నిజమే న్యూజిలాండ్ మసీదులో శుక్రవారం ప్రార్ధనా సమయంలో ఒకడు వచ్చి 49 మందిని నిర్దాక్ష్యనీయంగా కాల్చి చంపేశాడు అన్నప్పుడు ప్రపంచం మొత్తం అక్కడ జరిగిన సంఘటన పట్ల షాక్ తింటే మీడియా మటుకు అసలు కాల్చి చంపినవాడు ఏ మతస్తుడు అన్న దానిపై ఎక్కువ ఫోకస్ పెడుతుంది. ఎందుకంటే ఒకవేళ కాల్చి చంపిన ఉన్మాది పేరు ముస్లిం సమాజానికి చెందినది అయితే ఎంచక్కా ఓ రెండు వారాల పాటు కాల్చి చంపినోడి పేరుని బట్టి దానిని “ఇస్లామిక్ టెర్రరిజం” అనే ఓ దిక్కుమాలిన ట్యాగ్ తగిలించి, అది “హర్కతుల్ ముజాహిదీన్” చర్య? లేక అల్ ఖైదా చేసిన దాడా? అంటూ వారికి వచ్చే లేని పోనీ అనుమానాలన్నిటికీ మాంచి గరం మసాలా తగిలించి, గతంలో జరిగిన కొన్ని ఉగ్రవాద దాడులు దానికి జోడించి, అదే న్యూస్ ను తిప్పి తిప్పి రెండు వారాల పాటు తమ ‘టిఆర్‌పి’ రేటు కోసం ప్రసారం చేసుకునే అవకాశం దొరికేది! కానీ మసీదుపై దాడి చేసినోడు ముస్లిమేతరుడై చచ్చాడు!
బ్యాడ్ లక్! వాడు ఎవడో దరిద్రుడు “బ్రెంటన్” అంట. మీడియాతో సహా కొందరి డిసప్పాయింట్మెంట్ ఏమిటంటే పోనీ ఆ సచ్చినోడు ఆ కాస్సేపటి కోసమైనా ఏ ముస్లిం పేరో తగిలించుకుని చావోచ్చుగా! దరిద్రుడు దరిద్రుడు మంచి ఛాన్స్ మిస్ చేశాడు, ప్లాన్ మొత్తం చెడగొట్టాడు. బహుశా వాడు వచ్చే ముందు కన్సల్ట్ చెయ్యాల్సినోల్లని చెయ్యక ఆవేశంలో గన్ పట్టుకుని వచ్చేసి ఉంటాడు. పోనీ ఇప్పుడు వాడు పుట్టుకతో క్రైస్తవుడైతే దీనిని “క్రిస్టియన్ టెర్రరిజం” అందామా అంటే చెప్పేంత ధైర్యం మీడియాకు లేదు! అవకాశమూ లేదూ. లేదంటే వారి మనుగడే శూన్యం అయిపోతుంది కదా! పోనీ వాడు యూదుడైతే “జ్యూయిష్ టెర్రరిజం” అని చెప్పలేదు! అయినా తమను పెంచి పోషించేవారినే అలా అనొచ్చా తప్పుకాదు! అలా చెప్పేలా ఉంటే “ఇరాన్” “గాజా” “సిరియా” ల పై క్రైస్తవులు, యూదులు బాంబులు వేసి లక్షల మంది ముస్లిములను పొట్టనపెట్టుకున్నప్పుడే చెప్పి ఉండేది కదా! “క్రైస్తవుడు కాల్చి చంపితే” వాడు షూటర్! ముస్లిం కాల్చి చంపితే వాడు “టెర్రరిస్ట్”! క్రైస్తవులో, యూదులో, హిందువులో చంపితే అది “అటాక్”! అదే ముస్లిం పేర్లు తగిలించుకుని కొందరు ఉన్మాదులు ఎక్కడైనా కాల్పులు జరిపితే అది “ఇస్లామిక్ టెర్రరిజం”! ఇదీ మీడియా నామకరణం చేసిన పేర్లు.
శ్రీలంక లో ఆగస్టు 3 1990 లో ‘కట్టంకుడి’ మసీదులో జరిగిన కాల్పులు గుర్తున్నాయా? ఆరోజు LTTE మసీదులో చేసిన అచ్చం ఇలాంటి కాల్పుల్లోనే 147 మంది ముస్లిములు చనిపోయారు. అలా చంపేసినా చివరకు ఆశీమానంద స్వామీ బ్యాచ్ హైదారాబాద్ మసీదులో బాంబు పెట్టి అనేక మందిని ముస్లిములను చంపేసినా, ఇంకా గుజరాత్, రోహింగ్యా లాంటి చెదురుమదురు టెర్రరిస్ట్ దాడుల్లో అనేక వేలమంది ముస్లిములు చనిపోయినా అలాంటి సంఘటనలను బట్టి “హిందూ టెర్రరిజం” అని మీడియా చెప్పలేదు. అదొక్కటే కాదు టెర్రరిజానికి ఇస్లాంతో ముడిపెట్టి, “ఇస్లామిక్ టెర్రరిజం” అన్న క్రొత్త పేరును సృష్టించిన మీడియా ఎప్పుడూ తమ న్యూసుల్లో చూపని ఓ నిజం ఏమిటంటే 19 వ శతాబ్దంలో జరిగిన సకల టెర్రరిస్ట్ దాడుల్లో చనిపోయిన వారంతా అత్యధిక శాతం ముస్లిములే అన్నది.
ఇస్లాం 1400 సంవత్సరాలకు పూర్వం ప్రవక్త ముహమ్మద్ (స) ద్వారా పునరుద్ధరించబడింది! ‘టెర్రరిజం 100 సంవత్సరాలకు పూర్వం పుట్టింది’! ఇస్లాం అంటే అర్థం ‘శాంతి’! ఒకవేళ ముహమ్మద్ ఉగ్రవాదం ప్రేరేపిస్తే 23 సంవత్సరాల షార్ట్ పీరియడ్ లో ఆటవికులైన అరబ్బులను నైతిక విలువలకు ధ్వజవాహకులుగా ఎలా మార్చేస్తాడు? ఓ చిత్రంగానీ, ఓ విగ్రహం గానీ లేకుండానే 1400 సంవత్సరాలుగా తన ప్రభావం ప్రపంచవ్యాప్తంగా ఎలా వేస్తూ పోతున్నాడు? పైగా ఇస్లాం టెర్రరిజాన్ని ప్రేరేపిస్తే అది ప్రపంచంలో ఏ మతమూ వ్యాప్తిచెందనంత వేగంగా ఎందుకు వ్యాప్తి చెందుతుంది? క్రైస్తవ్యం, యూదత్వం మరే ఇతర మతాలకంటే ఎందుకు అత్యధికంగా అందరి ద్వారా స్వీకరించబడుతుంది? ఇప్పుడు మీడియా ఇస్లాం పై చేసే దుష్ ప్రచారం వల్ల కాస్త చదువుకుని ఆలోచన చేసేవారికి వారికి వస్తున్న ఆలోచనలు ఇవి. ఈ ఆలోచనల్లో నుండే అనేక మంది ఇస్లాంను మరింత లోతుల్లోకి వెళ్ళి రీసెర్చు చేసి ఇస్లాంకు దగ్గర అవుతున్నారు. ఏదైనప్పటికీ “ఏ మతమూ ఉగ్రవాదం బోధించదు, ఉగ్రవాదానికి మతం ఉండదు” అన్నది మటుకు మరోసారి రుజువైంది.
కాల్చింది ముస్లిమేతరుడు – డిసప్పాయింట్మెంట్ లో మీడియా!
