాళ్లు చనిపోయిన పర్వాలేదు. వాళ్లు వెనక్కి వస్తే తుపాకులు ఇస్తామని ప్రభుత్వం చెప్పింది. అయితే వాళ్లు తుపాకీలతో శిక్షణ పొందినవాళ్లు కాదు. అందుకే పండితులు కానీ హిందువులు చాలామంది చనిపోయారు.

ఇంకోవైపు జమ్మూకశ్మీర్ పౌరసమాజ సంకీర్ణ సంస్థ చెప్పినదాని ప్రకారం 1989 జనవరి నుండి డిసెంబర్ 2018 వరకు 70000 మంది రాష్ట్ర ప్రజలు(ముస్లిములు) చనిపోయారు. అనధికారికంగా చనిపోయినవారి సంఖ్య 100000 వరకూ ఉంటుంది. వీరి కుటుంబాల వారు ఎవరూ లోయను వదిలి వెళ్లలేదు. వీరిలో కొంతమందికి బయట స్థిరపడే అవకాశం ఉన్నప్పటికీ కూడా వెళ్లలేదు. 2016లో బుర్హాన్ వాని హత్య తరువాత తీసుకొన్నా, ప్రభుత్వ బలగాలు సామాన్య ప్రజల నిరసనల మీద ప్రయోగించిన చర్యలలో కనీసం 1100 యువకులు పాక్షికంగానో, పూర్తిగానో పెల్లెట్లతో కళ్లు పోగొట్టుకొన్నారు. 15000 మంది గాయపడ్డారు. 2017-18లలో ఎదురుకాల్పుల ప్రదేశాల్లో నిరసన ప్రదర్శనలు నిర్వహిస్తూ, ప్రభుత్వ బలగాలతో ఘర్షణ పడుతూ చాలామంది పౌరులు చనిపోయారు. వాళ్ల కుటుంబాలు ఏవీ లోయను వదిలి వెళ్లలేదు.

కశ్మీరీ పండితులు ఎంతోమంది కశ్మీర్ విముక్తి ఉద్యమాల్లో పాల్గొన్నారు. జమ్మూ కేంద్రంగా పనిచేసే అనురాధా భాసిన్ అనే మానవహక్కుల లాయర్ తండ్రి వేద్ భాసిన్ షేక్ అబ్దుల్లాతో పాటు పనిచేశాడు. మోనా భాసిన్ అనే ఆంత్రోపలజిస్ట్ తాత రఘునాధ్ వైష్ణవి కూడా ప్లెబిసైట్ ఉద్యమంలో పాల్గొని చాలాకాలం జైల్లో ఉన్నాడు. ఈ ఇద్దరు మహిళలు ఇప్పుడు కశ్మీరీల హక్కుల కోసం పని చేస్తున్నారు. SAR Gelaani కోసం వాదించిన నందితాహస్కర్ కూడా కశ్మీరీ బ్రాహ్మిన్ యే. ఈ కేసులో SAR Gelaani తరుఫు సాక్షి అయిన సంపత్ ప్రకాష్ కూడా కశ్మీరీ బ్రాహ్మిన్. కశ్మీర్ సమస్య మీద అద్భుతమైన డాక్యుమెంటరీ తీసిన సంజయ్ కక్ కశ్మీరీ బ్రాహ్మిన్. ఇంకా ఎంతోమంది కశ్మీరీ బ్రాహ్మలు కశ్మీరీ విముక్తి ఉద్యమానికి మద్దతునిస్తున్నారు. వీళ్లలో కొంతమంది రచయితలు ఉన్నారు. ఎందుకంటే వారికి కశ్మీరీ చరిత్ర తెలుసు కాబట్టి.

ఇప్పటికీ చాలామంది కశ్మీరీ పండితుల, ముస్లిముల కుటుంబాల మధ్య రాకపోకలు, ఇచ్చి పుచ్చుకోవటాలు జరుగుతున్నాయి. నిన్న మొన్న చనిపోయిన కశ్మీరీ మిలిటెంట్లు రియాజ్ నైకూ, బుర్హాన్ వానిలు కూడా కశ్మీరీ బ్రాహ్మలు లోయకు తిరిగి రావాలని వాళ్ల వీడియో సందేశాల్లో కోరారు. అయితే ఇరువైపుల కొత్త తరాల వాళ్లు ఈ సయోధ్యనూ, సన్నిహితత్వాన్ని అర్థం చేసుకోలేక పోతున్నారు. అనుపమ ఖేర్ లాంటి కశ్మీరీ పండితులు ప్రభుత్వ అల్ట్రా హిందూ నేషనలిజాన్ని మోస్తూ రెచ్చగొడుతున్నారు. యువతరం తెలిసో, తెలియకో వారిని అనుసరిస్తుంది.

అయితే కశ్మీరీ పండితులకు లోయలో పునరావాసం గురించి బిజెపినే నోరు ఎత్తటం లేదు. ఈ విషయంలో లోక్ సభలో కూడా చర్చ జరిగింది. కశ్మీరీ పండితులని ఎవరు చంపారో విచారణ చేయటానికి ఒక్క కమిషన్ ను కూడా వేయలేదు. కశ్మీరీ పండితుల హంతకులను ఎందుకు శిక్షించటం లేదో, ప్రభుత్వాన్ని ఎవరు ఆపుతున్నారో వాళ్లే సమాధానం చెప్పాలి.

ప్రభుత్వానికి ఈ విషయంలో ఆసక్తిలో లేదు. కశ్మీరీ పండితుల పేరుని ఉపయోగించి రాజకీయాలు చేయటం, ప్రజలను రెచ్చగొట్టటమే వాళ్లకు కావాలి

Written by

Rama Sundari

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *