హిందుత్వ ఉగ్రవాదంతోపొరాడి గెలిచిన మహిళ- బిల్కిస్ బానో

2002 లో జరిగిన గుజరాత్ అల్లర్లు ప్రపంచ చరిత్రలో జరిగిన ఘోరమైన ఉగ్రవాద చర్యల్లో ఒకటి. దానిని సింపుల్గా గుజరాత్ అల్లర్లు అని చెప్పేకంటే అప్పటి మోడీ ప్రభూత్వ హయాంలో తెరలేచిన అతి దారుణమైన “హిందుత్వ టెర్రరిజం” అనటమే నూటికి నూరుశాతం సరైనదౌవుతుంది.

ఫిబ్రవరి 27, 2002 వ సంవత్సరంలో ఎంతో దౌర్జన్యంగా బాబ్రీ మసీదు కూల్చిన కరసేవకులు ఎంతో అత్యుత్సాహంతో సబర్మతి ఎక్స్ ప్రెస్ లో ప్రయాణిస్తూ దాదాపు 8 గంటల ప్రాంతంలో గోద్రా వచ్చేసరికి సాంకేతిక కారణాల వల్ల స్టేషన్ కు కిలోమీటరు దూరంలో ఆగిపోయిన ట్రైన్లో లేచిన మంటల్లో చిక్కుకుని 59 మంది కరసేవకులు చనిపోవటం, ఆ తరువాత ఎటువంటి ఇన్వెస్టిగేషన్ జరగకుండానే ఆ సంఘటన జరిగిన వెంటనే అప్పటి ముఖ్యమంత్రి అయిన నరేంద్ర మోడీ ఏమాత్రం ముందూ వెనకా ఆలోచించకుండా ఇది “ముందస్తు పథకం ప్రకారం జరిగిన ఉగ్రవాద చర్య” అన్న ఒక్క డైలాగ్ వదలటం కారణంగా అప్పుడు అశాంతితో వేడెక్కిపోయి ఉన్న వాతావరణం ఒక్కసారిగా ప్రతీకారం దిశగా అడుగులు వేయించింది.

ఫిబ్రవరి 28 వ తరీఖున దాదాపు 20000 మంది ఒకచోట పోగైన హిందూ ఉగ్రవాద మూక పెట్రోల్ సీసాలు, కిరోసిన్ సీసాలు, కత్తులు తీసుకొని ఒక్కసారిగా ముస్లిములపై జైశ్రీరామ్ అన్న నినాదాలతో బహిరంగ దాడికి ఎగబడి, గుల్బర్గా సోసిటీ, నరోడా పటియా ప్రాతాలపై మారణహోమం సాగించటం మొదలెట్టింది. పిల్లలు, ఆడవాళ్లు, పెద్దలు అన్న తేడా లేకుండా దొరికిన వాళ్ళను దొరికినట్లు తెగనరకటం మొదలెట్టింది. ఇళ్ళల్లో ఉన్న వందలకొద్దీ ముస్లిం గృహిణులను, అమ్మాయిలను, ఆడ పిల్లలను రోడ్ల పైకి లాక్కొచ్చి వివస్త్రాలను చేసి అతి దారుణంగా గ్యాంగ్ రేప్ చేసి వారిని సజీవంగా తగలెట్టటం ప్రారంభించింది. అనేకమంది పిల్లలను దారుణంగా చపేయటమే కాక, వందల కొద్దీ పశువులను యాసిడ్ పోసి చపేయటం జరిగింది. వందల కొద్దీ ఇళ్లకు నిప్పంటించింది. ఎటుచూసినా యుద్ధ వాతావరణం అసలు తమను ఎందుకు చంపుతున్నారో తాము ఎందుకు చస్తున్నామో కూడా తెలియని అమాయక ముస్లిం ప్రజానీకం మమ్మల్ని కాపాడండీ అన్న ఆర్తనాదాలతో హాహాకారాలు పెడుతూ అటూ ఇటూ పరిగెడుతూ, హిందుత్వ ఉగ్రవాదుల కత్తి వేటుకు ఒక్కక్కరిగా నెలరాలిపోయారు. వారిని కాపాడటానికి అప్పుడు ఏ పోలీస్ యంత్రాంగం కానీ, రిజర్వుడ్ బలగాలు కానీ దగ్గరకు రాలేదుసరికదా తిరిగి పోలీసులే బాధితులపై తిరగబడ్డారు. ఈ హిందూత్వ ఉగ్రవాద దాడిలో దాదాపు 2000 మంది చనిపోతే వేలమంది నిర్వాసితులయ్యారు. ఓ గర్భవతి పొట్టను కోసి, ఆమె గర్భంలో ఉన్న బిడ్డను లాగిపడెయ్యటానికి మించిన దారుణమైన ఉగ్రవాదం ఎక్కడైనా ఉంటుందా? ఇలాంటి జుగుప్త్సాకరమైన ఎన్నో సంఘటనలు గుజరాత్ హిందుత్వ ఉగ్రవాద దాడుల్లో అలవోకగా జరిగిపోయాయి అనటం అతిశయోక్తి కాదు.

చరిత్రలో అతి జుగుప్త్సాకరమైన దాడిగా వినతికెక్కిన అప్పటి గుజరాత్ హిందుత్వ ఉగ్రవాద దాడిలో తన మూడేళ్ళ కూతురుతో సహా 13 మంది ఉన్న తన కుటుంబ సభ్యులను వెంటబెట్టుకుని, ఆరు నెలల గర్భంతో నెప్పులు పడుతూ అల్లర్లలోనుండి తన ప్రాణాలను కాపాడుకోవాలని ప్రయత్నిస్తున్న 21 ఏళ్ల యువతి అయిన బిల్కిస్ బానో పై హిందూ ఉగ్రవాద మూక ఒక్కసారిగా తెగబడింది. ఆమె ఆరు నెలల గర్భవతి అని కూడా చూడకుండా అతి దారుణంగా ఆమెను వివస్త్రను చేసి ఆమెపై గ్యాంగ్ రేప్ చెయ్యాటమే కాక, ఆమె కళ్ళముందే ఆమె తల్లిని, సోదరిని సైతం గ్యాంగ్ రేప్ చేసి కుటుంబ సభ్యులందరినీ సజీవంగా కాల్చేశారు. ఆమె మూడేళ్ళ కూతుర్ని నేలకేసి కొట్టి దారుణంగా చెంపేశారు.

తరువాత ప్రాణాలతో బయటపడి మిగతా ఆడ వాళ్లలా ఏదో విగతజీవిగా మిగిలిపోయినట్టు కాకుండా తన శక్తినంతా కూడబెట్టుకుని తనపై హిందూ ఉగ్రవాదులు చేసిన దారుణానికి వ్యతిరేకంగా పోరాటం చెయ్యటం మొదలెట్టింది. నిజానికి బీద కుటుంబంలో పుట్టి చదువుకొని బిల్కీస్ బానో లోకానుభవం అంతగాలేని ఓ అమాయకురాలు. అప్పటి రాజకీయ శక్తులకు వ్యతిరేకంగా పోరాడలేక ఎందరో ఆడవాళ్లు మౌనంగా ఉండిపోయినప్పటికీ బిల్కిస్ బానో పోరాటం చెయ్యటం మొదలెట్టింది. తనపై జరిగిన అన్యాయాన్ని వివరిస్తూ పోలీస్ స్ట్రేషన్లో కేసు పెడితే అప్పటి పోలీసులు ఆ హిందుత్వ ఉగ్రవాదుల పేర్లు సైతం రాయటానికి నిరాకరించారు. తరువాత నాన్-గవర్నమెంట్ ఆర్గనైజేషన్ల సహాయంతో కొందరు లాయర్ల సహాయంతో ఆమె పోరాడటం మొదలెట్టింది. ఎంతో తెలివిగా ఆమె న్యాయవాదులు కేసు విచారణను గుజరాత్ వెలుపల చేయాలని నిర్ణయించారు. చివరకు కేస్ విచారణ సుప్రీం కోర్టు వరకు వెళ్లింది. అదే ఎన్నో ఏళ్లుగా నానుతూ వస్తూ దేశవ్యాప్తంగా వార్తల్లో నిలిచిన బిల్కిస్ బానో కేసు ఓ కొలిక్కి వచ్చి విజయం సాధించటంలో కీలక మలుపు తీసుకుంది. నాలుగేళ్ల సుదీర్ఘ విచారణ తరువాత ఇప్పుడు సుప్రీం కోర్టు- ఆమెపై సామూహిక అత్యాచారానికి పాల్పడిన 11 మందిని జీవితకాల ఖైదు ఇవ్వటమే కాక, గుజరాత్ ప్రభూత్వం నష్టపరిహారంగా 50 లక్షలు చెల్లించాలని, ప్రభూత్వ ఉద్యోగం, ఉండటానికి స్వంత ఇల్లు కల్పించాల్సిందిగా సంచలనమైన తీర్పునిచ్చింది. సుప్రీం కోర్టు ఇచ్చిన ఈ సంచలనమైన తీర్పు వాస్తవానికి హిందుత్వ ఉగ్రవాదుల చేతిలో దారుణంగా చెరచబడి చంపబడిన అనేకమంది స్త్రీల తరఫున బిల్కిస్ బానో సాధించిన విజయం అని చెప్పవచ్చు. అంతకు ముందే మార్చిలో గుజరాత్ ప్రభూత్వం బిల్కిస్ బానోకు 5 లక్షలు ముట్టజెప్పి సైలేంట్గా కేస్ క్లోస్ చేయించి ఆమె నోరు నోక్కేయాలని చూసినప్పటికీ, ఆమెకు జరిగిన అత్యంత దారుణమైన నష్టాన్ని దృష్టిలో పెట్టుకొని గుజరాత్ ప్రభూత్వం విసిరే ముష్టికి కకృత్తి పడలేదు. ఇంకా అధిక మొత్తంలో నష్టపరిహారాన్ని కోరింది. ఇది ఆమె హిందుత్వ ఉగ్రవాదంతో పొరాడి గెలిచిన విజయం అని చెప్పవచ్చు.

ఇలాంటి దారుణాలు కళ్ల ముందు జరుగుతున్నప్పటికీ హిందూత్వంలో ఉగ్రవాదం ఎక్కడ ఉంది? అసలు హిందుత్వ వాదుల చేతిలో ఎవరైనా ప్రాణాలు కోల్పోయారా? ముస్లిములందరూ ఉగ్రవాదులు కారు, ఉగ్రవాదులందరూ ముస్లిములే! అంటూ కొందరు సోషల్ మీడియాలో వింతగా అమాయకంగా ప్రశ్నించటం, డైలాగులు వెయ్యటం ఒకింత ఆశ్చర్యానికి గురిచేస్తూ ఉంటుంది. ఇలాంటి అమాయక డైలాగులు వేసేవారికి మాలెగావ్ బాంబు దాడులు, ఆజ్మీర్ షరీఫ్, మక్కా మసీద్ బాంబ్ బ్లాస్ట్ లు నుండీ గుజరాత్ అల్లర్లలో వేలమంది ముస్లిముల ప్రాణాలను గాలిలో కలిపేసిందీ, గోమాత పేరుతో ఎందరినో పొట్టనపెట్టుకుంది హిందుత్వ ఉగ్రవాదులు లేక శాఫ్రాన్ టెర్రరిస్టులే అన్నది తెలిసీ… తెలియానట్లు యాక్టింగ్ చేస్తుంటారో లోక జ్ఞానం లేక మాట్లాడుతుంటారో ఇప్పటికీ అర్థం కాదు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *