ఎప్పుడు చూసినా పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, బంగ్లాదేశ్ హిందువులు, కాశ్మీరీ పండిట్లు ఇవేనా కనపడేవి శ్రీ లంక హిందువులు హిందువులు కారా? బిజేపి కాశ్మీరీ పండిట్లు మాత్రమే హిందువులా? శ్రీలంకలో 1983 నుండి 2009 సం. ల మధ్య హిందువులపై సింహళ బౌద్ధులు చేస్తూ వచ్చిన సామూహిక హత్యాకాండ (Genocide) లో అతి క్రూరంగా చంపబడ్డ హిందువులు దాదాపు 1. 6 నుండి 1. 9 లక్షల మంది ఉన్నా రన్న వాస్తవం కాశ్మీరీ పండిట్ల గురించి గుండెలు బాదుకునే ఎంత మంది కట్టర్ హిందూ భక్తులకు తెలుసు? ఎంతసేపు కాశ్మీరీ పండిట్ల గురించి అంత బాధ పడిపోయే బీజేపీ పోనీ వారిని ఏదైనా బాగుపరచింది ఉందా అని ప్రశ్నించుకుంటే స్వయంగా కాశ్మీరీ పండిట్లే మోడీ ప్రభుత్వం తమను కాపాడే విషయంలో పూర్తిగా విఫలం అయిపోయిందని, మోడీ ప్రభుత్వ హయాములో సర్వం కోల్పోయామని గగ్గోలు పెడుతున్నారు. దాని తాలూకు లింకును ఈ క్రింది గమనించగలరు.
https://www.indiatoday.in/…/kashmiri-pandit-exodus-modi…
బీజేపీని ప్రాణప్రదంగా ప్రేమించే కట్టర్ హిందూ భక్తులు తెలుసుకోవలసిన మరొక వాస్తవం ఏమిటంటే 1971 నుండే శ్రీలంకలో 2. 55 మిలియన్ల హిందువులు సింహళ బౌద్ధుల చేతిలో తీవ్ర అణచివేతకు గురవుతూ వచ్చారు. కేవలం 26 ఏళ్ల వ్యవధిలో లక్షల కొద్దీ హిందువులు వారి చేతిలో చంపబడుతూ వచ్చారు. ఎన్ని సార్లు వారు భారత దేశ పౌరసత్వం కోసం ఇక్కడి ప్రభుత్వాలను వేడుకున్నా వారి ఆర్తనాదాలు ఎడారిలో పోలికేకలు గానే మిగిలిపోయాయి. అయినా ఆ హిందువుల చావులు బీజేపీ ప్రభుత్వానికి చావులుగా కానరాకపోవటానికి కారణం వారిని అణచివేతకు గురిచేస్తుంది చంపుతుంది ముస్లిములు కాకపోవటం! వారి చావులు హిందూ vs ముస్లిం రాజకీయాలు నడపటానికి పనికి రాకపోవటం!! శ్రీలంక హిందువుల జనహననానికి (Genocide) కి సంబంధించిన మరింత సమాచారం కొరకు ఈ క్రింది లింక్ ను క్లిక్ చేసి చదువగలరు.
https://www.outlookindia.com/…/opinion-the…/344208
నిజంగా బీజేపీకి హిందువులపై అంత అభిమానమే ఉంటే అదేదో గడిచిన అనేక సంవత్సరాలలో రామ్ మందిర్ బాబ్రీ మసీదు అంటూ ఎందుకూ పనికిరాని రాజకీయాలు చేసే బదులు పాక్, బంగ్లా, ఆఫ్ఘన్ హిందువులను కాపాడి, శ్రీలంక హిందువులను కూడా ఇక్కడకు రప్పించి ఎప్పుడో వారి ప్రాణాలు కాపాడి ఉండేది. అదే చేసి ఉంటే లక్షల్లో శ్రీలంక హిందువుల ప్రాణాలు కాపాడబడి ఉండేవి కావా?
ఈ టాపిక్ అంతా చదివి ఏ బిజెపి భజన భక్తుడైన చెప్పేది ఒక్కటే “శ్రీలంక ఇష్యూ వేరండి! వారు దౌర్జన్యానికి గురికాబడుతుంది మత పరంగా కాదు” అని!! ఆ విధంగా వారు బ్రెయిన్ వాష్ చేయబడ్డారు కాబట్టి వారు అలా మాట్లాడటంలోనూ తప్పులేదు. ఆలోచించాల్సిన విషయం మత పరమైన దౌర్జన్యానికి గురైన హిందువుల ప్రాణాలకే విలువ ఉంటుందా? వేరే ఏ విధంగా దౌర్జన్యానికి గురై లక్షల్లో చంపబడినా అలాంటి హిందువుల ప్రాణాలకు విలువే లేదా? చిత్రం ఏమిటంటే హిందువులకు పౌరసత్వం ఇవ్వక వారిని హింసించి చంపుతున్నారు బౌద్ధులకు బీజేపీ CAA ద్వారా భారతదేశ పౌరసత్వం కల్పించటం.
