“బేటీ బచావ్” అన్నది కూడా మత ప్రాతిపదిక మీదేనా?

“బేటీ బచావ్” (అమ్మాయిని కాపాడండి) అన్న బీజేపీ స్లోగన్ కేవలం హిందూ బేటీలకే వర్తిస్తుందా? అందులోను కేవలం బీజేపీ భజన భక్త సమాజానికి చెందిన బేటీలకే వర్తిస్తుందా? లేక కుల, మతాలకతీతంగా అందరు బేటీలకు వర్తిస్తుందా? అబ్బే, బీజేపీ కేవలం ఒక కులానికో మతానికో పట్టం కట్టే పార్టీ కాదని సిగ్గు విడిచి ఎవరైనా చెప్పటానికి సాహసిస్తే జామియా మిలియా యూనివర్సిటీకి చెందిన మహిళా విద్యార్థుల పై పోలీసులు చేసిన దౌర్జన్యం వినటానికే రోత పుట్టేలా ఇంటర్నల్ బ్లీడింగ్ అయ్యేంతగా వారి ప్రయివేట్ పార్ట్స్ పై బూటు కళ్ళతో తన్ని లేవటానికి కూడా అవకాశం లేకుండా చేసిన వైనాన్ని దేశం మొత్తం చూసింది దీనికి సమాధానం ఏంటి?

ఇది ఏ రకమైన బేటీ బచావ్ అవుతుందో అర్థం కావటం లేదు! పైగా ఈ “బేటీ బచావ్ స్లోగన్ ప్రచారానికి ఒక్క 2016-17 కు బీజేపీ కేటాయించింది 348 కోట్లు.

తీవ్రవాదాన్ని అరికట్టటానికి ప్రభుత్వం, పొలిసు వ్యవస్థ పనిచేస్తుంది. బేటీ బచావ్ అన్న స్లోగన్ ప్రచారం చేసే ప్రభుత్వమే ఆదేశ మహిళలపై ఇలా తిరుగుబాటు చేయించే అరుదైన దృశ్యాన్ని బహుశా ప్రపంచ చరిత్రలో ఏ దేశంలోనూ చూడలేమేమో!

ఇలా మత వివక్ష చూపుతూ ప్రజలను హింసించే దుర్మార్గ మతోన్మాదవాదులు, వారి దుర్మార్గతను సపోర్ట్ చేస్తూ పైశాచిక ఆనందం పొందే మతోన్మాద జాతి ఏ విధంగా బాగుపడుతుంది? సిగ్గుపడాల్సిన విషయం ఏమిటంటే బేటీ బచావ్ అన్న స్లోగన్ ప్రచారమయ్యే దేశం నేడు స్త్రీలకు అత్యంత ప్రమాదకర దేశాల్లో మొదటి స్థానంలో ఉండటం!

ఇంత హీన స్థితిలో నైతిక విలువలు దిగజారిపోయి, ఆర్ధిక స్థితి సంకనాకిపోతున్నప్పటికీ, మా పువ్వు పార్టీ ఉండబట్టే హిందుత్వం దేశమంతా వ్యాపిస్తుంది అని సంకలు గుద్దుకునే కొందరు మతత్వవాదం తలకు బాగా పట్టినోల్లు ఇప్పటికైనా మేల్కోవాలి ఒక దేశ ప్రభుత్వం ఉండేది ఆ దేశ ప్రజల రక్షణకు దేశాన్ని ఆర్థికంగా అభివృద్ధి చెయ్యటానికే తప్ప మతాలు, మంత్రాలు నేర్పుతూ గుళ్లు గోపురాలు కట్టించి జనాల చేత చక్కభజన చేయించటానికో రామకోటి రాయించటానికో కాదని

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *