కచ్చితంగా పెళ్లికి రావాల్సిందే అని పట్టుబట్టిన నా స్నేహితుడి పెళ్లికి కాకినాడ నుండి తిరపతి బయలుదేరిన నేను ఆ ట్రైన్ లో నా ప్రక్క సీటులో కూర్చుని ఏదో సైంటిఫిక్ ప్రాజెక్ట్ చేస్తున్న ఆ వ్యక్తితో కాస్సేపు మాట్లాడాకా తెలిసింది అతను ఆస్ట్రానమీ చదువుతున్న స్టూడెంట్ మరియు మరి కొన్నాళ్లలో కాబోతున్న ఖగోళ శాస్త్రవేత్త అని.
ఎప్పుడైతే అతను ఆస్ట్రానమీ సబ్జెక్ట్ చదువుతున్నానని చెప్పాడో నాకు అతనితో ఇంకా చాలా విషయాలు మాట్లాడాలన్న ఆశక్తి పెరిగింది. చాలా విషయాలు మాట్లాడుతూ అతనితో నేను “సృష్టిలో ప్రతీ వస్తువు జంటలుగా సృష్టించబడి ఉన్నాయి ఈ అంశంపై ఎప్పుడైనా మీరు దృష్టి పెట్టరా? 1933 సం.లో ఈ విషయాన్ని ఆవిష్కరించినందుకు పాల్ డిరాక్ అనే బ్రిటిష్ సైంటిస్ట్ నోబెల్ ప్రైజ్ సైతం అందుకున్నాడు కదా” అన్నాను.
ఈ మాట చెప్పిన వెంటనే అతను “ఈ పాయింట్ మీకెలా తెలిసింది?” ఆల్రెడీ దీనిపై నేను స్టడీ చెయ్యటం కూడా జరిగిందన్నాడా మనిషి ఆశ్చర్యపోతూ.
నేను తెలుసుకున్న విషయం విశ్వం ప్రారంభమైందే ‘Particles’ మరియు ‘Anti-particle’ అనబడే “అనుకూల-ప్రతికూల” జంట కణాల సముదాయంతో ఇంకా విశ్వంలో ప్రతీ వస్తువూ “అణువుల (Atoms)” సముదాయంతో సృష్టించబడ్డాయని, ఇంకా అణువు నిరాణాన్నే తీసుకుంటే అణువులో న్యూక్లియస్ అనే కేంద్రకంతో పాటు ‘ఎలెక్ట్రాన్స్, పోసిట్రాన్స్’ ‘ప్రొటాన్స్-యాంటీ ప్రొటాన్స్’ ‘న్యూట్రాన్స్-యాంటీ న్యూట్రాన్స్’ అనే జంట కణాలు (Particles) తో కూడిన వ్యవస్థ ఉంటుంది. వీటిలో ఎలెక్ట్రాన్స్ అనబడేవి “ప్రతికూల విధ్యుత్ శక్తి (Negatively-charged) కణాలైతే.. వాటికి జంటగా ‘అనుకూల విధ్యుత్ శక్తి (Positively-charged) కణాలు పోసిట్రాన్స్ ను కలిగి ఉంటాయని.
మనిషి సైతం వీర్య కణం, అండంతో జత కడితేనే గానీ అతను ఉనికిలోకి రాడు. ఈ విధంగా సృష్టిలో అణువు నుండి బ్రహ్మాండం వరకూ ప్రతీదీ జంటలుగా, ఆయా వస్తువుల్లో అణువులు సైతం జంట కణాల ఆధారంగా సృష్టించబడ్డాయన్న విషయం తెలుసుకున్నానని చెప్పాను.
“మీ ఫీల్డ్ మెడికల్ అయినప్పటికీ ఆస్ట్రానామీ బాగానే స్టడీ చేశారు. “థియరీ ఆఫ్ పేయిర్స్” మీ దృష్టికి రావటం దానిపై ఈమాత్రం లోతైన పరిశీలన చెయ్యటం గ్రేటే అని అతను అన్న వెంటనే.. “మొక్కల్లో సైతం (Male-Female) జంటలు ఉంటాయన్న విషయం 1790 వరకు కూడా డిస్కవరి జరగలేదు కదా” అన్నాను.
Theory of Pairs లాంటి క్రిటికల్ సబ్జెక్ట్ ను లోతైన అనాలసి బాగా చేశారు. ఈ ఇన్ఫర్మేషన్ అంతా మీరు ఏ బుక్ నుండి కలెక్ట్ చేశారు? అన్న ప్రశ్నకు…
“ఖురాన్ నుండి” అన్నాను!
“మీరు చదివే ఖురాన్ లో ఈ కీలకమైన Theory of Pairs (జంటల సిద్ధాంతం) గురించి రాసుందా?”
అవును “ప్రతీ వస్తువును మేము జంటలుగా సృష్టించాము (51:49)” అని చెబుతుంది. ఇంకా మనిషి అవగాహనలోకి ఇంతవరకు రాని వస్తువులు సైతం జంటలుగా సృష్టించబడి ఉన్నాయని చెబుతూ అతని ల్యాప్ టాప్ లోనే గూగుల్లో ఖురాన్ ఆన్లైన్ రీడింగ్ లో ఈ క్రింది వాక్యం చూపించటం జరిగింది.
“అన్ని రకాలా జంటలను సృష్టించిన ఆయన పరిశుద్ధుడు. అవి భూమిలో నుండి పుట్టే వృక్షరాసులలోని వైనా సరే లేదా స్వయంగా వారి జాతిలో నుండి అయినా సరే లేదా వారు అసలే ఎరుగని వస్తువులలో నుండి అయినా సరే” – 36:36
ఇంత డీప్ విషయాన్ని ఖురాన్ ప్రస్తావించింది అన్నదే నన్ను ఆశ్చర్యానికి గురి చేస్తుందని” అతను అన్నంత వెంటనే..
ఒక్క Theory of Pairs మాత్రమే కాదు “గర్భంలో పిండం ఉదరకోశ గోడ, గర్భాశయ గోడ, అమినో కొరియోనిక్ అనే మూడు రకాల పొరల్లో, మూడు దశల్లో పెరుగుతుందని ఆధునిక పిండోత్పత్తి శాస్త్రం 20 వ శతాబ్దంలో పరిశోధించి చెప్పింది. ఖురాన్ ఇంత కీలకమైన విషయాన్ని కూడా 1400 సం. ల క్రితమే చెప్పింది “ఆయన మీ తల్లుల గర్భాలలో ‘మూడేసి చీకటి తెరల’లో మీకు ఒక రూపం తరువాత మరొక రూపాన్ని ఇస్తూ పోతున్నాడు (39:6)” అన్న వాక్యం చదివి వినిపించాను.
ఈ విషయాలు మాట్లాడిందుకు అతని ఆనందానికి అవధుల్లేవు. ఒక రిలిజియస్ బుక్ అయిన ఖురాన్ విషయంలో నా దృష్టి కోణం మీరు మార్చేశారు అన్నాడతను.
ఏదైనా విషయాన్ని ఆలోచించి అంగీకరించటం అన్నది కేవలం జ్ఞానం ఉన్న వ్యక్తులకే సాధ్యం అది లేని వ్యక్తులు మహా అయితే వితండ వాదన చెయ్యటం లేదా విమర్శించి తప్పుకోవటం తప్ప మరొకటి చెయ్యలేరనే విషయం ఆ వ్యక్తితో మాట్లాడాక ఇంకాస్త బలపడింది నాలో.
ఇలాంటి ఆధునిక సైన్స్ ఆవిష్కరించిన ఎన్నో లోతైన అంశాలను ఖురాన్ ప్రస్తావించింది.
కక్ష్యల గురించి, బిగ్ బ్యాంగ్ థియరీ గురించి సైతం ఖురాన్ ప్రస్తావించించింది.. వీలైతే మీరు చదవగలరు అని అతనితో చెప్పాను.
తప్పనిసరిగా చదువుతానని మాటిచ్చిన అతను.. ఇంకాస్సేపట్లో అతను దిగాల్సిన స్టేషన్ రాబోతుందనగా..
“మంచి సైంటిఫిక్ డిస్కషన్ చేస్తూ ఇంత గొప్ప సమాచారం ఇచ్చినందుకు మీకు నాదగ్గర ప్రస్తుతం ఇవ్వటానికి గిఫ్ట్ అంటూ ఏమీ లేదంటూ వెంటనే అతని బ్యాగ్గులో నుండి “స్టీఫెన్ హాకింగ్స్ – ది గ్రాండ్ డిజైన్” పుస్తకాన్ని గిఫ్ట్ ఇచ్చేశాడతను.
“మీరు ఈ పుస్తకాన్ని స్టడీ చెయ్యండి. ఈ సృష్టి అన్నది అత్యద్భుతమైన ఒక గ్రాండ్ డిజైన్ అన్న విషయాన్ని స్టీఫెన్ హాకింగ్స్” ఈ పుస్తకంలో రాసుకొచ్చాడు.
ఈ పుస్తకం నేను పూర్తిగా చదవలేదు. కానీ మీకేందుకో ఈ పుస్తకం గిఫ్ట్ ఇవ్వాలనిపించింది” అంటూ అతను ప్రజెంట్ చేసిందే ఈ పుస్తకం. ఈరోజుకూ నా బుక్ షెల్ఫ్ లో ఉంది.
దాదాపు 12 సంవత్సరాల క్రితం 2010 లో జరిగిందీ సంఘటన. ఆరోజు రాత్రి ఎంతో సంతోషంగా షేక్ హ్యాండ్ ఇచ్చి ట్రైన్ దిగి వెళ్లిపోతున్న ఆ మనిషిని చూస్తున్నప్పుడు ఎందుకో ఖురాన్ లోని ఈ క్రింది వాక్యం అకస్మాత్తుగా గుర్తుకొచ్చింది…
“ఈ ఉదాహరణలను మేము ప్రజలకు అర్థం చేసుకోవాలని వివరిస్తున్నాము. మరియు జ్ఞానం కలవారు తప్ప ఇతరులు వీటిని అర్థం చేసుకోలేరు” – 29:43
ఆ యువ శాస్త్రవేత్త ఆశ్చర్యపడిపోయాడు
