కరోనా కరాళ నృత్యం చేస్తున్న వేళ రెక్కాడితే గానీ డొక్కాడని ఎందరో పేదల పైకి చెప్పుకోలేని ఆకలి బాధలు వర్ణనాతీతం. ఇలాంటి వారి ఆకలి బాధను చూసి దేశవ్యాప్తంగా ఎందరో హిందూ, ముస్లిములు మతాలకతీతంగా తమకు ఉన్న వనరుల పరిధిలో సేవలు చేస్తున్నారు. అన్నిటికంటే ముఖ్యంగా చెప్పుకోతగ్గ విషయం కర్ణాటక, కోలార్ లో ఓ ఇద్దరు ముస్లిం యువకులు తాము ఉన్న ప్రాంతంలో దాదాపు 2000 పేద కుటుంబాలు ఎదుర్కుంటున్న ఆకలి బాధలు చూసి తట్టుకోలేక తమకు ఉన్న 25 లక్షల ఆస్తిని అమ్మేసి, వారికి ఇంట్లో కావలసిన బియ్యం, కిరాణా సామాన్లే కాక సానిటైసర్లు, మాస్కూలు కూడా కొనిచ్చి వారి ఆరోగ్యమే కాక వారి ఆకలి బాధలు తీర్చే పని చేస్తున్నారు. పోనీ, వారేమన్నా కోటీశ్వరులా అంటే అదీ కాదు కేవలం మధ్యతరగతి యువకులు మాత్రమే!
ఇలాంటి వార్తలు ప్రధాన స్రవంతి మీడియాలో రావు. ముస్లిములు డాక్టర్ల పై ఉమ్మేశారు, నగ్నంగా తిరిగారు, రూపాయి నోట్లకు ఉమ్ములు అంటిస్తున్నారు, ఆహార పదార్థాలపై ఉమ్ముతున్నారు, కరోనా వ్యాపించటానికి ప్లేట్లు, గరిటెలు నాకేస్తున్నారు అంటూ ఎప్పటివో సంబంధం లేని వీడియోలు జతచేసి, కొన్ని అబద్ధ వార్తలు సృష్టిస్తే మటుకు అవి నిజమా? కాదా? అన్న కనీస ఆలోచన చేయకుండా … అమ్ముడుపోయిన కొన్ని మీడియా ఛానెల్స్ వాటిని ఉదయం సాయంత్రం అవిశ్రాంతంగా ప్రసారం చేసేస్తే… అవి పట్టుకుని మెదడు మోకల్లోకి వచ్చేసిన మతోన్మాదులు కోతికి కొబ్బరి చిప్ప దొరికినట్టు సోషల్ మీడియాలో చెలరేగిపోతారు.
ఇక్కడ గమనించాల్సింది- ఏ వర్గంలోనూ అందరూ చెడ్డోళ్లే ఉండరు ఏ వర్గంలోనూ అందరూ మంచోల్లే ఉండరు. కొందరు మూర్ఖులూ ఉంటారు కొందరు మంచోళ్లూ మానవత్వం ఉన్నోళ్లూ ఉంటారు. అప్పుడే అది మానవ సమాజం అవుతుంది. కానీ ఎవరో కొందరు చెడ్డోళ్లను పట్టుకుని ఆ వర్గం అంతా అలాంటి వారే అని తీర్మానించటానికి మించిన మూర్ఖత్వం మరొకటి ఉండదు. ఈనాడు ముస్లిములే కరోనాను వ్యాపింపజేశారన్న అపవాదులు లేవనెత్తేవారు కళ్ళు తెరచి చూడాలి ఎంతమంది ముస్లిములు తమకున్నపరిధిలో పేదల ఆకలి కష్టాలు తీర్చటానికి ఎన్నేసి త్యాగాలు చేస్తున్నారో. అందులో ఒకటి నేను ఈ పోస్టులో ప్రస్తావించిన ముస్లిం యువకుల త్యాగం నిజంగా అభినందనీయం.
#Link:
https://www.siasat.com/family-sells-property-feed-hungry…/
ముస్లిములు కరోనా జిహాద్ చేస్తున్నారని వెక్కిరిసున్న వారిలో ఎంతమంది ఇలాంటి సాహసం చేశారు?
