నమస్తే ట్రంప్ vs ఢిల్లీ మర్కజ్

 ‘మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అఫైర్స్’ ప్రకారం దేశవ్యాప్తంగా COVID 19 పాజిటివ్ కేసుల్లో 29.8% మాత్రమే మర్కజ్ తో లింక్ కలిగి ఉన్నాయి. మిగతా 70.5% కేసులన్నీ విదేశాల నుండి వచ్చిన వారి ద్వారా లింక్ కలిగి ఉన్నాయి.

 మర్కజ్ సంఘటన వలన దేశంలో 5 రాష్ట్రాలు మాత్రమే ప్రభావితమయ్యాయి. మిగతా రాష్ట్రాల్లో కరోనా పాజిటివ్ కేసులన్నీ విదేశాల నుండి వచ్చిన వారి ద్వారా వ్యాపించాయి

ఢిల్లీ మర్కజ్ కార్యక్రమం ద్వారా 5 రాష్ట్రాల్లో (ఢిల్లీ, ఉత్తర్ ప్రదేశ్, తెలంగాణ, ఆంధ్ర, చెన్నై) మొత్తం కరోనా పాజిటివ్ కేసులు 22101 అయితే మొత్తం మరణాలు 281

నమస్తే ట్రంప్ కార్యక్రమం జరిగిన గుజరాత్ రాష్ట్రంలో మొత్తం కరోనా పాజిటివ్ కేసులు 8542 మరణాలు 513. అంటే మర్కజ్ కార్యక్రమం ద్వారా ప్రభావితమైన 5 రాష్ట్రాల మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్యలో 40% కేసులు ఒక్క గుజరాత్ లోనే నమోదయ్యాయి.

నమస్తే ట్రంప్ కార్యక్రమం జరిగిన అహ్మదాబాద్ లోనే కరోనా పాజిటివ్ కేసులు 6086 మరణాలు 400. అంటే గుజరాత్ రాష్ట్రం మొత్తం మరణాల్లో 78% ఇక్కడే సంభవించాయి.

ఢిల్లీ మర్కజ్ కార్యక్రమం ద్వారా ప్రభావితమైన 5 రాష్ట్రాల్లో మొత్తం COVID 19 ద్వారా సంభవించిన మరణాలు 281 అయితే…

నమస్తే ట్రంప్ కార్యక్రమం ద్వారా ప్రభావితమైన ఒక్క గుజరాత్ రాష్ట్రంలో సంభవించిన మరణాలు 513. అంటే మర్కజ్ కార్యక్రమం ద్వారా ప్రభావితమైన 5 రాష్ట్రాలలో సంభవించిన మొత్తం మరణాల సంఖ్యలో 55% మరణాలు ఒక్క గుజరాత్ లోనే నమోదయ్యాయి.

ఢిల్లీ మర్కజ్ కు వెళ్లొచ్చిన వారిలో 90 % పైగా ‘నెగిటివ్’ తేలారు… వెళ్లొచ్చిన వారిలో ఈనాటికీ పట్టుమని పదిమంది చనిపోయింది లేదు.

దీనిని బట్టి కరోనా వ్యాప్తి vs మరణాల రేటు విషయంలో నష్టం ఎక్కువగా జరిగింది మర్కజ్ కార్యక్రమం ద్వారానా? లేదా నమస్తే ట్రంప్ కార్యక్రమం ద్వారానా?

జనవరి 30 నే WHO ‘కరోనా గ్లోబల్ ఎమర్జన్సీ’ ప్రకటించిన తరువాత ఢిల్లో మర్కజ్ లో 2000 మంది గుమిగూడటం నేరమైనప్పుడు…

నమస్తే ట్రంప్ కార్యక్రమానికి అహ్మదాబాద్ స్టేడియంలో ఐదు లక్షల మంది గుమిగూడటం పుణ్య కార్యమా?

కానీ మీడియా ఇలాంటి సత్యాలన్నీ బయటపెట్టటానికి బదులు కరోనా వ్యాప్తికి కారణం మర్కజ్ కార్యక్రమం అంటూ పదే పదే వండి వార్చటంలో కారణం ఏమిటి? అంటే నమస్తే ట్రంప్ కార్యక్రమం ముస్లిముల ద్వారా పెట్టబడకపోవటమా?

సరే ఇలాంటి సత్యాలు మీడియా చెప్పనప్పటికీ చాలా మంది చదువుకున్న వారు ఆలోచనాపరులు ఎందుకు గ్రహించలేకపోతున్నారు? మీడియా మతచిచ్చుకు ప్రభావితమైన చాలా మంది కొందరు మర్కజ్ ముస్లిముల ద్వారా తెలిసో తెలీకో పొరపాటుగా జరిగిన కార్యక్రమానికి దేశవ్యాప్త ముస్లిం సమాజాన్ని బాధ్యులు చేసి వారి పట్ల ధ్వేషాన్ని ప్రదర్శించటం మానవత్వం అనిపించుకుంటుందా?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *