గో (మాతల) హంతకులు” ముస్లిములా?

సోషల్ మీడియాలో కనపడే కొన్ని కామెడీ జోకులు తెగ నవ్వు పుట్టిస్తూ ఉంటాయి. అలాంటి వాటిలో ఈ మధ్య కడుపుబ్బ నవ్వించిన ఓ జోక్ వాట్స్ యాప్ క్లిప్పింగ్ ద్వారా నా కంట పడింది. దాని హెడ్డింగు: “గో హత్య నిషేధం: పోలీసులు”! ఈ హెడ్డింగు చూడగానే – కొంపతీసి భారత దేశంలో ముస్లిం పేర్లు పెట్టుకుని కొందరు హిందువులు నడుపుతున్న గోవధ శాలలు బంద్ అయిపోతున్నాయేమో, పోనీలే స్లాటర్ హౌసుల్లో హిందువులు పెట్టే హింసాత్మక చావుల నుండి గోమాతలకు రిలీఫ్ దొరుకుతుందని కొండంత ఆనందంతో, ఎంతో సంతోషంతో ఉబ్బితబ్బిబైపోయి న్యూస్ చదవగానే నా ఆశలన్నీ ఇట్టే అడియాశలైపోయాయి! పాపం గోమాతలకు ఇక మంచి రోజులు రావనిపించింది! ఇంతకూ ఆ న్యూస్ ఏమిటంటే- “బక్రీదు పండగను పురస్కరించుకుని పట్టణంలో గోవధ (బ్రాకెట్టులో- గో హత్య!) చేయరాదని పోలీసులు హెచ్చరించారు. అలాచేస్తే చట్ట ప్రకారం చర్యలు తీసుకోవటం జరుగుతుంది!” అన్నది.

చిత్రం ఏమిటంటే ప్రతీ సంవత్సరం గోవధ అన్న ఇష్యూను ఏదో మూల రేకెత్తించి, ముస్లిములను బోనులో నిలబెట్టటం అన్న తంతు జరగటం పరిపాటి అయిపోయింది. నిజానికి నేను చదివిన వార్తను ఖండించటం లేదు అలాగని బీఫ్ పనిగట్టుకుని తినే స్పెషల్ ఇంట్రస్తూ లేదు! బక్రీద్ రోజు ఖుర్బానీ అన్నది గోవులను ఇస్తేనే పరిపూర్తి అవుతుందనీ ఎక్కడా లేదు! కొన్ని పట్టణాల్లో పోలీసులు శాంతి భద్రతలను కాపాడే నేపథ్యంలో గోవధ నిషేధించటం వరకు సరే! కానీ నిజానికి ఈ వార్తా ఎలా ఉందంటే- గోహత్యలు చేస్తుంది కేవలం ముస్లిములే అన్నట్టు ఉంది.

హిందూ దేశంలో రక్షణ కోల్పోతున్న “గోమాత!”

బాధాకరమైన విషయం ఏమిటంటే- గోహత్యలు చేస్తున్నది, గోమాసం విస్తారంగా ఎగుమతి చేస్తుంది ముస్లిములు కాదు! కానీ, పైకి ముస్లిం పేర్లు పెట్టుకుని గోమాంసం ఎగుమతి చేస్తున్న సంస్థలు హిందువులవన్నది గోరక్షకులు తెలుసుకోవాల్సిన విషయం!

“అల్ కబీర్ ఎక్స్ పోర్ట్స్” (Al Kabeer Exports Pvt. Ltd) ఇది పైకి వినటానికి ముస్లిములకు చెందిన సంస్థలా ఉంది కదూ! నాలుగు వందల ఎకరాల్లో తెలంగాణా రాష్ట్రంలో విస్తరించి ఉన్న భారతదేశంలోనే కొన్ని వందల కోట్ల రూపాయల గోమాంసం ఎగుమతి చేస్తున్న అతిపెద్ద సంస్థ ఇది. దీనిని నడుపుతుంది “సతీష్ సబెర్వాల్” అనే హిందువు.

“అరేబియన్ ఎక్స్ పోర్ట్ లిమిటెడ్ (Arabian Exports Pvt. Ltd) దీని యజమాని “సునీల్ కపూర్” ఇతను ముస్లిం కాదు.

“అల్-నూర్ ఎక్స్ పోర్ట్ లిమిటెడ్” (Al Noor Exports Pvt Ltd) ఈ గోమాంస ఎగుమతి సంస్థ నడుపుతుంది “సునీల్ సూద్” ఇతనూ ముస్లిం కాడు! ఇది ఉన్నది ఎక్కడో కాదు గోరక్షణ పేరుతో ముస్లిములపై దాడులకు తెగబడుతున్న యోగీ ఆధిత్యనాద్” ముఖ్యమంత్రి గా ఉన్న ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రం “షేర్ నగర్” లో అన్నది గమనార్హం.

“AOB Exports Pvt. Ltd” దీనికి యజమాని “అరోరా”! ఇతనూ ముస్లిం కాదు! “Standard Frozen Foods Exports Pvt. Ltd” ఈ గోమాంస ఎగుమతి సంస్థ నడుపుతుంది “కమల్ వర్మ” ఈయన కూడా ముస్లిం కాదు! “Maharashtra Food Processing and Cold Storage Pvt. Ltd” ఈ గోమాంస ఎగుమతి సంస్థ నడుపుతుంది “సన్ని ఖట్టర్” ఇతనూ ముస్లిం కాడు!

భారత దేశంలో ఉన్న అతిపెద్ద ప్రపంచ ప్రఖ్యాత గో మాంస ఎగుమతి కంపెనీలు 6 ఉంటే అందులో 4 హిందు బ్రాహ్మిణ్ లకు చెందినవే కావటం గమనార్హం! ముఖ్యంగా తమిళ్ బ్రాహ్మిణ్ కుటుంబానికి చెందిన “ఇందిరా కృష్ణ మూర్తి నూయి” గురించి మీరు తెలుసుకోవాలి. ఈమె పెప్సీకో CEO. అంతే కాదు దాని అనుబంధ సంస్థ అయిన “మెటడోర్” ద్వారా అమెరికాలో విస్తారంగా గోమాంసం ఎగుమతి చేస్తున్న ఈ కంపెనీని నడుపుతుంది ఈ తమిళ బ్రాహ్మిణ్ అయిన “ఇందిరా కృష్ణ మూర్తి నూయి”!

ఈ దిక్కుమాలిన తతంగమంతా తెలియని కొందరు తామేదో గోమాతలను కాపాడే హీరోలు, వాటిని తింటున్న మైనార్టీలందరూ విలన్లు అన్నట్టు తెగ ఫీలైపోయి “గొరక్షక్ దళ్” అనే ఓ పేరు తగిలించుకుని ముస్లిములపై, దళితులపై పశువుల్లా మీద పడి వారిని హింసించటం, చంపటం, వారి గెడ్డాలు పట్టుకు లాగి జై శ్రీరామ్ బోల్ అని చెప్పించటం, వారి ఆడోళ్లను చెప్పులతో కొట్టించటం వగైరా పనికిమాలిన ఫీట్లు చేస్తూ ఉంటారన్నమాట! “ఉగ్రవాదం” అన్నపదానికి అర్థం- “ప్రజలను భయకంపితులను చెయ్యటం” గో రక్షణ పేరుతో ప్రజలను చంపుతున్నవారిని, హింసిస్తున్నవారిని “గో రక్షక్ ఉగ్రవాద మూకలని” లేక “హిందుత్వ టెర్రరిజం” అని చెప్పటంలో సందేహమే లేదు!

మరి నేడు ముస్లిమేతర గోమాంస ఎగుమతి సంస్థల్లో జరుతున్న“గోహత్యలు” నేటి గొరక్షకుల కళ్ళకు కనపడటం లేదా?

గోరక్షణ నిజంగా చెయ్యాలనుకుంటే గోమాంసం తినటాన్ని అరికట్టాలా? లేక గోమాంసం ఎగుమతిని అడ్డుకోవాలా? గోవులపై అంత ప్రేమే ఉంటే ముస్లిములను టార్గెట్ చెయ్యటం కాదు గోమాంసం ఎగుమతి చేసే సంస్థలపై దాడులు చెయ్యాలి.
ఈ గోరక్షక్ మూకలు ఒట్టి గుడ్డోల్లని చెప్పటానికి మరో బలమైన ఆధారం- ప్రపంచ వ్యాప్తంగా బ్రెజిల్ 18.55 మెట్రిక్ టన్నుల గోమాంసం ఎగుమతి చేస్తుంటే భారతదేశం 18.50 మెట్రిక్ టన్నుల గోమాంసం ఎగుమతి చేస్తూ రెండవ స్థానంలో నిలిచింది! ఇదీ నేడు కొన్ని హిందూ గోమాంస సంస్థలు గోమాతలకు పట్టించిన గతి! కేవలం 2015-16 మధ్య 26 వేల 682 కోట్ల రూపాయల ఆవు మాంసం ఎగుమతి అయిందని సమాచారం. వివరంగా చెప్పాలంటే ప్రపంచ వ్యాప్తంగా ఆవు మాంసం ఎగుమతి చేయటంలో బ్రేజిల్ తరువాత రెండవ అతిపెద్ద దేశం మన భారత దేశమే!


పోనీ బక్రీద్ రోజు ముస్లిములంతా కలిసి లక్షల కొద్ది ఆవులను హింసించి చంపి, టన్నుల కొద్ది ఆవు మాంసం ఎగుమతి చేస్తూ కోట్లరూపాయలు సంపాదించేస్తున్నారా అంటే ఆ రోజు తామిచ్చిన బలిదానంలో మూడు భాగాలు చేసి ఒక భాగం బంధు, మిత్రులకు, ఒక భాగం పేదలకు, ఒక భాగం స్వయంగా మాత్రమే తినటం జరుగుతుంది. వాస్తవానికి బక్రీద్ అన్న పండగ అసలు పేరు “ఈదుల్ అజ్హా” అంటే “దానాల పండగ”. అంటే తాము తినే దాంట్లో బీదలు, బంధు మిత్రులను కూడా భాగ స్వాములను చేసి, చేసుకునే దానాల పండగ!

ఇలాంటి ఓ పండగ కూడా ఉంటుందని లక్షల కొద్ది ఆవులను హింసించి చంపి, టన్నుల కొద్ది ఆవు మాంసం ఎగుమతి చేస్తూ కోట్లరూపాయలు గడిస్తున్న హిందూ సంస్థలను వదిలేసి ఎక్కడో కేజీనో, అరకేజీ మాంసమో తినేవారిని పట్టుకుని కొట్టి చంపుతున్న ఈ “గో రక్షక్ ఉగ్రవాద మూకలకు” తెలియదు. ఒకవేళ తెలిసినా ఈ గొరక్షక్ వేలిముద్రగాళ్లు ఆయా గో మాంస ఎగుమతి చేసే కంపెనీల మేయిన్ గేటు కూడా దాటి లోపలకు వెళ్లలేరు! రోడ్ల పై పడి సామాన్య ముస్లిం, దళితులను హింసించటం, చంపటం, జై శ్రీరాం బోల్ అంటూ పిచ్చి కేకలు వెయ్యటం తప్ప.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *