ఏది చట్టబద్ధం? ఏది చట్ట విరుద్ధం?

లాక్ డౌన్ కు ముందు మార్చ్ 13-15 మధ్య ఏ ఆంక్షలు లేని సందర్భంలో జరిగిన అధ్యాత్మిక కార్యక్రమం ఒకటైతే…

లాక్ డౌన్ తరువాత మార్చ్ 25 అనంతరం “సామాజిక దూరం” పాటించాలని ప్రభుత్వం ఆంక్షలు విధించిన తరువాత జరిగిన అధ్యాత్మిక కార్యక్రమం రెండవది…

ఈ రెండింటిలో ఏది చట్టబద్ధం? ఏది చట్ట విరుద్ధం? ఓ ప్రక్క “సామాజిక దూరం” ముస్లిములు తుంగలో తొక్కేసారని, వారి కారణంగానే దేశంలో కరోనా వ్యాపించేసిందని తెగ గోలపెడుతున్నవారు అదే “సామాజిక దూరాన్ని” తుంగలో తోక్కెసి, ఎటువంటి అధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహించరాదని ప్రభుత్వం విధించిన ఆంక్షలను పెడచెవిన పెట్టి నిర్వహిస్తున్న రాములోరి కళ్యాణం చట్టబద్దమే అని చెప్పగలరా?

అంటే ఒకరి మతాన్ని బట్టి ఒక చట్ట విరుద్ధమైన విషయం, మరొకరి మతాన్ని బట్టి చట్టబద్ధం అయిపోతుందా?

పోనీ, రాములోరి కళ్యానానికి హాజరైన వారిలో ఎంతమందికి కరోనా ఆల్రెడీ ఉందో లేదో ఎలా తెలుస్తుంది? దాని లక్షణాలు బయటపడటానికి 15 రోజులు పడుతుంది. అది తెలియకే కదా ఢిల్లీ నిజాముద్దీన్ సభకు అనేక మంది ముస్లిములు హాజరైంది. అక్కడ హాజరైన వారికి కూడా తెలియదు తాము కరోనా బారిన పడ్డామని. ఇక్కడకు వచ్చాక 15 రోజుల తరువాత గానీ తమకు కరోనా ఉందని వారు తెలుసుకోలేకపోయారు.

ఖర్మ కాలి రేపన్నరోజు రాములోరి కళ్యాణ మహోత్సవంలో హాజరైన వారి ద్వారా కరోనా వ్యాపిస్తే గనుక ఇప్పుడు ముస్లిములను విమర్శిస్తున్న వారు అదే స్టాండ్ ను తమ తోటి హిందువులపై విమర్శించటానికి తీసుకోగలరా?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *