షాహీన్ బాగ్

షాహీన్ బాగ్ – దేశవ్యాప్తంగానే కాక ప్రపంచవ్యాప్తంగా గత నెలన్నరకు పైగా మార్మోగుతున్న పేరు. కొందరు “సన్నాసుల కడుపులో మంట పుట్టిస్తున్న పేరు. కారణం అక్కడ నిరంతరాయంగా వందల కొద్దీ స్త్రీలు మత వివక్ష ఆధారంగా తయారు చెయ్యబడిన పౌరసత్వ సవరణ చట్టాలకు (CAA/NRC) వ్యతిరేకంగా ఉద్యమం చెయ్యటం.

ఈ ఉద్యమం తాలూకు ప్రభావంతో కొందరు సన్నాసుల కడుపుమంట ఏ స్థాయికి చేరుకుందంటే అక్కడ కూర్చున్న స్త్రీలు కేవలం 500 ల రూపాయలకు ఆశపడి ఉద్యమం చేస్తున్నారని దిగజారుడు మాటలు మాట్లాడే స్థితికి వారు వచ్చేశారు.

కాస్త మానవత్వం, లాజికల్ మైండు ఉన్నోల్లు గమనించాల్సింది…

ఏదైనా ఒక అంశంపై కొందరు వ్యక్తులు ప్రభావితం అవ్వటం, ఆ ప్రభావాన్ని తమ తోటివారిపై వెయ్యటం, ఆ అంశం వైపు రోజుల తరబడి ఒక జన సమూహాన్ని ఉధ్యమించేలా నడిపించటం అన్నది మామూలు విషయం కాదు! ఎంతో బలమైన ప్రేరకాలు ఉన్నప్పుడే, ఆ అంశం యొక్క ప్రాధాన్యత ఎంతో బలంగా ఉన్నప్పుడు మాత్రమే కొందరు వ్యక్తులు ఒక సమూహంగా ఏర్పడి ప్రాణాలకు తెగించి అయినా ఉధ్యమించగలరు. అలాంటి అభ్యుదయ భావాలేవీ కొందరు చవకబారు రాజకీయాలు నడిపే నాయకులలో ఉండవు కాబట్టి తమ మీటింగుల్లో, ర్యాలీల్లో కొంతమంది ఆర్టిస్టులను మాట్లాడుకుని ఓ 500 రూపాయలు, బిర్యానీ పేకెట్టుకు ఆశ చూపి, ఓ అర పూట తమ వెంట తిప్పుకుంటారు. ఆ 500 వందల రూపాయలకు, బిర్యానీ పేకెట్టుకు కకృత్తి పడేవారు సైతం ఎప్పుడు ఈ తంతు ఖతం అయిపోద్దిరా దేవుడా అన్నట్లు వాడిపోయిన ముఖాలతో, లోలోపల తమను ఎండలో తిప్పుతున్న ఆ రాజకీయ నాయకుణ్ణి అమ్మానా బూతులు తిట్టుకుంటూ కాస్సేపు తిరిగి ఎవరి ఇళ్లకు వారు వెళ్లిపోతారు.

ఇలా జనాల్ని 500 రూపాయలు ఇచ్చి తమ వెంట తిప్పించుకునే కొందరు దాగుల్బాజీ రాజకీయ నాయకుల కళ్లకు పెద్దగా అభ్యుదయ భావాలతో పరిచయం ఉండదు కనుక నిజంగా ఎవరైనా కొందరు తమ హక్కుల కోసం పోరాడుతున్నా కూడా వారేదో 500 రూపాయలకు కకృత్తిపడి ఉధ్యమిస్తున్నవారిలానే కనపడుతుంటారు. ఎందుకంటే ఎన్నో సార్లు 500 రూపాయలు ఇచ్చి డూప్లికేట్ సపోర్టర్స్ ని తమ వెంట తిప్పుకోవటం ఆ సన్నాసి రాజకీయ నాయకులకు అలవాటు కాబట్టి. ఇప్పుడు అలాంటి దివాళాకోరు భావజాలం కలిగిన కొందరు సన్నాసులు షాహిన్ బాగ్ లో NRC/CAA లకు వ్యతిరేకంగా గత నెలన్నర నుండి ఎండ, చలి, వానను పట్టించుకోకుండా నిరంతరాయంగా పోరాడుతున్న స్రీలను ఉద్దేశిస్తూ 500 రూపాయలు తీసుకుని ఉధ్యమిస్తున్నారని, వారు అలా ఉధ్యమం చేయటానికి కోట్ల రూపాయలు విదేశాల నుండి వచ్చేస్తున్నాయని, వారి మగాళ్లు ఇళ్లల్లో కూర్చుని ఆడోళ్లను రోడ్డుమీద కోర్చోబెట్టారని చావబారు మాటలు మాట్లాడుతున్నారు. వారు నడిపే వాట్స్ యాప్ యూనివర్సిటీలో ట్రైనింగ్ తీసుకునే వానర సైన్యం సైతం ఇవే చిల్లర డైలాగులతో సోషల్ మీడియాలో రెచ్చిపోతున్నారు.

సరే, కాస్సేపు వారంతా 500 రూపాయలకు ఆశపడే ఉద్యమం చేస్తున్నారనుకుందాం…

కేవలం ఏదో 500 రూపాయలకు కకృత్తి పడేవారు ప్రాణాలకు తెగించి అదీ కూడా స్త్రీ మూర్తులు పోరాడతారా? అన్నది ఆలోచన చెయ్యాల్సినా అంశం. ఓ ప్రక్క అమిత్ షా కను సైగల్లో నడుస్తూ ఏమీ చెయ్యలేక ప్రేక్షక పాత్ర వహిస్తున్న ఢిల్లీ పోలీసులు, తమ చుట్టు ప్రక్కా అవకాశం దొరికితే “గుజరాత్ మోడల్ జెనోసైడ్” నిర్వహించి ఒక్కసారిగా హత్యాచారాలు చేసి లేపేద్దామని తహతహలాడుతూ మాటు వేసుకుని కూర్చున్న కాషాయ మతోన్మాదులు, “గోలీ మారో ఇస్ దేశ్ కే గద్దారోంకో (కాల్చి పారేయండి ఈ దేశ ద్రోహులను)” అని, “హంకో ఓట్ దియే తో షాహీన్ బాగ్ నహీ రహేగా (మా పార్టీకి ఓటు వేస్తే షాహీన్ బాగ్ ఉండదు)” అని రెచ్చగొడుతున్న మతోన్మాద రాజకీయనాయకులు, ఆ రాజకీయ నాయకుల నినాదాలకు ప్రభావితం అయి డైరెక్టుగా పిస్టల్ పట్టుకుని, జై శ్రీరామ్ నినాదాలు చేసుకుంటూ తమను కాల్చటానికి మీదకు ఎగేసుకొస్తున్న రాంభక్త్, కపిల్ గుజ్జర్ లాంటి గాడ్సే శిష్యులు

ఇన్నేసి ఆటంకాలను, ప్రమాదాలను కళ్ల ముందు పెట్టుకుని, ఎండా, వానా, ఎముకలు కొరికే చలిని తట్టుకుని, ఎన్నో విమర్శలను పట్టించుకోకుండా రాత్రనకా, పగలనకా వందల కొద్దీ స్త్రీలు ఉధ్యమించటం అసలు సాధారణ విషయమేనా? అందులో కూర్చున్నవారిలో ఎందరో స్త్రీల కుటుంబాలు రెక్కాడితే గానీ డొక్కాడని పరిస్థితి, చిన్న పిల్లలకు పాలుపట్టించే స్త్రీలు, ఎనభై ఏళ్లకు పైబడి నడవలేని ముసలి వారు, కాలేజ్ స్టూడెంట్లు ఇలా ఎందరో మహిళలు పైగా తినటానికి సరైన తిండి లేక మల మూత్రాల అవసరాలు తీర్చుకోవటానికి సరైన వసతులు లేక ఇన్నేసి ఇబ్బందుల్లో రోజుల రోజుల తరబడి ఉద్యమం చెయ్యటం వెనుక బలమైన ప్రేరకం ఉంటే తప్ప సాధ్యమవ్వదు.

చివరిగా ఒకమాట నిజంగా షాహిన్ బాగ్ లో వేలల్లో కూర్చుని ఉద్యమం చేస్తున్న స్త్రీలంతా కేవలం 500 రూపాయల డబ్బుకు ఆశపడి కుర్చున్నారనుకుందాం అయితే అదే 500 రూపాయల డబ్బు ఆశ చూపించి పౌరసత్వ సవరణ చట్టాన్ని సమర్ధించే ముస్లిం స్త్రీల సమూహాన్ని ఒకటి తయారు చేయించి ఓ సమాంతర ఉద్యమం నడపొచ్చుగా సాధ్యమైతే! అది సాధ్యపడదు ఏ నిజ ముస్లిం డబ్బుకు తన విశ్వాసాన్ని అమ్ముకోడు కాబట్టి అది సాధ్యం కాదు కనుక చవకబారు విమర్శలు చెయ్యటం, వెక్కిరించటం, అవహేళన చెయ్యటం ఒక్కటే ఇప్పుడు మిగిలి ఉన్న ఆప్షన్. మొత్తానికి ఈ షాహీన్ బాగ్ ఉద్యమం విజయవంతంగా ఓ కొలిక్కి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *