కరోనా విషయంలో ఎవరో కొందరు ముస్లిములు చేసిన పొరపాటుకు మొత్తం ముస్లిం సమాజాన్ని అనవసరంగా నిందించవద్దని కోరుతుంది ఎవరో కాదు RSS చీఫ్ ‘మోహన్ భగవత్’
ఇక తబ్లిక్ జమాత్ కార్యక్రమాన్ని ఉద్దేశిస్తూ ముస్లిం సమాజంలో ఎవరో కొందరు తబ్లిక్ జమాత్ ముస్లిములు పొరపాటుగా పెట్టుకున్న సమావేశాన్ని బట్టి మొత్తం ముస్లిం సమాజాన్ని నిందించటం సరికాదని, దేశంలో ఉన్న 130 కోట్ల ప్రజలు ఒకరికోరు సోదరుల్లాంటివారని, అటు హిందూ సమాజంలో ఇటు ముస్లిం సమాజంలో అనుభవజ్ఞులు ముందుకు వచ్చి ప్రజల్లో పాతుకుపోయిన పక్షపాత ధోరణితో కూడిన అపార్థాలను తొలగించటానికి ప్రయత్నించాల్సిందిగా కోరారు.
నేడు ముస్లిం సమాజంలో ఎవరో కొందరు ముస్లిములు చేసిన పొరపాటుకు మొత్తం ముస్లిం సమాజంపై నీలాపనిందలు వేస్తున్న కొందరిని చూస్తుంటే… కనీసం RSS చీఫ్ భగవత్ కు ఉన్నంత విశాల బుద్ధి కూడా లేదనిపిస్తుంది
కనీసం ఈయనకున్నంత విశాలత కూడా కొందరికి లేదా?
